King Of Kotha Movie Review: కింగ్ అఫ్ కొత్త మూవీ రివ్యూ

King Of Kotha Review:దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మలయాళం హీరో కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు హింది లో, తెలుగు లో, తమిళ్ లో సినిమాలు చేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడు. రీసెంట్ గా సీతారామం ఊహించని విదంగా హిట్ అవ్వడంతో, తెలుగు ప్రేక్షకులకి చాల దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు మళ్ళీ తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి ‘కింగ్ అఫ్ కొత్త’ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

King Of Kotha Movie Review

కథ

రాజు (దుల్కర్ సల్మాన్) కొత్త లో వాళ్ళ నాన్నతో ఉంటాడు, అయితే తన నాన్నలాగే తాను కూడా రౌడీ అవ్వాలని అనుకుంటాడు. కానీ రాజు ఫుట్బాల్ బాగా ఆడుతుండంతో, రాజుని సిటీ కి పంపిస్తాడు. అయితే చాల సంవత్సరాల తరువాత కొత్త కి తిరిగి వస్తాడు, అయితే అప్పటికే పరిస్థితులు రాజు రౌడీ అవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక అనుకోని పరిస్థితుల్లో రాజు కొత్త కి డాన్ అవుతాడు. ఇక ప్రత్యర్థులతో తన స్థానాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.

కింగ్ అఫ్ కొత్త మూవీ నటీనటులు

దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, గోకుల్ సురేష్, చెంబన్ వినోద్ జోస్, షమ్మి తిలకన్, నైలా ఉష, శాంతి కృష్ణ, సుధీ కొప్పా, సెంథిల్ కృష్ణ, రాజేష్ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్నివేఫేరర్ ఫిల్మ్స్‌ నిర్మించారు.

సినిమా పేరుకింగ్ అఫ్ కొత్త
దర్శకుడుఅభిలాష్ జోషి
నటీనటులుదుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, గోకుల్ సురేష్, చెంబన్ వినోద్ జోస్, షమ్మి తిలకన్, నైలా ఉష, శాంతి కృష్ణ, సుధీ కొప్పా, సెంథిల్ కృష్ణ, రాజేష్ శర్మ తదితరులు
నిర్మాతలువేఫేరర్ ఫిల్మ్స్‌
సంగీతంజేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీనిమిష్ రవి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

కింగ్ అఫ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

గ్యాంగ్ స్టర్ సినిమాలు మనకు కొత్తెం కాదు అయితే ప్రెసెంటేషన్ అనేది చాల ముఖ్యం. తెర పైన కథనం, పాత్రలు ప్రేక్షకులకి కనెక్ట్ అయితే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సరిగ్గా కింగ్ అఫ్ కొత్త కూడా అదే కోవలోకి వస్తుంది, కథ మాములుగా ఉన్న కూడా, చిత్రంలోని పాత్రలు, కథనం ప్రేక్షకులని సీటుకి అతుక్కునేలా చేస్తుంది.

కొత్త అనే టౌన్ కి సినిమా మొదలైన 10 నిమిషాలకే కనెక్ట్ అయిపోతాం. మొదటి సగం ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నప్పటికీ, పాటలు కథకి అడ్డుకట్ట వేస్తాయి. మలయాళం ఫ్లేవర్ కొంచెం కనిపించిన, దుల్కర్ స్క్రీన్ ప్రెజన్స్ వల్ల మనకి ఎక్కడ బోర్ కొట్టదు.

ఇక రెండవ భాగం మొదలైనప్పటినుంచి సీరియస్ మోడ్లోకి వెళ్తుంది, ఇక రెండు గ్రూపుల మధ్య గొడవ అనేది మామూలుగానే అనిపించినా, దుల్కర్ నటన, నేపధ్య సంగీతం మనల్ని చివరి వారికి ఎంగేజ్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికి, దుల్కర్ అభిమానులకి మాత్రం కనుల పండగ అని చెప్పొచ్చు.

దుల్కర్ సల్మాన్ నటన గురించి మనం కొత్తగా మాట్లాడ్డానికి ఎం ఉండదు. ఎలాంటి పాత్ర అయినా సరే, ఆ పాత్రలు ఒదిగిపోయి మనల్ని నమ్మించగలడు. దుల్కర్ సల్మాన్లో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, మలయాళం నటుడు అయ్యి ఉండి కూడా, తనే స్వయంగా తెలుగులో దుబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇక ఈ కింగ్ అఫ్ కొత్త లో కూడా తనే డబ్బింగ్ చెప్పుకుని రాజు అనే పాత్రకి ప్రాణం పోసాడు. ఇక ఐశ్వర్య లక్ష్మి ఉన్నంతలో బాగా చేసింది, చెంబన్ వినోద్ తనదైన నటనతో సీరియస్ గా కనిపిస్తూనే నవ్వించాడు. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు న్యాయం చేసారు.

అభిలాష్ జోషి, మాములు కథనే ఎంచుకున్నప్పటికీ, మంచి కథనం తో, దుల్కర్ నటనతో ప్రేక్షకులని మెప్పించాడనే చెప్పొచ్చు.

సాంకేతికంగా, కింగ్ అఫ్ కొత్త బాగుంది, జాక్స్ బిజోయ్ పాటలు పర్వాలేదు కానీ నేపధ్య సంగీతం సినిమాని మరో మెట్టుకి తీసుకెళ్లింది. టీజర్ విడుదలైనప్పటినుంచే నేపధ్య సంగీతానికి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ చిత్రంలోని ఒక్కో సన్నివేశాన్ని తన నేపధ్య సంగీతంతో ఇంకో మెట్టుకి తీసుకెళ్లాడు. ఇక నిమిష్ రవి ఛాయాగ్రహణం కూడా సినిమాకి చాల పెద్ద ప్లస్ పాయింట్.

చివరగా, కింగ్ అఫ్ కొత్త, పర్వాలేదు కానీ దుల్కర్ అభిమానులని అలరిస్తుంది.

ప్లస్ పాయింట్లు:

  • దుల్కర్ సల్మాన్
  • నేపధ్య సంగీతం
  • కొన్ని పతాక సన్నివేశాలు
  • కథనం

మైనస్ పాయింట్లు:

  • అక్కడక్కడా స్లో నరేషన్

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు