Gandeevadhari Arjuna Telugu Review:ఎల్ బి డబ్ల్యూ, చందమామ కథలు లాంటి చిత్రాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఒక్కసారిగా తన రూటు మార్చి పి.ఎస్.వి గరుడ వేగ లాంటి స్పై చిత్రాన్ని చేసి విజయం సాధించి అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటుండడంతో , ప్రవీణ్ సత్తారు అలాంటి సినిమాలే తీసి పరాజయాలని చవి చూసాడు. ఇక ఇప్పుడు మళ్ళి ఇంకా పెద్ద బడ్జెట్ తో, వరుణ్ తేజ్ హీరో గా పెట్టి తీసిన చిత్రం గాండీవధారి అర్జున. ఈ చిత్రం స్పై సినిమా అని అందరికి తెలిసినప్పటికీ ట్రైలర్ కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు, ఎందుకంటే వరుణ్ తేజ్ ఏదో కొత్తగా ట్రై చేస్తాడు కాబట్టి. ఇక ఎట్టకేలకు ఈ చిత్రం ఈరోజు విడుదలైంది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.
కథ
అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి అయినా ఆచార్య(నాసర్) ని కొంతమంది చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆచార్య కి వాళ్ళు చేసే మెడికల్ స్కాం వల్ల మనుషులే కాదు పర్యావరణం కూడా దెబ్బ తింటుంది అని, ఇక వాళ్ళని ఎలాగైనా ఆపాలి అని రా ఏజెంట్ అర్జున్ (వరుణ్ తేజ్ ) కి ఈ పని చేయమని చెప్తాడు. చివరికి, అసలు ఆ మెడికల్ స్కాం ఏంటి, దాని వల్ల మనుషులు చనిపోవడం ఏంటి, పర్యావరణం నాశనం అవ్వడం ఏంటి. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
గాండీవధారి అర్జున మూవీ నటీనటులు
వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాసర్, వినయ్ రాయ్, రవి వర్మ, తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రవీణ్ సత్తారు, సంగీతం మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం ముఖేష్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | గాండీవధారి అర్జున |
దర్శకుడు | ప్రవీణ్ సత్తారు |
నటీనటులు | వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాసర్, వినయ్ రాయ్, రవి వర్మ, తదితరులు |
నిర్మాతలు | బివిఎస్ఎన్ ప్రసాద్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
సినిమాటోగ్రఫీ | ముఖేష్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉందంటే?
ఈ మధ్య కాలం లో స్పై యాక్షన్ చిత్రాలు చాల వస్తూనే ఉన్నాయ్, అయితే ఈ గాండీవధారి అర్జున కూడా అదే కోవకి చెందుతుంది. సినిమా మొదటి ౩౦ నిముషాలు చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పాత్రల పరిచయం దగ్గర్నుంచి, కథని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాల బాగుంది. అయితే ఒక్కసారి హీరో తను చేయాల్సిన పని ఏంటి అని తెలిసాక, ఇక నుంచి సీటుకి అతుక్కుపోయేలా సినిమా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అలా ఏ మాత్రం జరగదు.
సినిమా మొదటి భాగంలో ౩౦ నిముషాలు తీసేస్తే, ఎంగేజ్ చేయాడానికి ఒక్క అంశం కూడా లేదు. అయితే రెండవ భాగం సినిమాని కాపాడింది అని చెప్పొచ్చు. కథకి సంబంధించిన ఒక్కో లేయర్ ని విప్పుతు దానికి యాక్షన్ ని జోడించి ఎంగేజింగ్ గా తీసాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. మాములుగా ఇలాంటి చిత్రాలకి కథ కంటే కూడా కథనం మరియు అందులో ట్విస్టులు ప్రేక్షకులకి చాల నచ్చుతాయి, అయితే ఈ చిత్రంలో ట్విస్ట్ లో ఉన్నప్పటికీ, కథనం అంతగా లేకపోయేసరికి, ఆ ట్విస్ట్లు వచ్చే వరకి సగటు ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. ఏది ఏమైనప్పటికి పాక్షికంగా ఈ చిత్రం ఎంగేజ్ చేస్తుంది.
మొదటి సినిమా ముకుంద చిత్రంతో నే వరుణ్ తేజ్ మంచి నటుడని నిరూపించుకున్నాడు. ఇక తను చేస్తున్న సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా చేస్తుండడంతో మంచి విజయాలనే అందుకున్నాడు. ఇక ఈ చిత్రంలో అర్జున పాత్రకి సరిగా సరిపోయాడు అనిపించేలా నటించాడు, మాములుగా ఇలాంటి జానర్లో నటించడానికి పెద్దగా ఉండదు, అయితే ఉన్నంతలో అర్జున్ పాత్రకి అయితే న్యాయం చేసాడనికి చెప్పొచ్చు. ఇక ఏజెంట్ తో ప్లాప్ ని చవి చుసిన సాక్షి వైద్య, ఈ చిత్రంలో పర్వాలేదనిపిస్తుంది. ఇక నాసర్, వినయ్ రాయి, అభినవ్ గోమఠం, రవి వర్మ తమ పాత్రలకి న్యాయం చేసారు.
పి.ఎస్.వి గరుడ వేగ తరువాత, ప్రవీణ్ సత్తారు, ఒకే జానర్లో సినిమాలు చేస్తూ ఉన్నాడు, కానీ పి.ఎస్.వి గరుడ వేగ తరువాత ప్రేక్షకులని మెప్పించలేక పోయాడు. ఇక తన గత చిత్రం ది ఘోస్ట్ నాగార్జున మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం కూడా ప్లాప్ అయింది. రిసల్ట్ తో సంబంధం లేకుండ, ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని చూస్తుంటే తెలుస్తుంది. అయితే ప్రవీణ్ సత్తారు గత చిత్రాలతో పోల్చుకుంటే, ఈ గాండీవధారి అర్జున పర్వాలేదనిపిస్తుంది. కథ మామూలుగానే ఉన్న కథనంతో, మంచి ట్విస్టులతో ప్రేక్షకులని ఒక మోస్తరుగా మెప్పించాడని చెప్పొచ్చు.
సాంకేతికంగా, గాండీవధారి అర్జున బాగుంది, ముఖేష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అని చేప్పొచ్చు, అయితే వి. ఎఫ్.ఎక్స్ ఇంకా బాగుండాల్సింది. ఇక మిక్కీ జె మేయర్ ఇలాంటి జానర్ కి మ్యూజిక్ చేస్తాడని ఎవరు ఉహించి ఉండరు, అయితే అందరి ఊహలకి భిన్నంగా తను మంచి నేపధ్య సంగీతాన్ని అందించాడు.
చివరగా, గాండీవధారి అర్జున, వన్ టైం వాచ్ స్పై యాక్షన్ మూవీ
ప్లస్ పాయింట్లు:
- కథనం
- యాక్షన్
- కొన్ని ట్విస్టులు
మైనస్ పాయింట్లు:
- ఎమోషన్ లేకపోవడం
- సింపుల్ కథ
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- King Of Kotha Movie Review: కింగ్ అఫ్ కొత్త మూవీ రివ్యూ
- Bholaa Shankar Movie Review: భోళా శంకర్ మూవీ రివ్యూ
- Jailer Telugu Movie Review: జైలర్ మూవీ రివ్యూ