Annapurna Photo Studio Movie Review: అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ రివ్యూ

Annapurna Photo Studio Review: యూట్యూబ్ లో కెరీర్ ప్రారంభించి, సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేసి సక్సెస్ అయిన వారిని చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య తన నటనతో అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక ఇప్పుడు 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్య రావు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన లావణ్యా కలిసి నటించిన చిత్రం, అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రం ట్రైలర్ తోనే ఆసక్తి రేపింది ఇక ఎట్టాకేలకు ఈ చిత్రం ఈరోజు విడుదలైంది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Annapurna Photo Studio Movie Review

కథ

చంటి (చైతన్య రావు ) తన అమ్మ పేరు మీద అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఓపెన్ చేస్తాడు, అయితే చంటి గౌతమి (లావణ్య) ప్రేమలో పడతాడు, కొద్దీ రోజులకి గౌతమి కూడా చంటి ప్రేమలో పడిపోతుంది. అయితే అంత బాగానే ఉంది అనుకున్న సమయంలో చంటి ఒక మర్డర్ కేసు లో ఇరుక్కుంటాడు. అసలు ఆ మర్డర్ ఎవరిది, చంటి ని ఎవరు ఇరికించారు అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ నటీనటులు

చైతన్యరావు, లావణ్య, మిహిర, ఉత్తర, రాఘవ, ఆదిత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించగా, బెన్‌ స్టూడియస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు, ఛాయాగ్రహణం పంకజ్ తొట్టాడ.

సినిమా పేరుఅన్నపూర్ణ ఫోటో స్టూడియో
దర్శకుడుచెందు ముద్దు
నటీనటులుచైతన్యరావు, లావణ్య, మిహిర, ఉత్తర, రాఘవ, ఆదిత్య తదితరులు
నిర్మాతలుబెన్‌ స్టూడియస్‌
సంగీతంప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీపంకజ్ తొట్టాడ
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా ఎలా ఉందంటే?

౩౦ వెడ్స్ 21 సిరీస్ తో మంచి పేరు ని సంపాదించుకున్న, చైతన్య రావు, సోలో హీరో గా ఈ అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రాన్ని చేసారు. ఈ మధ్య చిన్న సినిమా అయిన సరే కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది మళ్ళి, ఇటీవల విడుదలైన బేబీ చిత్రం నిరూపించింది. ఇక ఈ అన్నపూర్ణ ఫోటో స్టూడియో కూడా ఒక కొత్త ప్రపపంచం లో అన్ని రకాల జనర్స్ ని కలగలిపి రక్తికట్టించిన చిత్రం అని చెప్పొచ్చు.

సినిమా పల్లెటూరు నేపధ్యం లో జరిగిన, సినిమా మొదలైనప్పట్నుంచి చివరివరకు, సీట్ కి అతుక్కుపోయేలా చేసింది. అయితే ఈ చిత్రం లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, కామెడీ నే ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తీసాడనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి, ఈ చిత్రం లో అన్ని రకాల జానర్లు ఉండడం వల్ల, అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక నటన విషయానికి వస్తే, చైతన్య రావు, పర్వాలేదన్పించాడు, లావణ్య కూడా మొదటి సినిమానే అయిన, నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరకడం వల్ల బాగా నటించింది. ఇక మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

నటి నటులు కొత్తవాళ్లే అయినప్పటికీ దర్శకుడు చెందు ముద్దు ఇలాంటి కథతో ముందుకు రావడం అభినందనీయం. కథ మామూలుగానే అనిపించిన, కథనం ఎంగేజింగ్ రాసుకోవడం వల్ల, అక్కడక్కడా లోపాలు ఉన్నప్పటికీ పరవాలేదపిస్తుంది.

సాంకేతికంగా, ఈ చిత్రం బాగుంది, ప్రిన్స్ హెన్రీ పాటలు మరియు నేపధ్య సంగీతం తో ఆ రెట్రో ఫీల్ ని తీసుకొచ్చాడు, ఇక పంకజ్ తొట్టాడ ఛాయాగ్రహణం సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.

చివరగా, అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఎంగేజింగ్ కామెడీ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • కథనం
  •  నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • సింపుల్ కథ

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు