Bholaa Shankar Movie Review: భోళా శంకర్ మూవీ రివ్యూ

Bholaa Shankar Review: ఆచార్య లాంటి చిత్రం తో భారీ డిసాస్టర్ని చవిచుసిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత వాల్తేరు వీరయ్య తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ విజయాన్ని కొనసాగించడానికి భోళా శంకర్ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఇక ఈ చిత్రం వేదలమ్ కి రీమేక్ అని తెల్సిన విషయమే, అయితే ప్రమోషన్ సమయంలో మెహర్ రమేష్ గాని, చిరంజీవి గాని, చాల చేంజెస్ చేసి ఒరిజినల్ కథలాగా తీర్చిదిద్దాం అని చెప్పారు . ఇక ఈ భోళా శంకర్ ఎలా ఉంది అనేది ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Bholaa Shankar Movie Review

కథ

శంకర్ (చిరంజీవి ) కోలకత్తా లో, తన చెల్లితో జీవిస్తూ ఉంటాడు. ఇక బ్రతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. అయితే సిటీలోని హౌరా బ్రిడ్జి దగ్గర వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఇక చేసేదేమి లేక పోలీసులు శంకర్ సహాయం తీసుకుంటారు, శంకర్ రంగంలోకి దిగాక, అసలు శంకర్ ఎవరు అనేది తెలుస్తుంది. అసలు శంకర్ ఎవరు? తాను కలకత్తా లో ఎందుకు ఉంటున్నాడు అనేది తెల్సుకోవాలంటే మీరు మూవీ చూసి తెల్సుకోవాలి.

భోళా శంకర్ మూవీ నటీనటులు

చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డూడ్లీ సినిమాటోగ్రాఫర్, మహతి స్వర సాగర్ సంగీతం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుభోళా శంకర్
దర్శకుడుమెహర్ రమేష్
నటీనటులుచిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు
నిర్మాతలురామబ్రహ్మం సుంకర
సంగీతంమహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీడూడ్లీ
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

భోళా శంకర్ సినిమా ఎలా ఉందంటే?

ఏ భాష లో అయినా ఒక మంచి సినిమా హిట్ అయితే ఆ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో రీమేక్లు అయితే ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. ఇక ఈ భోళా శంకర్ కూడా తమిళ్ లో మంచి విజయం సాధించిన వేదలమ్ కి రీమేక్.

ఇక ఈ చిత్రం చిరంజీవి ఫాన్స్ కి నచ్చేలా అయితే మార్పులు చేసారు కానీ కథ పరంగా అయితే చాల పాతదిగా అనిపించక మానదు. సినిమా అంత మంచి ఏజ్ ఓల్డ్ కమర్షియల్ టెంప్లేట్ ని ఫాలో అవుతుంది. మంచి ఇంట్రో సాంగ్, లవ్ ట్రాక్, సిస్టర్ సెంటిమెంట్, హీరోకి ఒక గ్యాంగ్, కామెడీ సన్నివేశాలతో అలా గడిచిపోతుంది.

ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఉహించదగిందే అవ్వడంతో ఒక మాములు సినిమా చుస్తునామ అనే ఫీలింగ్ అయితే కలగక మానదు. రెండవ భాగం లో కథ సీరియస్ గా వెళ్తున్న టైం లో మల్లి గాడి తప్పి కామెడీ చేస్తూ ఉండటం అనేది ఒకప్పుడు బాగుందేమో కానీ ఇప్పుడు కథకి సంబంధం లేకుండా ఎం చెప్పిన ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు. ఏది ఎలా ఉన్నపటికీ చిరంజీవి ఫాన్స్ కి అయితే పండగ అని చెప్పొచ్చు.

ఇక70 కి దగ్గర్లో ఉన్న కుడా చిరంజీవి తన గ్రేస్ తో, లుక్స్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా, చాల ఎనర్జిటిక్ గా నటించారు, డాన్సులు ఫైట్లు అన్ని అద్భుతంగా చేసారు. ఇక తమన్నా పాత్రకి ఏ మాత్రం స్కోప్ లేదు, పాటలకి మాత్రమే తనని తీస్కున్నారనిపిస్తుంది. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ పర్వాలేదన్పిస్తుంది, ఇక గెట్అప్ శ్రీను, హైపర్ ఆది, శ్రీముఖి, వెన్నెల కిషోర్ , మురళి శర్మ తదితరులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.

చాల సంవత్సరాల తరువాత మెగా ఫోన్ పట్టిన మెహెర్ రమేష్, చిరంజీవి అభిమానులని మెప్పించడం లో విజయం సాధించాడు. కానీ సగటు ప్రేక్షకుడు ఈ చిత్రాన్ని సీట్ కి అతుక్కు పోయి చూడటం అనేది సందేహించాల్సిన విషయమే.

సాంకేతికంగా ఈ భోళా శంకర్ చాల బాగుంది, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేసారు. అయితే తన ఇచ్చిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ తెర మీద చూడ్డానికి బాగున్నాయి, ఇక నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు. డూడ్లీ ఛాయాగ్రహణం కూడా పర్వాలేదు.

చివరగా, భోళా శంకర్ మెగా అభిమానులకి మాత్రమే.

ప్లస్ పాయింట్లు:

  • చిరంజీవి
  • కొన్ని కామెడీ సన్నివేశాలు
  • కొన్ని పతాక సన్నివేశాలు
  • కొన్ని పాటలు

మైనస్ పాయింట్లు:

  • కథ

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Jailer Telugu Movie Review: జైలర్ మూవీ రివ్యూ

Annapurna Photo Studio Movie Review: అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ రివ్యూ

Baby Movie Review: బేబీ మూవీ రివ్యూ

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు