Adipurush Movie Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ

Adipurush Review: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు , కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్, అజయ్ – అతుల్ మరియు సకెత్ పరంపర సంగీతం అందించారు మరియు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ మరియు ఓం రౌత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Adipurush Movie Review

కథ

7000 సంవత్సరాల క్రితం రావణుడు (సైఫ్ అలీ ఖాన్ ) సీత ని (క్రితి సనన్ ) ని అపహరించడం తో, అయోధ్యలో ఉన్న రాఘవుడు (ప్రభాస్ ) ఈ విషయాన్నీ తెలుసుకున్న తరువాత, రావణుడితో యుద్ధం ప్రకటించి సీత ని తీసుకురావడానికి లంకకి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. చివరికి రాఘవుడు ఎదుర్కున్న సమస్యలేంటి, ఎలా రావణుణ్ణి ఓడించాడు అనేది మిగతా కథ.

ఆదిపురుష్ మూవీ నటీనటులు

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు, కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్, అజయ్ – అతుల్ మరియు సకెత్ పరంపర సంగీతం అందించారు మరియు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ మరియు ఓం రౌత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుఆదిపురుష్
దర్శకుడుఓమ్ రౌత్
నటీనటులుప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్, తదితరులు
నిర్మాతలుభూషణ్ కుమార్, కృష్ణ కుమార్ మరియు ఓం రౌత్
సంగీతంఅజయ్ – అతుల్
సినిమాటోగ్రఫీకార్తీక్ పళని
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఆదిపురుష్ సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఆదిపురుష్, మొత్తానికి థియేటర్ లో సందడి చేస్తుంది. చిత్రం చాల ఇంట్రెస్టింగ్ గా ప్రారంభం అవువుతుంది, అయితే ఈ కథ అందరికి తెలిసిన కథే ఐన, తెర మీద చూడటం ఒక కొత్త అనుభూతి అని చెప్పొచ్చు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన రామాయణం ని తెర పై ఆవిష్కరిస్తున్నాం అని కావొచ్చు, దర్శకుడు ఓమ్ రౌత్ మనం పుస్తకాలలో చదివిన రామాయణాన్ని తెర పై చూపించాడు.

అయితే కథని చెప్పే విధానం చాల స్లో గా ఉన్నప్పటికీ, చిత్రం లో ఒళ్ళు గగుర్పుడిచే పతాక సన్నివేశాలు ఉండడంతో మనల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది. అయితే చిత్రం టీజర్ విడుదలైనప్పట్నుంచి వి ఎఫ్ ఎక్స్ మీద చాల నెగటివిటీ వచ్చేసింది, అయితే అందుకు తగ్గట్టే చిత్రం లో చాల వరకు వి ఎఫ్ ఎక్స్ బాగా లేదు, కానీ పతాక సన్నివేశాలు, కొన్ని కీలక సన్నివేశాల్లో అయితే వి ఎఫ్ ఎక్స్ బాగా కుదిరింది. ఏది ఏమైనప్పటికి ఆదిపురుష్ అందరు చూడాల్సిన చిత్రం. ఎందుకంటే రామాయణాన్ని మనం ఇంతవరకు బుక్స్ లో చదవడం లేదా సీరియల్స్ లో చూడటం , కానీ ఈ చిత్రం మంచి థియేట్రికల్ ఎక్సపీరియన్సు ఇస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

రాఘవ గా ప్రభాస్ చాల బాగా చేసాడు, కీలక సన్నివేశాల్లో తాను పలికించిన హావ భావాలూ స్క్రీన్ మీద చాల బాగా పండాయి, అయితే లుక్ మీద కొంచెం శ్రద్ధ తీస్కుని ఉంటె బాగుండేది, చాల చోట్ల పేస్ ని కూడా చాల సాఫ్ట్ చేసారు అని కనిపిస్తూ ఉంటుంది. ఇక సీత గా క్రితి సనన్ చాల బాగా చేసింది, ఇక మిగతా నటీనటులు తమ తమ పాత్రల మేరకు బాగా చేసారు.

దర్శకుడు ఓమ్ రౌత్, ఒక చరిత్రని తీసుకుని కథని కొంచెం కొత్తగా ప్రెసెంట్ చేస్తాడేమో అని అనుకున్నాం, కానీ ఎటువంటి రిస్క్ చేయకుండా పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు ప్రెసెంట్ చేసాడు, అయితే ఏది ఏమైనప్పటికి ప్రేక్షకులని మెప్పించడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా, ఆదిపురుష్ పర్వాలేదు, అజయ్ – అతుల్ పాటలు పర్వాలేదు కానీ వారి నేపధ్య సంగీతం చిత్రాన్ని ఇంకో స్థాయి కి తీసుకెళ్లింది, ఇక కార్తీక్ పాలని ఛాయాగ్రహణం కూడా సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.

చివరగా, ఆదిపురుష్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • నటన
  •  నేపధ్య సంగీతం
  • పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • స్లో నరేషన్

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు