Japan Movie Review Review: పేరుకి తమిళ్ హీరోలే అయిన సూర్య, విక్రమ్, విశాల్ కి, తెలుగు లో చాల మంచి క్రేజ్ ఉందన్న మాట వాస్తవం. అయితే వీళ్ళతో పాటు కార్తీ కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది, దానికి తోడు కార్తీ స్పష్టంగా తెలుగు మాట్లాడడంతో మన తెలుగు ప్రేక్షకులు కార్తీని తెలుగు హీరోలాగానే చూస్తారు. ఇక సర్దార్ మరియు పొన్నియిన్ సెల్వన్ తో మన ముందుకొచ్చిన కార్తీ, ఇప్పడు మరో వినూత్నమైన చిత్రం జపాన్ తో మన ముందుకొచ్చాడు. ట్రైలర్ మరియు సరి కొత్త వాయిస్ మాడ్యులేషన్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
జపాన్ (కార్తీ) చిన్నప్పటినుంచి దొంగతనాలు చేస్తూ ఉంటాడు, అయితే జపాన్ పెద్దయ్యాక కూడా ఆ దొంగతనాలు ఆపలేదు కదా ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ పోలీసులకి నిద్ర లేకుండా చేస్తుంటాడు. అయితే జపాన్ ఒకరోజు రాజకీయ నాయకుడి బంగారం షాప్ లో 200 కోట్లు విలువ చేసే నగలు దొంగతనం చేస్తాడు. దీంతో జపాన్ మోస్ట్ వాంటెడ్ గా మారతాడు, అయితే జపాన్ దొంగతనమే కాదు, ఒక మర్డర్ కూడా చేసాడని ఆరోపణ పడుతుంది, అసలు జపాన్ ఎవరు, 200 కోట్ల విలువగల నగలు ఎందుకు దొంగిలించాడు, మర్డర్ చేశాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.
జపాన్ మూవీ నటీనటులు
కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, జితన్ రమేష్, కెఎస్ రవికుమార్, వాగై చంద్రశేఖర్, బావ చెల్లదురై, తదితరులు. ఈ చిత్రానికి రాజు మురుగన్ రచన మరియు దర్శకత్వం వహించారు, సంగీతం జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: ఎస్ రవి వర్మన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | జపాన్ |
దర్శకుడు | రాజు మురుగన్ |
నటీనటులు | కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, జితన్ రమేష్, కెఎస్ రవికుమార్, వాగై చంద్రశేఖర్, బావ చెల్లదురై, తదితరులు. |
నిర్మాతలు | ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు |
సంగీతం | జివి ప్రకాష్ కుమార్ |
సినిమాటోగ్రఫీ | ఎస్ రవి వర్మన్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
జపాన్ సినిమా ఎలా ఉందంటే?
సినిమా మొదలవడమే దొంగతనంతో మొదలవుతుంది, ఎక్కడ సమయం వృధా చేయకుండా హీరో పాత్రని ఆ సన్నివేశం ద్వారా చాల బాగా ఎస్టాబ్లిష్ చేసారు. మొదటి భాగం, మంచి కామెడీతో, దొంగతనాలతో, హీరో, పోలీస్ క్యాట్ అండ్ మౌస్ సన్నివేశాలతో ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. అయితే రెండవ భాగం తలా తోక లేకుండా ఎటు వెళ్తుందో అర్థం కాకుండా వెళ్తుంది. అయితే కథనం ఎలా ఉన్నప్పటికీ కార్తీ తన నటనతో, కామెడీతో ప్రేక్షకులని సీట్కి అతుక్కుపోయేలా చేస్తాడు.
కార్తీ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏంలేదు, కథ మాములుగా ఉన్న కూడా ప్రేక్షకులని తన నటనతో థియేటర్లో కుర్చోపెట్టే సత్తా ఉన్న నటుడు. ఇక ఈ చిత్రంలో నటించడమే కాకుండా, మొదటిసారి వాయిస్ మాడ్యులేషన్ని మార్చి తనని తానూ చాల కొత్తగా ప్రెసెంట్ చేసుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ చాల రోజులుగా హిట్ కోసం ప్రయత్నిస్తుంది, అయితే ఈ చిత్రంలో తన పాత్రకి ఎలాంటి స్కోప్ లేదు, మరియు తను కూడా నటన పరంగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న సునీల్, తమిళ్లో వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో మంచి స్క్రీన్ టైం ఉన్న పాత్ర దక్కింది, ఆ పాత్రకి తగ్గట్టు బాగా చేసాడు. ఇక మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.
మనీ హెయిస్ట్ తరువాత, ఇక్కడ హెయిస్ట్ చిత్రాలు ఈ మధ్య కాలంలో మనం బాగానే చూస్తున్నాం. ఇక రాజు మురుగన్ హెయిస్ట్ కాన్సెప్ట్ ఏ తీసుకున్న, దానికి మంచి కామెడీ, కమర్షియల్ అంశాలు జోడించి ఎంగేజింగ్ తెరపై ఆవిష్కరించాడు.
సాంకేతికంగా జపాన్ చిత్రం పర్వాలేదు అక్కడక్కడా వి. ఎఫ్. ఎక్స్ మినహా. జి. వి. ప్రకాష్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం బాగుంది, ఇక ఎస్ రవి వర్మన్ ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన ఆకర్షణ.
చివరగా, జపాన్ కమర్షియల్ అంశాలతో కూడిన ఎంగేజింగ్ హెయిస్ట్ కామెడీ చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- కార్తీ నటన
- కొన్ని ట్విస్ట్లు
- కార్తీ వాయిస్ మాడ్యులేషన్
మైనస్ పాయింట్లు:
- ఉహించదగిన కథనం
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Keedaa Cola Movie Review: కీడా కోలా మూవీ రివ్యూ
- Tiger Nageswara Rao Movie Review: టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ
- Bhagavanth Kesari Movie Review: భగవంత్ కేసరి మూవీ రివ్యూ