Keedaa Cola Movie Review: కీడా కోలా మూవీ రివ్యూ

Keedaa Cola Movie Review: తీసింది రెండు సినిమాలే అయిన ఏ దర్శకుడికి రానంత ఫేమ్ తరుణ్ భాస్కర్ కి వచ్చింది. దానికి కారణం, యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు, ముఖ్యంగా “ఈ నగరానికి ఏమైంది”. కానీ ఈ నగరానికి ఏమైంది వచ్చి 5 సంవత్సరాలు అయిన కూడా, తరుణ్ భాస్కర్ సినిమా కోసం వెయిట్ చేసే వాళ్ళు చాల ఉన్నారు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకుడే కాదు, యాక్టర్ కూడా. దర్శకుడిగా 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన, యాక్టర్‌గా మాత్రం బిజీ గానే ఉన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ కీడా కోలా అనే క్రైమ్ కామెడీ చిత్రంతో దర్శకుడిగా మన ముందుకొచ్చాడు. ఈ సినిమా మంచి అంచనాలతో ఈ రోజు విడుదలైంది, ఒక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Keedaa Cola Movie Review

కథ

వాస్తు (చైతన్య రావు) మరియు లంచం (రాజ్ మయూర్) మంచి స్నేహితులు, అయితే జీవితం లో డబ్బులు లేక చాల కష్టాలు పడుతుంటారు. అయితే ఒకరోజు కూల్ డ్రింక్‌లో బొద్దింక దొరుకుతుంది, అయితే దీన్ని అడ్డంగా పెట్టుకుని కూల్ డ్రింక్ కంపెనీ మీద కేసు వేస్తే కోట్లలో డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. కోర్ట్ లో కేసు వేస్తారు కానీ, దాని వాళ్ళ, కంపెనీ వాళ్లు, దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ చేసే రాజకీయనాయకుడు, బిజినెస్ మెన్, ఇలా అందరి వల్ల వీళ్ళకి చాల ఇబ్బందులు ఎదురవుతాయి. చివరికి వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలా బయట పడ్డారు అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.

కీడా కోలా మూవీ నటీనటులు

బ్రహ్మానందం, చైతన్య రావు, తరుణ్ భాస్కర్, రవీంద్ర విజయ్, రాగ్ మయూర్, రఘురామ్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్ ఉన్నారు. తరుణ్ భాస్కర్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్ మరియు సినిమాటోగ్రఫీ: AJ ఆరోన్.

సినిమా పేరుకీడా కోలా
దర్శకుడుతరుణ్ భాస్కర్
నటీనటులుబ్రహ్మానందం, చైతన్య రావు, తరుణ్ భాస్కర్, రవీంద్ర విజయ్, రాగ్ మయూర్, రఘురామ్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్, తదితరులు
నిర్మాతలుకె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ
సంగీతంవివేక్ సాగర్
సినిమాటోగ్రఫీAJ ఆరోన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

కీడా కోలా సినిమా ఎలా ఉందంటే?

సినిమా మంచి యాక్షన్ సీక్వెన్స్ తో మొదలై, ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. మూల కథని ముందే చెప్పి, ప్రేక్షకులని రెండు గంటలపాటు నవ్వించడానికి చాల బాగా ప్రిపేర్ చేసాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక అక్కడినుంచి, కొత్త ఎడిటింగ్ ప్యాట్రన్ తో, సిట్యువేషనల్ కామెడీతో మొదటి భాగం ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. కొంచెం నరేషన్ స్లో గా అనిపించినప్పటికీ, ప్రతి క్యారెక్టర్, చూసే ప్రేక్షకుడిని నవ్వించకుండా ఉండలేదు.

ఇక రెండవ భాగం, రెసి కథనం తో వెళ్తుంది. కామెడీ పండిస్తూనే, క్రైమ్ ని జోడించి, చివరి వరకు ఎంగేజింగ్ గా చూసేలా చేసారు. ఏది ఏమైనప్పటికి, కథనం అక్కడక్కడా స్లో గా ఉన్నప్పటికీ, కామెడీ మనల్ని రెండు గంటలపాటు నవ్విస్తుంది.

ఇక నటన విషయానికి వస్తే, బ్రహ్మనందం, కామెడీకి పెట్టింది పేరు, ఆయన చేయని పాత్ర లేదు, అన్ని రకాల కామెడీ తో మనల్ని నవ్వించారు. అయితే రంగ మార్తాండ చిత్రం, మునుపెన్నడూ చూడని ఒక సీరియస్ పాత్రలో నటించి మనల్ని షాక్ కి గురి చేసారు. ఇక ఇప్పుడు తాత పాత్రలో మనకి మరో కొత్త బ్రహ్మనందం ని చూపించారు. ఇక 30 వెడ్స్ 21 సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న చైతన్య రావు, వాస్తు పాత్రలో బాగానే చేసాడు, సినిమా బండి తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ మయూర్ పోషించిన లంచం పాత్ర ఈ సినిమాకే హైలెట్. ఇక నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్, సికందర్ పాత్రలో విష్ణు, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, రఘు రామ్ తదితరులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

సిట్యువేషనల్ కామెడీ పండించడంలో తరుణ్ భాస్కర్ బ్రిలియంట్. ఇక ఈ చిత్రంలో తన గత చిత్రాల లాగా కామెడీతో పాటు, క్రైమ్ ని తీస్కుని కొత్తగా ప్రెసెంట్ చేసాడు ఈ కీడా కోలా చిత్రాన్ని. కథనం ఉహించదగిందే అయినప్పటికీ, మంచి పాత్రలతో, ప్రతి క్రాఫ్ట్ ని కొత్తగా ప్రెసెంట్ చేసి, ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని ఇవ్వడంలో విజయం సాధించాడు.

పరిమిత బడ్జెట్ లోనే, కీడా కోలా సాంకేతికంగా చాల బాగా ఉంటుంది. కెమెరా వర్క్, కలర్ టోన్, ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా అన్ని అత్యున్నత స్థాయిలో ఉంటాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకీ మరో వెన్నెముక అని చెప్పొచ్చు.

చివరగా,కీడా కోలా అన్ని వర్గాల ప్రేక్షకులని రెండు గంటల పాటు నవ్వించే సినిమా.

ప్లస్ పాయింట్లు:

  • కథనం
  • ఎడిటింగ్
  • నేపధ్య సంగీతం
  • పాత్రలు
  • కలర్ టోన్

మైనస్ పాయింట్లు:

  • అక్కడక్కడా స్లో నరేషన్

సినిమా రేటింగ్: 3.5/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు