Bichagadu 2 Movie Review: బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

Bichagadu 2 Telugu Review: బిచ్చగాడు అనేది ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తేలిసిన విషయం, అయితే బిచ్చగాడు విడుదల ఐనప్పటినుంచి, ప్రేక్షకులు అందరు, బిచ్చగాడు 2 గురించి ఎదురుచూస్తూనే ఉన్నారు. చాల కారణాల వల్ల దాదాపు ఏడూ సంవత్సరాలు పట్టింది, కానీ ఒక్కసారి విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక, బిచ్చగాడు 2 ఎప్పుడు విడుదలవుతుందా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బిచ్చగాడు తెలుగులో మంచి విజయం సాధించడం తో విజయ్ ఆంటోనీ ఈ బిచ్చగాడు 2 చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసాడు, ఇక ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.

Bichagadu 2 Movie Review

కథ

విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోనీ ) దేశం లో రిచెస్ట్ మ్యాన్ అని పేరు, లక్ష కోట్లకి వారసుడు ఐన విజయ్ గురుమూర్తి మీద చాల మంది కళ్ళు ఉంటాయి, అయితే విజయ్ గురుమూర్తి అనుకోకుండా చనిపోవడం తో, విజయ్ గురుమూర్తి పోలికలతో ఉన్న అతన్ని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు, అయితే ఉన్నట్టుండి ఆ వ్యక్తి విజయ్ గురుమూర్తి లాగా మాట్లాడ్డం ఆలోచించడం చేస్తాడు, దీని వెనక బ్రెయిన్ ట్రాన్స్ప్లాన్టేషన్ అనేది ఉందని తెల్సుకుని అతని చంపడానికి ప్రయతిస్తు ఉంటారు కొందరు., చివరికి అసలు విజయ్ గురుమూర్తి ని పోలిన వ్యక్తి ఎవరు? అనేది మీరు మూవీ చూసి తెల్సుకోవాలి.

బిచ్చగాడు 2 మూవీ నటీనటులు

విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దేవ్ గిల్, హరీష్ పెరడి, రాధా కృష్ణమూర్తి మరియు తది తరులు నటించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని దర్శకత్వం వహించారు, ఓం నారాయణ్ ఛాయాగ్రహణం, విజయ్ ఆంటోనీ సంగీతం, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పైన ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.

సినిమా పేరుబిచ్చగాడు 2
దర్శకుడువిజయ్ ఆంటోనీ
నటీనటులువిజయ్ ఆంటోని, కావ్య థాపర్, దేవ్ గిల్, హరీష్ పెరడి, రాధా కృష్ణమూర్తి మరియు తదితరులు
నిర్మాతలుఫాతిమా విజయ్ ఆంటోనీ
సంగీతంవిజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీఓం నారాయణ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

బిచ్చగాడు 2 సినిమా ఎలా ఉందంటే?

బిచ్చగాడు చాల పెద్ద విజయం సాధించడంతో, ప్రేక్షకులు బిచ్చగాడు 2 కోసం చాల ఎదురుచూసారు, అయితే బిచ్చగాడు 2 అని టైటిల్ తప్ప ఈ బిచ్చగాడు 2 ఏ రకంగానూ బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ లాగ ఉండదు. బిచ్చగాడు లో తల్లి ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ ఎమోషన్, ఆలా ఈ చిత్రం ఎక్కడ కూడా ఆ ఎమోషన్ కనిపించదు, ఒక క్రైమ్ కేసు కి సైన్స్ ని జోడించి, ఎం చెప్పాలి అనుకున్నారు క్లారిటీ ఉండదు. ప్రేక్షకుడికి నచ్చే అంశాలు ఎం లెవా అంటే కొన్ని ఉన్నాయి కానీ వాటి కోసం సినేమకి అయితే వెళ్లడం సాహసమనే చెప్పొచ్చు.

విజయ్ ఆంటోనీ, ద్విపాత్రాభిమయం చేసిన ఈ చిత్రం లో తన పాత్రలకి న్యాయం చేసాడు, ఇక కావ్య థాపర్ కి పెద్ద గా స్కోప్ అయితే ఎం లేదు, ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగా చేసారు.

విజయ్ ఆంటోనీ కథని అంత బాగా హ్యాండిల్ చెయ్యలేకపోయారు, అన్ని బాధ్యతలు తానే చూసుకోవడంతో అన్నింటికీ సరిగా న్యాయం చేయలేకపోయారు. కొన్ని అంశాలను బాగానే డీల్ చేసినప్పటికీ, ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయడం లో విఫలం అయ్యాడనే చెప్పాలి.

సాంకేతికాంగా ఈ చిత్రం బాగుంది, విజయ్ ఆంటోనీ అందించిన పాటలు అంతగా లేవు కానీ, నేపధ్య సంగీతం పర్వాలేదు, ఇక ఓం నారాయణ్ ఛాయాగ్రాహణం బాగుంది.

ఓవర్ అల్ గా, ఈ బిచ్చగాడు 2 వన్ టైం వాచ్ చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • ఛాయాగ్రహణం
  • కొన్ని సన్నివేశాలు
  • యాక్షన్

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ కథ, కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు