Samajavaragamana Telugu Review: శ్రీ విష్ణు ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు, మరియు తనకంటూ ఒక గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. వరుసగా హిట్లు కొట్టిన తాను, గత రెండు, మూడు చిత్రాలు పరాజయం అవ్వడంతో, ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ సమజవరాగమనా చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఇక ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
బాలు( శ్రీ విష్ణు) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, సినిమా హాల్ లో బాక్స్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు, దీంతో అతన్ని అందరూ బాక్స్ ఆఫీస్ బాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ బాలు కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తాను బాలు కుటుంబానికి కూడా చాల క్లోజ్, దీంతో బాలు తండ్రి తో పాటు బాలు గర్ల్ ఫ్రెండ్ బాలు పేరు చెప్పు కుని సినిమాలు చూస్తూ ఉంటారు. అయితే అంత బాగానే ఉంది అనుకునే సమయానికి బాలు కి ఒక శోకేకింగ్ విషయం తెలుస్తుంది, అది ఏంటి అనేది మీరు చిత్రం చూసి తెల్సుకోవాలి.
సామజవరగమన మూవీ నటీనటులు
శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్, ప్రధాన పాత్రల్లో నటించగా, వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సంగీతం గోపీ సుందర్, ఛాయాగ్రహణం రామ్ రెడ్డి, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | సామజవరగమన |
దర్శకుడు | రామ్ అబ్బరాజు |
నటీనటులు | శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్, వెన్నెల కిషోర్, నరేష్, తదితరులు |
నిర్మాతలు | రాజేష్ దండా |
సంగీతం | గోపీ సుందర్ |
సినిమాటోగ్రఫీ | రామ్ రెడ్డి |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
సామజవరగమన సినిమా ఎలా ఉందంటే?
ఒకప్పుడు కామెడీ చిత్రాలు అంటే చాల సహజంగా ఉండే కామెడీ తో చాల అద్భుతమైన చిత్రాలని మనకు అందించారు మన జంధ్యాల గారు గాని, కె. విశ్వనాధ్ గారు గాని, కానీ ఇప్పుడు కామెడి చిత్రం అంటే ప్రాసలతో, బలవంతంగా ఇరికించినట్టు ఉండే కామెడీతోనే చాల చిత్రాలు వస్తున్నాయి, అయితే ఇలాంటి టైం లో కూడా కొన్ని మంచి కామెడి చిత్రాలు అయితే వచ్చాయి, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది , మిడిల్ క్లాస్ మెలోడీస్ ఇంకా కొన్ని.
ఇక ఈ సామజవరగమన కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది, చిత్రం లో కథ కొత్తగా లేకపోయినా, ఆధ్యంతం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే ప్రయత్నమే చేసారు. చిత్రం మొదలైన దగ్గర్నుంచి ఎండ్ వరకు నవ్విస్తుంది. అయితే కథ పైన కూడా ఫోకస్ చేసి ఉంటె ఇంకా బాగుండేది. కానీ ఏది ఏమైనప్పటికి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చాల రోజులుగా శ్రీ విష్ణు మంచి విజయం కోసం చూస్తూ ఉన్నది, సరిగ్గా ఎలాంటి టైం లో ఈ చిత్రం పడటం మంచి అదృష్టం అని చెప్పొచ్చు, ఇక బాక్స్ ఆఫీస్ బాలు అనే పాత్రలో చాల బాగా నటించాడు, ఎలాంటి పాత్ర తనకి కొత్హెం కాకపోయినా, తనదైన కామెడీ తో ప్రెకషకులని మెప్పించాడు. మళయాలం నటి రెబా మోనికా జాన్ కి కూడా మంచి స్క్రీన్ టైం ఉన్న పాత్ర దొరకడంతో తాను కూడా బాగా చేసింది, ఇక ఈ చిత్రం లో భారీ తారాగణం ఉండడం తో వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్ మరియు నరేష్ ఎవరికీ వారు నవ్వించడంలో పాలు పంచుకున్నారు.
దర్శకుడు, వివాహ భోజనంబు తో మంచి ప్రశంసలు అందుకున్నా రామ్ అబ్బరాజు, ఈసారి కూడా సహజమైన కామెడి నే ఎంచుకుని ప్రేక్షకులని నవ్వించటంలో విజయం సాధించాడని చెప్పొచ్చు.
సాంకేతికంగా, సామజవరగమన పర్వాలేదు, గోపీ సుందర్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం బాగుంది, రామ్ రెడ్డి ఛాయాగ్రహణం పర్వాలేదు.
చివరగా, సామజవరగమన అన్ని వర్గాల ప్రేక్షకులని నవ్విస్తుంది.
ప్లస్ పాయింట్లు:
- కామెడీ
మైనస్ పాయింట్లు:
- కథ
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Kerala Crime Files Series Review: కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ రివ్యూ
- Vimanam Movie Review: విమానం మూవీ రివ్యూ
- Takkar Movie Review: టక్కర్ మూవీ రివ్యూ