Rules Ranjan Movie Review: రూల్స్ రంజన్ మూవీ రివ్యూ

Rules Ranjan Movie Review Review:రాజావారు రాణి వారు అనే చిన్న చిత్రంతో, ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, ఆ తరువాత చేసింది 6 సినిమాలే అయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత చిత్రం మీటర్ ప్లాప్ అయ్యినప్పటికీ, తను ఎంత మాత్రం నిరాశ చెందకుండా రూల్స్ రంజన్ అనే చిత్రంతో మన ముందుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం చిత్రాలు ప్లాప్ అయినా లాస్ మాత్రం రాదూ, అందుకే నిర్మాతలు తనతో సినిమాలు చేస్తున్నారు, అందుకే కిరణ్ అబ్బవరం కూడా మంచి మూవీస్ ని లైన్ అప్ లో ఉంచాడు. ఈ 2023 లో ఇప్పటికే వినరో భాగ్యమో విష్ణు కథ, మీటర్ విడుదల చేసాడు ఇక ఈ రూల్స్ రంజన్ మూడవ సినిమా. మరి కిరణ్ అబ్బవరం ఈ సంవత్సరాన్ని హిట్ తో ముగించాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Rules Ranjan Movie Review

కథ

మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి ముంబై ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడికి వెళ్తాడు, అక్కడ బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ అయినా వెన్నెల కిషోర్ రూంలో ఉంటాడు. ఇక తన జీవితం మొత్తం స్ట్రిక్ట్ రూల్స్ తో పని చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు. అలంటి మనో రంజన్ కి తన పాత స్నేహితురాలు అయినా సన(నేహా శెట్టి) పరిచయం అవుతుంది. స్లో గా సనకి దగ్గరవుతాడు మనో రంజన్, తన కోసం రూల్స్ బ్రేక్ చేసి మరి పబ్ కి వెళ్తూ ఉంటాడు. అయితే మనో రంజన్, సనని ప్రేమించడం మొదలు పెడతాడు, కానీ తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు అనేది మీరు మూవీ చూసి తెల్సుకోవాలి.

రూల్స్ రంజన్ మూవీ నటీనటులు

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్. రతినం క్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం సమకూర్చారు. దులీప్ కుమార్ ఎం. ఎస్ ఛాయాగ్రహణం, దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు

సినిమా పేరురూల్స్ రంజన్
దర్శకుడురతినం క్రిష్ణ
నటీనటులుకిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, తదితరులు
నిర్మాతలుదివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి
సంగీతంఅమ్రిష్
సినిమాటోగ్రఫీదులీప్ కుమార్ ఎం. ఎస్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉందంటే?

ఎస్ ఆర్.కల్యాణమండపం తో, తనకంటూ ఓకే మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. తన సినెమాలపైనా గాని, తన పైన గాని ఎంత నెగిటివిటీ ఉన్న, తన సినిమాలతో పోసిటివిటీ ని తనలో నింపుకుంటాడు. ఇక కిరణ్ అబ్బవరం చిత్రాల్లో కథ పెద్దగా ఉండదు కానీ కామెడీ తో నడిచేస్తుంటాయి, ఇక ఈ రూల్స్ రంజన్ కూడా అంతే, కథ ఎంత మాత్రమూ కొత్తగా అనిపించదు.

సినిమా చాల స్లో స్టార్ట్ అవుతుంది, బోర్ కొడుతుంది అనే టైంలో వెన్నెల కిషోర్ రంగంలో కి దిగి, సినిమాని కొంతమేర కాపాడాడు. ఇక మొదటి సగం మొత్తం కామెడీ తో ఆలా సాగిపోతుంది. కానీ రెండవ భాగం తేడా కొట్టేసింది, రెండవ భాగం కూడా కామెడీ నే ప్రధానంగా చేసుకుని నడిపిస్తే బాగుండేది, కానీ ఎమోషన్స్ ని ఇరికించి, అవి సరిగా పడకపోగా, విసుగు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ కి హైపర్ ఆది, వివా హర్ష, వెన్నెల కిషోర్ కొంత మేర ఊరట.

కిరణ్ అబ్బవరం అన్ని సినిమాల్లో ఒకేలాగా నటిస్తుంటాడు అనే టాక్ ఉంది, అయితే ఈ సినిమాలో లుక్ అయితే మార్చాడు కానీ నటన మాత్రం అలాగే ఉంది. మనో రంజన్ పాత్ర తనకి ఏ మాత్రం సవాలు విసిరాడు. నేహా శెట్టి కూడా అంతగా ఆకట్టుకోదు, ఇక సుబ్బరాజు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ మరియు తన పాత్రకి తను న్యాయం చేసాడు కూడా. ఇక హైపర్ ఆది, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ పాత్రల మేరకు బాగా చేసారు.

రతినం క్రిష్ణ చాల మాములు కథతో ప్రేక్షకులని మెప్పించలేక పోయాడు, కానీ కామెడీ కొంత మేరకు పండడంతో, ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా, రూల్స్ రంజన్ చాల మాములుగా ఉంటుంది, అమ్రిష్ సంగీతం పర్వాలేదు కానీ , దులీప్ కుమార్ ఎం. ఎస్ ఛాయాగ్రహణం సినిమాకి పెద్ద మైనస్.

చివరగా, రూల్స్ రంజన్ అక్కడక్కడ నవ్విస్తుంది.

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ

మైనస్ పాయింట్లు:

  • కథ

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు