Spy Movie Review: స్పై మూవీ రివ్యూ

Spy Telugu Review: కార్తికేయ 2 నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేసింది, అయితే ఆ తరువాత వచ్చిన 18 పేజెస్ అంతగా మెప్పించక పోయిన, ఈ స్పై అనే చిత్రానికి మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇక ఈసారి దేశభక్తి చిత్రం స్పై తో మన ముందుకు వచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Spy Movie Review

కథ

జై( నిఖిల్ ) ఒక అండర్ కవర్ ఏజెంట్, తన అన్నని ఎవరు చంపారో తెల్సుకోవాలి అనే ప్లాన్ తో ఉంటాడు, ఇదే సమయంలో ఖాదిర్ ని చంపమని ప్రపంచానికి చెప్పిన ఇండియన్ గోవెర్నెమెంట్, సడెన్గా తను బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది, దీంతో ఇండియన్ RAW అందరి ఏజెంట్స్ ని అసెంబ్లీ చేస్తుంది, ఈ ఖాదిర్ ని పట్టుకునే మిషన్ ని జై లీడ్ చేస్తాడు, అయితే ఖాదిర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ కి సంబంధించిన ఫైల్స్ తో ఒక ప్లాన్ వేస్తాడు, ఇది తెలుసుకున్న జై, నేతాజీ డెత్ మిస్టరీని తెలుసుకోవాలని ప్రయాణం సాగిస్తాడు. చివరికి జై ఆ నిజాన్ని తెల్సకున్నాడా అనేది చిత్రం చూసి తెల్సుకోవాలి.

స్పై మూవీ నటీనటులు

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి ,తదితరులు. దర్శకత్వం మరియు ఎడిటింగ్ గ్యారీ బి హెచ్, కథ మరియు నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి, ఛాయాగ్రహణం వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, సంగీతం విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల, నేపధ్య సంగీతం శ్రీచరణ్ పాకాల.

సినిమా పేరుస్పై
దర్శకుడుగ్యారీ బి హెచ్
నటీనటులునిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి, తదితరులు
నిర్మాతలుకె రాజశేఖర్ రెడ్డి
సంగీతంవిశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీవంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

స్పై సినిమా ఎలా ఉందంటే?

మనం స్పై సినిమాలు చాలానే చూసాం, అయితే ఈ స్పై కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ కొత్తదనం చిత్రం మొదలైన ఒక 20 నిమిషాల వరకు ఉంటుంది, ఆ తరువాత మాములు స్పై చిత్రాల మూసలో వెళ్ళిపోతూ ఉంటుంది.

ఇక మొదటి సగం హీరో లవ్ ట్రాక్, మధ్యలో హీరో మిషన్ లో పాల్గొనటం, ఒక రెండు మూడు కామెడి సన్నివేశాలతో ఆలా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగా వర్కువుట్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే, అక్కడినుంచి రెండవ భాగం, ఒక ఖదీర్ అనే మోస్ట్ వాంటెడ్ ని పట్టుకోవాలి అనే గోల్ నుంచి, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ డెత్ మిస్టరీ మీదకి మళ్లడం తో ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. అయితే చిత్ర యూనిట్ నేతాజీ డెత్ మిస్టరీ పైన బాగా రీసెర్చ్ చేసినట్టు కనిపిస్తుంది.

కార్తికేయ 2 తో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్, మొదటి సరి ఈ స్పై పాత్రని పోషించాడు. అయితే జై పాత్రలో కొత్తదనం లేకపోగా, నిఖిల్ కూడా పర్వాలేదన్పిస్తాడు. ఇక తమిళ్ నటి ఐశ్వర్య మీనన్ పాత్ర కి కూడా ఏ మాత్రం ప్రాధ్యాన్యత లేకుండా డిజైన్ చేసారు, అభినవ్ గోమఠం ని కామెడీ సన్నివేశాలలో చూసి అలవాటు పడిన ప్రేక్షకులు ఇలాంటి సీరియస్ పాత్రలో చూసి జీర్ణించుకోవడం కొంచెం కష్టమే, ఇక తనకి ఈ పాత్ర ఏ మాత్రం సూట్ అవ్వలేదన్పిలుస్తుంది. ఇక రానా దగ్గుబాటి సడెన్ ఎంట్రీ తో ఒక్కసారి థియేటర్ ఉర్రుతలూగిపోతుంది, అయితే తన పాత్ర చిత్రానికి హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. మిగిలిన నటి నటులు తమ పాత్రల మేరకు పర్వాలన్పించారు.

ఎడిటర్ గా మంచి గుర్తింపు సంపాదించిన గ్యారి బి హెచ్, ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయమయ్యాడు, అయితే అడవి శేష్ నటించిన గూఢచారి కి ఎడిటర్ గా పని చేసిన గ్యారి, ఈ చిత్రాన్ని అంత ఎంగేజింగ్ గా తీయలేకపోయాడు. పాక్షికంగా ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా, స్పై పర్వాలేదు, అక్కడక్కడా VFX పేలవంగా ఉంది, ఇక శ్రీ చరణ్ పాకాల పాటలు అంతగా ఆకక్కటుకోవు కానీ నేపధ్య సంగీతం తో తన వంతు కృషి చేసాడు.

ఇక చివరగా, స్పై చిత్రం వన్ టైం వాచ్.

ప్లస్ పాయింట్లు:

  • కొత్త పాయింట్
  • ట్విస్టులు

మైనస్ పాయింట్లు:

  • కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు