Rangabali Telugu Review: చాల కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్య కి కృష్ణ వ్రింద విహారితో పర్వాలేదన్పించుకున్నాడు, అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని రంగబలి అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు. ఇక ట్రైలర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం, సత్య మరియు నాగ షోర్య చేసిన ఒక ఇంటర్వ్యూ తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఈ చిత్రం ఎలా ఉంది ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కథ
సొంత ఇల్లు, సొంత పొలం లేకపోయినా పర్వాలేదు కానీ సొంత ఊరు మాత్రం కచ్చితంగా ఉండాలి అనే నమ్మే ఒక కుర్రాడు, తన తండ్రి మెడికల్ షాప్ ని నడిపించాలంటే, తనకున్న మెడికల్ జ్ఞానం సరిపోదని ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు, అక్కడే ఒక అమ్మాయి ని చూసి ప్రేమలో పడతాడు, అయితే అంత బాగానే ఉంది అనుకున్న సమయంలో తన సొంత ఊరిలో లోకల్ రాజకీయనాయకుడు ఒక విషయం లో మెడికల్ షాప్ పోతుంది, దీంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి, ఆ రాజకీయనాయకుడు మెడికల్ షాప్ ఎందుకు కూల్చేశాడు అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.
రంగబలి మూవీ నటీనటులు
నాగ శౌర్య, యుక్తి తారాజ, సత్య, బ్రహ్మాజీ, షైన్ టామ్ చాకో మరియు తదితరులు .పవన్ బాసంశె ట్టి దర్శకుడు, పవన్ సిహెచ్ సంగీతం, దివాకర్ మణి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి , కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, మరియు సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | రంగబలి |
దర్శకుడు | పవన్ బాసంశె ట్టి |
నటీనటులు | నాగ శౌర్య, యుక్తి తారాజ, సత్య, బ్రహ్మాజీ, షైన్ టామ్ చాకో మరియు తదితరులు |
నిర్మాతలు | సుధాకర్ చెరుకూరి |
సంగీతం | పవన్ సిహెచ్ |
సినిమాటోగ్రఫీ | దివాకర్ మణి |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
రంగబలి సినిమా ఎలా ఉందంటే?
ప్లాప్ లతో సంబంధం లేకుండా నాగ శౌర్య సినిమాలు చేస్తూనే ఉన్నాడు, అయితే కృష్ణ వ్రింద విహారి తో ఓ మోస్తరు విజయం సాధించాడని చెప్పొచ్చు, ఇక ఇప్పుడు రంగబలి అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ దగ్గర్నుంచి ఈ చిత్రం మీద పాజిటివ్ ఫీలింగ్ చాల మందికి కలిగింది, అందుకు ప్రధాన కారణం కామెడీ.
సినిమాలో కథ గురించి మాట్లాడ్తాయనికి ఏమి లేదు కానీ కామెడి నే ఈ సినిమాని బతికించింది అని చెప్పొచ్చు. సినిమా మొదలైనప్పట్నుంచి కామెడీ నే ప్రధానంగా చేసుకుని సినిమాని నడిపించాడు. సొంత ఊరిలో ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్ గొడవలు, హీరో లవ్ ట్రాక్ ఇవన్న్నీ ఇంతకముందు చాల చుసాము అన్న ఫీలింగ్ కలగక మానదు. అయితే ప్రేక్షకులని రెండున్నర గంటలపాటు కడుపుబ్బ నవ్విస్తే చాలు, కథ గురించి పట్టించుకోరు అనే విషయాన్నీ రంగబలి దర్శకుడు చాల బాగా అర్థం చేస్కున్నాడనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి కథ పక్కన పెట్టి సినిమాని చూస్తే, ఈ సినిమా కచ్చితంగా నవ్విస్తుంది.
నాగ శౌర్య మంచి నటుడే కానీ సరైన పాత్ర ఎప్పుడు పడలేదు అనిపిస్తుంది, అయితే ఈ రంగబలి లో తనని తాను ప్రూవ్ చేస్కునే అవకాశం దొరికింది. ఇక నాగ శౌర్య మిగతా విషయాల్లో మామూలుగానే నటించిన, కామెడీ పండించడం లో మాత్రం సక్సెస్ అయ్యాడు. కొత్త హీరోయిన్ యుక్తి తరేజా ఉన్నంతలో పర్వాలేదన్పిస్తుంది, ఇక ఈ సినిమాకి అతి పెద్ద వెన్నెముక సత్య పండించిన కామెడీ, నాగ శౌర్య తరువాత సెకండ్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో దసరా చిత్రం తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయ్యాడు, ఇక ఈ చిత్రంలో కూడా పాత్ర అంత గొప్పగా లేకపోయినా, తన నటనతో ఆ పాత్రని కాపాడాడు, ఇక మిగతా నటి నటులు వారి పాత్రల మేరకు పరవాలేదు.
కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి, మాములు కథతో వచ్చిన, మంచి కామెడీ తో ప్రేక్షలని ఎంగేజ్ చేయడం విజయం సాధించాడని చెప్పొచ్చు.
సాంకేతికంగా రంగబలి బాగుంది, పవన్ సి హెచ్ పాటలు అంతగా ఆకట్టుకోవు, కానీ నేపధ్య సంగీతం పర్వాలేదు, ఇక దివాకర్ మణి ఛాయాగ్రహణం బాగుంది.
ఓవరాల్ గా, రంగబలి నవ్విస్తుంది.
ప్లస్ పాయింట్లు:
- కామెడీ
మైనస్ పాయింట్లు:
- కథ
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Samajavaragamana Movie Review: సామజవరగమన మూవీ రివ్యూ
- Spy Movie Review: స్పై మూవీ రివ్యూ
- Kerala Crime Files Series Review: కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ రివ్యూ