MAD Movie Review: మ్యాడ్ మూవీ రివ్యూ

MAD Movie Review Review:ఈ మధ్య ప్రేక్షకులు కొత్తదనం చాల ఎక్కువగానే కోరుకుంటున్నారు, దానివల్ల దర్శకులకి ఎలాంటి కథతో ప్రేక్షకులని మెప్పించాలానె సందిగ్ధం మొదలైంది. అయితే, ఒకవిధంగా, కథ మాములుగా ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్ని రెండు గంటలపాటు నవ్విస్తే, ఆ చిత్రం హిట్ అయ్యే అవకాశాలు చాల ఎక్కువ. అందుకు ప్రధాన ఉదాహరణ జాతిరత్నాలు, ఇక ఇప్పుడు అదే కోవలోకి ఈ ‘మ్యాడ్’ అనే చిత్రం వస్తుంది. కాలేజ్ కామెడీ నేపథ్యంలో ఇప్పుడున్న యూత్ కి నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని తీశారు. ఇక ట్రైలర్ అయితే అందరికి కడుపుబ్బా నవ్వించింది, అందులోని, నిర్మాత నాగ వంశి జాతిరత్నాలు కన్నా ఎక్కువ నవ్వుతారు అనడంతో అంచనాలు పెరిగాయి. ఇక ఎట్టకేలకు ఈ చిత్రం ఈరోజు విడుదలైంది, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఏ రివ్యూలో తెలుసుకుందాం.

MAD Movie Review

కథ

డిడి (సంగీత్ శోభన్), మనోజ్ (నార్నె నితిన్), అశోక్ (రామ్ నితిన్) ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్లేసెమెంట్ ఉంటుంది, మంచి లెక్చరర్స్ ఉంటారు అని చెప్పడంతో రీజినల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ కాలేజి లో జాయిన్ అవుతారు. కానీ కాలేజీకి వెళ్ళాక వీళ్ళు విన్నదానికి పూర్తి విరుద్ధంగా ఉండంతో కథ అడ్డం తిరుగుతుంది. ఇక జీవితంలో ఎలాంటి గోల్ లేని విల్లు కాలేజీలో ఎలా గడిపారు అనేది మిగతా కథ.

మ్యాడ్ మూవీ నటీనటులు

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రాచా రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, ఆంథోని, శ్రీకాంత్ రెడ్డి మరియు అనుదీప్ కెవి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కళ్యాణ్ శంకర్, ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు మరియు ఛాయాగ్రహణం శామ్‌దత్ – దినేష్ కృష్ణన్ బి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర & సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుమ్యాడ్
దర్శకుడుకళ్యాణ్ శంకర్
నటీనటులునార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్, అనుదీప్ కెవి, తదితరులు
నిర్మాతలుహారిక సూర్యదేవర & సాయి సౌజన్య
సంగీతంభీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీశామ్‌దత్ – దినేష్ కృష్ణన్ బి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

మ్యాడ్ సినిమా ఎలా ఉందంటే?

కామెడీ అనేది సరిగ్గా పండితే హిట్ ఖాయం అని ఈ మధ్యకాలంలో జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు మ్యాడ్, ఈ చిత్రంలో కథ ఎంత మాత్రమూ ఉండదు, లాజిక్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులని నవ్వించడమే ద్యేయంగా పెట్టుకున్నారు అని అనిపిస్తుంది.

సినిమా ప్రారంభం నుంచి, ఇప్పుడున్న యూత్ ని, సినిమాలోకి లాగేస్తుంది. కాలేజీలో చేసిన అన్నింటిని బాగా చూపిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ, రెండు గంటల పాటు ఎంగేజ్ చేస్తుంది. అయితే ఒక దశ దాటాక అసలు ఈ సినిమా యొక్క ఉద్దేశం ఏంటి అనే సందేహం రాక మానదు. సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ తగ్గించి, వేరే ట్రాక్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు దర్శకుడు కళ్యాణ్ శంకర్, కానీ నవ్వించడమే బెటర్ అనుకుని వెంటనే కామెడీ ట్రాక్ లో కథని నడిపించేసాడు. జాతిరత్నాలు అంత కాకపోయినా, ఈ చిత్రం కూడా బాగా నవ్విస్తుంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ బావ మరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్, బాగానే చేసాడు, డైలాగ్ డెలివరీ కానీ, కామెడీ పండించడం గాని బాగానే చేసాడు. ఇక సంగీత్ శోభన్ ఇంతకముందే తన ఎలాంటి నటుడో నిరూపించుకున్నాడు, ఈ చిత్రంలో కూడా తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించాడు. రామ్ నితిన్ కూడా ఉన్నంతలో పర్వాలేదు. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి ఉన్నంతలో బాగానే చేసింది, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్ అంతగా స్కోప్ లేదు, ఇక అనుదీప్ ఈ సినిమాకి ఒక హైలెట్ అని చెప్పొచ్చు, ఇక తన ఉన్నంతసేపు నవ్వించాడు. మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

కళ్యాణ్ శంకర్ మరియు అనుదీప్ మొదటినుంచీ స్నేహితులు అవ్వడం వల్ల, ఈ మ్యాడ్ మీద జాతిరత్నాలు ఎఫెక్ట్ అయితే కొంచెం ఉంది. కానీ కంప్లీట్ కాలేజీ నేపధ్యం తీసుకుని, ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రపంచంలో బ్రతికే యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలని తీస్కుని బాగా తీసాడు. ప్రేక్షకులని నవ్వించడంలో విజయం సాధించాడు అని చెప్పొచ్చు.

భీమ్స్ సంగీతం సినిమాకి తగ్గట్టు బాగా కుదిరింది, ఇక శామ్‌దత్ – దినేష్ కృష్ణన్ బి పర్వాలేదు కానీ ఇంకా బాగుండాల్సింది.

చివరగా, మ్యాడ్ కడుపుబ్బా నవ్వించే చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ
  • పాత్రలు

మైనస్ పాయింట్లు:

  • కథ

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు