Takkar Movie Review: టక్కర్ మూవీ రివ్యూ

Takkar Telugu Review: సిద్ధార్థ్ అంటే మొదటగా గుర్తొచ్చేది, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి కల్ట్ చిత్రాలు. ఇక లవర్ బాయ్ అనే పేరుకు కె / అఫ్ అడ్రస్ సిద్ధార్థ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లవ్ స్టోరీస్ చేసి చేసి బోర్ కొట్టిన సిద్ధార్థ, కొన్ని సంవత్త్సరాలుగా సీరియస్ పాత్రలని చేస్తూ వస్తున్నాడు, అయితే చాల గ్యాప్ తరువాత మహా సముద్రం అనే చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు, కానీ అది అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు మల్లి టక్కర్ అనే చిత్రంతో మన ముందుకొచ్చాడు, తెలుగు మరియు తమిళ్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని, సిద్ధార్థ్ తెలుగు బాగా ప్రమోట్ చేసారు, ఇక ఎట్టకేలకు ఈ చిత్రణ ఈరోజు విడుదలయింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండ ఈ చిత్రం ఎలా ఉందొ తెల్సుకుందాం.

Takkar Movie Review

కథ

ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి డబ్బే అన్నింటిని నడిపిస్తుంది, ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే లక్ష్యం తో తిరుగుతూ ఉంటాడు, ఈ ప్రాసెస్ లో తనకి విరుద్ధమైన ఆలోచనలతో ఉన్న ఒక డబున్న అమ్మాయి పరిచయం అవువుతుంది. ఇద్దరు ప్రేమలో పడిపోతారు అయితే తాను ప్రేమించిన అమ్మాయిని కిడ్నప్ చేసి తీసుకు వస్తే చాల డబ్బు ఇస్తానని ఆఫర్ చేయడంతో తనని కిడ్నప్ చేసి తీసుకువెళ్తాడు. చివరికి ఈ జర్నీ ఎలా సాగింది అనేది మీరు సినిమాలో చూసి తెల్సుకోవాలి.

టక్కర్ మూవీ నటీనటులు

సిద్ధార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, తదితరులు. కార్తీక్ జి క్రిష్ దర్శాకత్వం వహించిన ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం, వాంచినాథన్ మురుగేషన్ ఛాయాగ్రాణం అందించారు. ఇక ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

సినిమా పేరుటక్కర్
దర్శకుడుకార్తీక్ జి క్రిష్
నటీనటులుసిద్ధార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, తదితరులు
నిర్మాతలుటీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సంగీతంనివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫీవాంచినాథన్ మురుగేషన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

టక్కర్ సినిమా ఎలా ఉందంటే?

టక్కర్ చిత్రం ఏ విధంగానూ కొత్తగా అనిపించదు, ఇక ఈ చిత్రం విజువల్స్ చూస్తుంటే ఏదో త్రీ సంవత్సర క్రితం తిసారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి టక్కర్ కమర్షియల్ చిత్రమే ఐన రెగ్యులర్ కమర్సియల్ చిత్రం లాగా అయితే అనిపించదు.

మొదటి సగం, హీరో ఏది ఏమైనా డబ్బు సంపాదించాలనే లక్ష్యం తో ఉందని బాగా ఎస్టాబ్లిష్ చేసారు, ఇక హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కథకి ఉపయోగపడేలానే తీర్చిదిద్దారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తాయి. చాల లయెర్స్ తో ముడి పది ఉన్న ఈ కథ, ఇంటర్వెల్ దగ్గర మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రెండవ భాగం చూసేల ఎండ్ అవుతుంది.

ఇక రెండవ సగం, హీరో కి డబ్బు మాత్రమే ప్రధాన అని తెలిసి, దాన్ని హీరోయిన్ కి సంబందించినా బిజినెస్ కి ముడి పెట్టడంతో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇక ఎప్పుడవుతే తన ప్రేయసిని కిడ్నప్ చేసి తీసుకు వస్తే చాల డబ్బు ఇష్టం అని చెప్పడం తో, అక్కడై నుంచి మంచి ఫాస్ట్ స్క్రీన్ప్లేతో ఎంగేజ్ చేస్తుంది.

సిద్ధార్థ్ కి ఇలాంటి పాత్రలన్నీ కొత్తేమి కాదు, ఎక్కువ లవ్ స్టోరీస్ లో చూసే సరికి, తన లుక్ అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇక పెద్దగా సవాలు విసిరే పాత్ర కాకపోయినా, తన పాత్రకి న్యాయం చేసాడు. ఇక దివ్యంశ గత చిత్రాల్లో మాదిరే రొమాన్స్ కె పరితం కాకుండా వాటితో పటు కథలో భాగమైంది, కానీ నటించడంలో మాత్రం విఫలమైంది. ఇక సీరియస్ గా వెళ్తున్న టైం లో యోగి బాబు తన మార్కు కామెడీ తో బాగా నవ్విస్తాడు. ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగా చేసారు.

కార్తీక్ జి క్రిష్ ఎంచుకున్న కథ అంతే కొత్తగా లేదు, కానీ సగటు ప్రేక్షకుణ్ణి మెప్పించే అంశాలని జోడించి కొంతమేరకు విజయం సాధించాడనే చెప్పొచ్చు.

సాంకేతికంగా టక్కర్ బనే అనిపిస్తుంది, నివాస్ కె ప్రసన్న నిరా అనే పాట రిలీజ్ కి ముందే మంచి హిట్ ఐంది, ఇక మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోవు మరియు నేపధ్య సంగీతం పర్వాలేదు కానీ ఇంకా బాగుండాల్సింది. వాంచినాథన్ మురుగేషన్ ఛాయాగ్రహణం కథకి తగ్గట్టు బాగుంది.

ఓవరాల్ గా, టక్కర్ వన్ టైం వాచ్ కార్సియల్ మూవీ

ప్లస్ పాయింట్లు:

  • కథనం
  •  నేపధ్య సంగీతం
  • కొన్ని సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు