Mark Antony Review: హీరో విశాల్ కి, ఒక సగటు తెలుగు హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అయితే ఒకప్పుడు విశాల్ సినిమాలు తెలుగులో హిట్ అయినంతగా, ఇప్పుడు అవ్వట్లేదు, కానీ క్రేజ్ మాత్రం అలానే ఉంది . అభిమన్యుడు తన చివరి హిట్ చిత్రం, అయితే తన లేటెస్ట్ చిత్రం మార్క్ ఆంటోనీ, ట్రైలర్ తోనే అందరిలో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది, అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.
కథ
మార్క్ (విశాల్) ఒక మెకానిక్, తన స్నేహితుండు చిరంజీవి (సెల్వ రాఘవన్ ) ఒక టెలిఫోన్ మెషిన్ ని కనిపెడతాడు. ఆ టెలిఫోన్ మెషిన్ ఏంటి అంటే, భూతకాలంకి ఫోన్ చేసుకోవొచ్చు. అయితే మార్క్ తన తండ్రి అయినా ఆంటోనీ కి కాల్ చేయాలి అనుకుంటాడు. అయితే మార్క్ తన తండ్రిని చంపాలని అనుకుంటాడు అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. అసలు మార్క్, గ్యాంగ్స్టర్ అయినా ఆంటోనీ ని ఎందుకు చంపాలి అనుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.
మార్క్ ఆంటోనీ మూవీ నటీనటులు
విశాల్, ఎస్.జె .సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతు, అభినయ, కింగ్స్లీ, వై.జి .మహేంద్రన్, మరియు తదితరులు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు, ఇక అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం వహించారు. ఎడిటింగ్ విజయ్ వేలుకుట్టి, మరియు ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్ పై ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు.
సినిమా పేరు | మార్క్ ఆంటోనీ |
దర్శకుడు | ఆధిక్ రవిచంద్రన్ |
నటీనటులు | విశాల్, ఎస్.జె .సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతు, అభినయ, కింగ్స్లీ, వై.జి .మహేంద్రన్, మరియు తదితరులు. |
నిర్మాతలు | ఎస్. వినోద్ కుమార్ |
సంగీతం | జి.వి. ప్రకాష్ కుమార్ |
సినిమాటోగ్రఫీ | అభినందన్ రామానుజం |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
మార్క్ ఆంటోనీ సినిమా ఎలా ఉందంటే?
టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో మన చాల చిత్రాలే చూసాం, కానీ తెలుగు లో గాని, తమిళ్ లో గాని తక్కువ. అయితే టైం ట్రావెల్ అనేసరికి కంటెంట్ బేస్డ్ చిత్రాలనే చూసాం,కానీ ఒక కమర్షియల్ సినిమాకి టైం ట్రావెల్ ని జోడించడం అనేది అభినందించాల్సిన విషయం.
ఇక మార్క్ ఆంటోనీ కథ చాల మాములు కథ, కానీ టైం ట్రావెల్ నేపధ్యంతో అల్లుకున్న కామెడీ సినిమాని చివరి వరకు చూసేలా చేసింది. మొదటి సగం అక్కడక్కడా కథనం నెమ్మదించిన, కామెడీతో దాన్ని కవర్ చేయడం బాగుంది. ఇక రెండవ సగం, ఆధ్యంతం నవ్వులతో, ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. అయితే తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించడంతో, తెలుగు ప్రేక్షకులకి కొంచెం డిస్కంఫర్టుగా ఉండొచ్చు. ఓవరాల్ గా మార్క్ ఆంటోనీ కామెడీతో ఎంగేజ్ చేస్తుంది.
మార్క్ ఆంటోనీలో భారీ తారాగణం ఉంది, ఇక అందరి గెటప్లు వింతగా కూడా ఉన్నాయ్. విశాల్, రెండు విభిన్నమైన పాత్రలని అవలీలగ పోషించాడు. ఇక ఎస్. జె. సూర్య, సినిమాకే పెద్ద హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సునీల్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసాడు. ఇక రీతూ వర్మ, అభినయ, మిగిలిన నటీనటులు ఉన్నంతలో బాగానే చేసారు.
ఆధిక్ రవిచంద్రన్ కథ కొత్తగా లేకపోయినా , టైం ట్రావెల్ కి మంచి కామెడీని జోడించి, ప్రేక్షకులని మెప్పిచడంలో విజయం సాధించాడు. కాకపోతే నటి నటుల గెటప్లు మరియు రైటింగ్ మీద కొంచెం దృష్టి పెట్టాల్సింది.
సాంకేతికంగా, మార్క్ ఆంటోనీ బాగుంది, జి. వి. ప్రకాష్ కుమార్ పాటలు అంతగా లేవు కానీ నేపధ్య సంగీతం బాగుంది. ఇక అభినందన్ రామానుజన్ ఛాయాగ్రహణం పర్వాలేదు.
చివరగా, మార్క్ ఆంటోనీ, కామెడీతో మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్లు:
- నటి నటులు
- కామెడీ
మైనస్ పాయింట్లు:
- సింపుల్ కథ
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Ramanna Youth Movie Review: రామన్న యూత్ మూవీ రివ్యూ
- Jailer Telugu Movie Review: జైలర్ మూవీ రివ్యూ
- Bholaa Shankar Movie Review: భోళా శంకర్ మూవీ రివ్యూ