Vimanam Telugu Review: సముద్రఖని తెలుగు ప్రేక్షకులకి ఒక విలన్ గా సుపరిచితం, కానీ అతను మంచి నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా, పవన్ కళ్యాణ్ తో బ్రో ది అవతార్ చిత్రానికి దరఃసకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు విలన్ పాత్రలనే చేసిన సముద్రఖని, ఈసారి అందుకు భిన్నంగా , ఒక కొడుకుకి తండ్రి గా అందులోనూ వికలాంగుడిగా విమానం అనే చిత్రంలో నటించారు. ఇక ట్రైలర్ తో మంచి స్పందన లభించింది, ఇక ఈ చిత్రం ఈరోజు విడుదలయింది ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
వీరయ్య (సముద్రఖని ) వికలాంగుడు, వికలాంగుడి కోటాలో వచ్చే డబ్బుతో తన కొడుకు తో జీవిస్తూ ఉంటాడు, అయితే చిన్నపట్నుంచి తన కొడుకుకి విమానం అంటే చాల ఇష్టం, అన్ని రకాల విమానాల బొమ్మలని ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. అయితే ఒకరోజు తన కొడుకుకి ఎలాగైనా విమానం ఎక్కాలనే కోరిక ఉందని వీరయ్య కి తెలుస్తుంది. దింతో విశాఖపట్నం కి 10,000 టికెట్ అని చెప్పడంతో,100 రూపాయలకే కష్టంగా ఉన్న రోజులల్లో 10,000 ఎలా తెచ్చాడు, వీరయ్య తన కొడుకుని విమానం ఎక్కించడానికి ఎం చేసాడనేది మిగిలిన కథ.
విమానం మూవీ నటీనటులు
సముద్రకని, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, తదితరులు నటించిన ఈ చిత్రాన్ని శివ ప్రసాద్ యానాల దర్శాలత్వం వహించారు. వివేక్ కాలేపు ఛాయాగ్రహణం, చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి మరియు జీ స్టూడియోస్ నిర్మించారు.
సినిమా పేరు | విమానం |
దర్శకుడు | శివ ప్రసాద్ యానాల |
నటీనటులు | సముద్రకని, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, తదితరులు |
నిర్మాతలు | కిరణ్ కొర్రపాటి మరియు జీ స్టూడియోస్ |
సంగీతం | చరణ్ అర్జున్ |
సినిమాటోగ్రఫీ | వివేక్ కాలేపు |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
విమానం సినిమా ఎలా ఉందంటే?
కొడుకు కోరికని తీర్చడానికి తండ్రి పడే వేదన అని గుర్తొస్తే మనకి వెంటనే గుర్తొచ్చే చిత్రం జెర్సీ. ఇక ఈ విమానం లో కూడా అదే పాయింట్ ఉన్నప్పటికీ, ఒక వికలాంగుడైన తండ్రి, తన కొడుకుని ఎలాగైనా విమానం ఎక్కించాలి, దానికోసం ఆ తండ్రి ఎన్ని సమస్యల్ని ఎదుర్కున్నాడు అనేది ఈ సినిమాకి ప్రధాన బలం.
ఇక ఈ చిత్రం భావోద్వేగాలతో కూడుకున్న చిత్రం కాబట్టి, స్లో గా ప్రారంభమై, ప్రధాన పాత్రలని పరిచయం చేస్తుంది. మొదటి సగంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, కొన్ని కామే స్కీన్లు, అనసూయ ఎంట్రీతో ఆలా సాగిపోతుంది.
ఇక రెండవ భాగం మొత్తం భావోద్వేగంతో నిండి పోతుంది, తండ్రి తన కొడుకుని వినమనం ఎక్కించడానికి అయ్యే ఖర్చు 10,000, ఇక ఈ 10,000 కోసం వికలాంగుడైన వీరయ్య ఎలా కష్టపడ్డాడు అనేది చివరిదాకా చూసే ప్రేక్షకుణ్ణి సీట్ లో చివరి వరకు కూర్చోపెడుతుంది.
వీరయ్య పాత్రలో సముద్రఖని నటించడం కంటే జీవించేసాడనికి చెప్పొచ్చు. కొడుకుకి మరియు వీరయ్య కి మధ్య వచ్చే సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తానే డబ్బింగ్ చెప్పడంతో ఒక అమాయకత్వం ప్రతి సన్నివేశం లో కనిపిస్తుంది. ఇక మాస్టర్ ధృవన్ కూడా అంతే అద్భుతంగా నటించాడు, ఇక రాహుల్ రామకృష్ణ, అనసూయ, ధన్రాజ్ ఉన్నంతలో బాగానే చేసారు.
శివ ప్రసాద్ యానాల ఎంచుకున్న లైన్ కొత్తగా లేకపోయినా, తెరకెక్కించిన విధానం సగటు ప్రేక్షకుని కదిలిస్తుంది. ఇక మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని మెప్పించడంలో విజయం సాధించారని చెప్పొచ్చు.
సాంకేతికంగా, విమానం బాగుంది, ఇక చరణ్ అర్జున్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది, వివేక్ కాలేపు ఛాయాగ్రహణం పర్వాలేదు కానీ ఇంకా బాగుండాల్సింది.
చివరగా, వినమనం, భావోద్వేగాలతో నిండిన ప్రయాణం.
ప్లస్ పాయింట్లు:
- నటన
- కథనం
- ఎమోషన్
- నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్లు:
- అక్కడక్కడా స్లో నరేషన్
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి: