Leo Movie Review: లియో మూవీ రివ్యూ

Leo Movie Review Review: తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన LCU ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ LCU లో ఇప్పటికి ఖైదీ, విక్రమ్ మూవీస్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దళపతి విజయ్ నటించిన లియో, ఈరోజు విడుదలైంది. ట్రైలర్ కి నెగటివ్ రెస్పాన్స్ వచ్చిన, లోకేష్ ఈ సినిమాలో చాల సర్ప్రైజెస్ ఉన్నయని చెప్పడంతో, అంచనాలు నెలకొన్నాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Leo Movie Review

కథ

పార్థు (విజయ్) కాశ్మీర్ లో చాక్లెట్ బేకరీని మైంటైన్ చేస్తూ, తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. అయితే ఒకరోజు పార్థు మరియు అతని కుటుంబం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తూ ఉంటారు. పార్థుకి ఏమి అర్థం కాదు, అయితే పార్థు లాగే లియో అనే గ్యాంగ్స్టర్ ఉండేవాడని, అతను కూడా పార్థు లాగానే ఉంటాడని, పార్థు కి తెలుస్తుంది. ఇంతకీ, లియో మరియు పార్థు ఒక్కడేనా, లేక ఇద్దరా, లియో గతం ఏంటి అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

లియో మూవీ నటీనటులు

దళపతి విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, తదితరులు నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. లలిత్ కుమార్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరులియో
దర్శకుడులోకేష్ కనగరాజ్
నటీనటులుదళపతి విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, తదితరులు
నిర్మాతలులలిత్ కుమార్
సంగీతంఅనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీమనోజ్ పరమహంస
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

లియో సినిమా ఎలా ఉందంటే?

లియో కథ మొదలైనప్పటినుంచి, తరువాత ఎం జరుగుతుంది అనేది సగటు ప్రేక్షకుడు గెస్ చేయగలడు. కథ కాశ్మీర్ లో ప్రారంభం అయ్యి, పార్థు ఫ్యామిలీ లైఫ్ ని చూపిస్తూ చాల మాములుగా సాగుతుంది. ఎప్పుడైతే పార్థు మీద అటాక్ మొదలవుతుందో, అప్పటినుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఉహించదగిందే అవ్వడం నిరాశపరిచే విషయం.

సెకండ్ హాఫ్ రేసీస్క్రీన్ప్లే తో వెళ్తుంది, పార్థు నే లియోనా అన్న కన్ఫ్యూషన్ కొంతమేరకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, కానీ అది కూడా తరువాత చాల సినిమాల్లో చూసామే అనిపిస్తుంది. లియోలో ఇంట్రెస్టింగ్ అంశం ఏదైనా ఉంది అంటే LCU ని టచ్ చేస్తూ కొన్న్ని ఇంట్రెస్టింగ్ సన్నీవేషాలని చూపించడం. ఏది ఏమైనప్పటికి, లియో విజయ్ ఫాన్స్ని మాత్రం ఎంగేజ్ చేస్తుంది.

అక్కడక్కడ మొహంలో ఎలాంటి ఎక్సప్రెసిషన్స్ లేకుండా ఉన్న కూడా రెండు పాత్రల్లో విజయ్ బాగా చేసాడు. లియో పాత్ర పెద్దగా సవాలు విసరకపోయిన, మధ్య వయస్కుడి పాత్ర అయిన పార్థు పాత్రలో బాగా నటించాడు. త్రిష పాత్ర నిడివి తక్కువే అయిన, తన పాత్రకి న్యాయం చేసింది, సంజయ్ దత్ మరియు యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాకే వెన్నెముక అని చెప్పొచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

లోకేష్ కనగరాజ్ మాములు కథనే తీసుకున్న, తనదైన ట్రీట్మెంట్ తో సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగిస్తాడు. ఇక ఈ లియో కూడా అదే కోవలోకి చెందుతుంది. ఏది ఏమైనప్పటికి కథ మామూలుదే అయిన, కొన్ని ట్విస్టులతోప్, సినిమాని ఎంగేజింగ్ తీసి ప్రేక్షకులని మెప్పించాడు.

సాంకేతికంగా, లియో బాగుంది, అనిరుద్ రవిచంద్రన్ తన నేపధ్య సంగీతం తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నాడో మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో పాటలు పర్వాలేదు మరియు నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం పర్వాలేదు.

చివరగా, లియో ఒక్కసారి చూడొచ్చు.

ప్లస్ పాయింట్లు:

  • కొన్ని ట్విస్ట్లు
  • అనిరుద్ మ్యూజిక్

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు