Baby Movie Review: బేబీ మూవీ రివ్యూ

Baby Telugu Review: విజయ్ దేవర కొండా తమ్ముడి గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ, సింపుల్ కథలని ఎంచుకుంటూ, తక్కువ ఖర్చుతో చిత్రాలని చేస్తూ తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తను చివరగా నటించిన హైవే చిత్రం తప్ప, మిగతా చిత్రాలన్నీ, మంచి లాభాలని తెచ్చిపెట్టినవే, ఇక ఇప్పుడు బేబీ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. పాటలతో చాల మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం, ట్రైలర్ తో అంచనాలని ఇంకా పెంచేసింది, ఇక ఆ అంచనాలని మోస్తూ ఈరోజు విడుదలయిన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

Baby Movie Review

కథ

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ ) మరియు వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్ లో ఉన్నప్పట్నుంచి ప్రేమించు కుంటారు, అయితే స్కూల్ అయిపోయి చదువు అబ్బక ఆనంద్ ఆటో నడుపుకుంటాడు, ఇక వైష్ణవి పై చదువులు చదవాలని అనుకుంటుంది, అయితే అంత బాగానే ఉంది అనుకున్న టైంలో, వైష్ణవి కాలేజీ లో జాయిన్ అయిన తరువాత కొన్ని రోజులకి తన రూపురేఖలే కాదు, తన ప్రవర్తన మారడాన్ని ఆనంద్ గమనిస్తాడు. ఇక వీళ్ళ గొడవకి ప్రధాన కారణం మరో వ్యక్తి అని తెలుసుకున్న ఆనంద్, వైష్ణవితో గొడవ పడుతూనే ఉంటాడు. అసలు వైష్ణవి ఆనంద్ ని ప్రేమిస్తుందా, లేక ఆ ఇంకో వ్యక్తి ని ప్రేమిస్తుందా, ఈ ముక్కోణపు ప్రేమ కథ ముగింపు ఏంటి అనేది మీరు చిత్రం చూసి తెల్సుకోవాలి.

బేబీ మూవీ నటీనటులు

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వం వహించారు, సంగీతం విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ, ఎంఎన్ బాలరెడ్డి. ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌తో కలిసి మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ నిర్మించారు .

సినిమా పేరుబేబీ
దర్శకుడుసాయి రాజేష్
నటీనటులుఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు
నిర్మాతలుఎస్‌కెఎన్
సంగీతంవిజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీఎంఎన్ బాలరెడ్డి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

బేబీ సినిమా ఎలా ఉందంటే?

ఎన్ని ప్రేమ కథలు వచ్చిన, మొదటి ప్రేమ, అంటే స్కూల్ ప్రేమని చూపించే చిత్రాలను చాలా అరుదుగానే వస్తుంటాయా, కానీ అవి ప్రేక్షకులు విజయవంతం చేస్తారు. చాలా రోజుల తరువాత బేబీ అనే చిత్రం మనకి మొదటి ప్రేమని గుర్తు చేసి, ఆ రోజుల్లోకి తీసికెళ్ళింది.

ప్రేమ కథ, అందులోనూ మొదట ప్రేమ అయ్యేసరికి, కథనం నెమ్మదిగా అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి మొదటి ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి, అది అంత సమస్యగా అనిపించదు. సినిమాలో కొత్తదనం లేదు, కానీ తెర మీద చుసిన ప్రతి సన్నివేశాన్ని, చూసే ప్రేక్షకుడు తన ప్రేమ కథని చూసుకుంటాడు. బేబీ యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో, మంచి డైలాగ్స్ తో, మంచి సంగీతం తో మిమ్మల్ని సీట్ కి అతుక్కుపోయేలా అయితే చేస్తుంది.

ఇక నటన విషయానికి వస్తే, ఆనంద్ దేవరకొండ కెరీర్ గుర్తుండిపోయే పాత్ర అని చెప్పొచ్చు. ఎక్కడ ఒక హీరో అని, సెపరేట్ ఎలివేషన్ లేకుండా, ఒక మాములు పాత్రని డిజైన్ చేసిన దర్శకుడు, అంతే సహజంగా ప్రతి సన్నివేశంలో బాగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తన వాయిస్ సూట్ అవ్వనట్టు అనిపించినా , తన హావభావాలు అద్భుతంగా పలికించాడు. ఇక యూట్యూబ్ లో ఫేమస్ అయినా వైష్ణవి కి మంచి పాత్ర దక్కింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమానే అయినా, రెండు రకాల పాత్రలకి న్యాయం చేసింది అని చెప్పొచ్చు. విరాజ్ అశ్విన్ సెకండ్ హీరో అని చెప్పొచ్చు, తన పాత్రకి నటించడానికి అంత స్కోప్ లేకపోయినా, కథని ముందుకు నడిపించడం లో తన పాత్ర దోహదపడింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగానే నటించారు.

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి సెటైరికల్ చిత్రాలు తీసిన సాయి రాజేష్, కలర్ ఫోటో చిత్రానికి కథని అందించి, జాతీయ అవార్డు ని సొతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో ప్రేమాకథని బేబీ రూపం లో ఆద్భుతంగా ఆవిష్కరించాడు. కథ కొత్తగా లేకపోయినా, యూత్ కి కనెక్ట్ అయ్యే మొదటి ప్రేమ ని ఎంగేజింగ్ గా తీయడంలో విజయం సాధించాడు అని చెప్పొచ్చు.

పేరుకి చిన్న సినిమానే అయినా, సాంకేతికంగా చాల బాగుంది, ఇక పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మొదటి పాట నుంచే ఎంత పెద్ద విజయం సాధించిందో మనందిరికి తెలిసిందే. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన పాటలే కాదు , గుండెకి హత్తుకునే నేపధ్య సంగీతాన్ని అందించాడు. ఇక ఎంఎన్ బాలరెడ్డి ఛాయాగ్రహణం కూడా బాగుంది.

చివరగా, బేబీ, మనసుకు హత్తుకునే చిత్రం

ప్లస్ పాయింట్లు:

  • సన్నివేశాలు
  •  పాటలు
  •  నేపధ్య సంగీతం
  •  నటన

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు