Ramanna Youth Movie Review: రామన్న యూత్ మూవీ రివ్యూ

Ramanna Youth Review:ఈ మధ్య కాలంలో తెలంగాణ నేటివిటీతో చాల సినిమాలు చూసాం, అదేవిధంగా ఆ చిత్రాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనకి తెలిసిందే. బలగం, మెం ఫేమస్, పరేషన్ తరువాత మల్లి తెలంగాణ నేటివిటీతో, రాజకీయం టచ్ తో, పెళ్లి చూపులుతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభయ్ నవీన్ దర్శకత్వం చేసిన రామన్న యూత్, ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. ఇక ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Ramanna Youth Movie Review

కథ

ఆంక్షపూర్ గ్రామంలో రాజు (అభయ్ నవీన్ ), తన స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు, అయితే ఎలాగైనా మంత్రి కళ్ళలో పడితే ఊరికి లీడర్ అవ్వొచ్చు అనుకుంటాడు. అందుకోసం నానా రకాల ప్రయత్నాలు చేసి, దసరాకి ఒక పెద్ద కటౌట్ వేయించాలి అనుకుంటాడు, దీనికోసం రాజు, తన స్నేహితుల సహాయం తీసుకుంటాడు. చివరికి రాజు కటౌట్ వేయించాడా?, లీడర్ అయ్యాడా అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.

రామన్న యూత్ మూవీ నటీనటులు

అభయ్ నవీన్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీవాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరన్, మాన్య భాస్కర్ మరియు వేణు పొలసాని తదితరులు ఉన్నారు. ఈ చిత్రానికి అభయ్ నవీన్ దర్శకత్వం వహించగా, ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రాఫర్, కమ్రాన్ సంగీతం, ఎడిటింగ్ నవీన్ మరియు రూపక్ రోనాల్డ్సన్, ఫైర్‌ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌పై రజనీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరురామన్న యూత్
దర్శకుడుఅభయ్ నవీన్
నటీనటులుఅభయ్ నవీన్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, తదితరులు
నిర్మాతలురజనీ
సంగీతంకమ్రాన్
సినిమాటోగ్రఫీఫహద్ అబ్దుల్ మజీద్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

రామన్న యూత్ సినిమా ఎలా ఉందంటే?

ఈ మధ్య కాలంలో, కథ తో సంబంధం లేకుండ తెలంగాణ భాషనీ పెడితే చాలు హిట్ ఐపోతాది అనుకుంటున్నారు, కానీ అలా జరగట్లేదు. తెలంగాణ భాష అయినా కూడా, కథే బాగుంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. దానికి ఉదాహరణ, బలగం. ఇక రామన్న యూత్ కూడా ఏదో మాములు కామెడీ సినిమాలాగే మొదలైన కూడా, యూత్ మరియు వారికీ రాజకీయాల పట్ల ఉండే అవగాహనా ఎంత అనే పాయింట్ చాల బాగా అడ్రెస్స్ చేసారు.

ఇక సినిమా మొదటి నుండి చివరి వారికి, ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. తెలంగాణ భాషలో ఉండే కల్చర్ ని చూపిస్తూనే, ఆధ్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథనం కొంచెం అక్కడక్కడ నెమ్మదించిన, ఓవరాల్ గా మిమ్మల్ని మొదటినుంచి చివరిదాకా ఎంగేజ్ చేస్తుంది.

ఇక అభయ్ నవీన్ చాల ఈజ్ తో నటించాడు, ఈ పాత్ర తనకి సవాలు విసరకపోయిన, తనదైన కామెడీతో చాల బాగా నటించాడు. మై విలేజ్ షో ఫేమ్ అనిల్ గీలా కూడా తనదైన కామెడీ టైమింగ్ తో బాగా చేసాడు, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర నిడివి చిన్నదే అయినా ఆయన మార్కు చూపించాడు, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

అభయ్ నవీన్, జస్ట్ కామెడీని మాత్రమే నమ్ముకోకుండా, మంచి కథని కూడా చెప్పాలి అనుకోవడం అభినందించాల్సిన విషయం. అయితే కథనం పైన కొంచెం ద్రుష్టి పెట్టాల్సింది. ఏది ఏమైనప్పటికి ప్రేక్షకులని మెప్పించడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా రామన్న యూత్ పర్వాలేదు, పాటలు అంతగా ఆకట్టుకోవు, నేపధ్య్ సంగీతం సినిమాకి తగ్గట్టు సమకూర్చారు కమ్రాన్. ఇక ఫహద్ అబ్దుల్ మజీద్ ఛాయాగ్రహణం పర్వాలేదు, ఇక మిగిలిన సాంకేతిక నిపుణులు బాగా చేసారు.

చివరగా, రామన్న యూత్ మళ్ళీ ఒక మంచి తెలంగాణ చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • కథ
  • కామెడీ
  • పాత్రలు

మైనస్ పాయింట్లు:

  • కథనం

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు