Mangalavaram Movie Review: మంగళవారం మూవీ రివ్యూ

Mangalavaram Movie Review Review: ఆర్ ఎక్స్ 100 తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన అజయ్ భూపతి, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆర్ ఎక్స్ 100 తరువాత మహా సముద్రం లాంటి పెద్ద సినిమా చేసిన, అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దింతో, ఇక అజయ్ భూపతికి అవకాశాలు రావేమో అని అనుకున్న వాళ్ళందిరికి, ఇప్పుడు మంగళవారం అనే చిత్రంతో వస్తున్నారు. మంగళవారం ఒక పల్లెటూరిలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్, అయితే ట్రైలర్ విడుదలైన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ మొదలైంది, ఇక దీనికి తోడు ప్రమోషన్ లో భాగంగా, సినిమాలో ఇంతవరకు టచ్ చేయని పాయింట్ ని టచ్ చేసాం అని చెప్పడంతో, సినిమా చూడాలనే ఆసక్తి రెట్టింపైంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Mangalavaram Movie Review

కథ

శైలు (పాయల్ రాజపుత్ ) పల్లెటూరి అమ్మాయి అయితే, తనకి నింఫోమేనియా అనే ఫోబియా ఉంటుంది. దీని వల్ల తను చాల సమస్యలని ఎదుర్కొంటు ఉంటుంది. అయితే అప్పటికి ఊర్లో ప్రతి మంగళవారం మనుషులు చనిపోతూ ఉంటారు. దీనంతటికి కారణం దేవుడు అనే వాళ్ళు కొందరు, దెయ్యం అనే వాళ్ళు కొందరు, లేదు మనుషులే అనే వాళ్ళు కొందరు. అయితే ఈ పరిస్థితికి, శైలు కి సంబంధం ఏమిటి, దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

మంగళవారం మూవీ నటీనటులు

పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ తదితరులు. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చగా, శివేంద్ర దశరధి ఛాయాగ్రాణం వహించారు. ఇక ముద్ర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుమంగళవారం
దర్శకుడుఅజయ్ భూపతి
నటీనటులుపాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ తదితరులు
నిర్మాతలుస్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీశివేంద్ర దశరధి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

మంగళవారం సినిమా ఎలా ఉందంటే?

ఇక ఈ మధ్య విలేజ్ నేపథ్యంలో వచ్చిన కాంతారా, మన తెలుగులో విరూపాక్ష ఎంత సంచలనం సృష్టించాయి అందరికి తెలిసిందే. అయితే విలేజి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ తీయాలంటే అంతే ఈజీ కాదు, కానీ మంగళవారం సినిమా మొదలైనప్పటినుంచే ప్రేక్షకులని సస్పెన్స్ కి గురి చేస్తుంది.

ప్రతి మంగళవారం జరుగుతున్న దారుణాలు వెనక ఎవరు ఉన్నారు అనే సస్పెన్స్ ని సినిమా అంత బాగా మైంటైన్ చేసారు అజయ్ భూపతి. అయితే అంత బాగున్నప్పటికీ, మొదటి సగంలో మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ కథనం నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బోర్ కొడుతుంది అనిపించినప్పుడల్లా, దర్శకుడు ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాన్ని భయపెట్టే నేపధ్య సంగీతంతో చూసే ప్రేక్షకున్ని
ఇంట్రెస్టింగ్ చూసేలా చేస్తాడు.

ఇక రెండవ భాగం సినిమాకి వెన్నెముక, మొదటి సగంలో ఉన్న చాల ప్రశ్నలకి సమాధానం ఈ రెండవ భాగం. మాములుగా సినిమా చివరలో సస్పెన్స్ రివీల్ అవుతుంది కానీ ఈ చిత్రంలో రెండవ భాగం మొదటి నుంచే, ఒక్కో పాత్ర చుట్టూ అల్లుకున్న సస్పెన్సలని విప్పుతూ క్లైమాక్స్ లో ప్రేక్షకుణ్ణి షాక్ కి గురిచేయడం కాయం. ఇక రెండవ భాగం లో చిన్న చిన్న లోపలఉన్నప్పటికీ, మొత్తం మీద ఈ చిత్రం సగటు ప్రేక్షకున్ని సీట్లో రెండున్నర గంటల పాటు కచ్చితంగా కుర్చోపెడుతుంది.

ఇక నటన గురించి మాట్లాడుకుంటే, పాయల్ రాజపుత్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఎక్సపోసింగ్, ఆర్ ఎక్స్ 100 తోనే ఆ ముద్ర పడిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్రని చేయడానికి చాల గట్స్ కావలి, పాయల్ రాజపుత్ కూడా నటించగలదు అని ఈ సినిమాతో నిరూపించుకుంది. శైలు పాత్రకి చాల లేయర్స్ ఉంటాయి, అయితే ప్రతి లేయర్లో తను చూపించిన వేరియేషన్ ఇక పోలీస్ పాత్రలో నందిత శ్వేతా పర్వాలేదు, మలయాళం నటి దివ్య పిళ్లై మంచి ఇంతెన్సె పాత్ర చేసింది. రంగం మూవీ ఫేమ్ అజ్మల్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ తనదైన నటనతో మెప్పించాడు. ఇక రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ వారి పాత్రలకి న్యాయం చేసారు.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని మల్లి విలేజ్ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు అజయ్ భూపతి. అయితే ఈసారి మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని తీసుకుని, దాని చుట్టూ మిస్టరీని జోడించి, మంచి పాత్రలని డిజైన్ చేసుకుని ఒక మంచి సినిమాని అయితే మనకి ప్రెసెంట్ చేసాడు. ఇక అన్ని విధాలుగా ఈసారి ప్రేక్షకులని మెప్పించడంలో విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా మనగలవారం ఉన్నతంగా ఉంటుంది, సినిమాకి అతిపెద్ద ప్లస్ అజనీష్ నేపధ్య సంగీతం. శివేంద్ర దశరధి ఛాయాగ్రహణం కూడా బాగుంది, సినిమా చాలావరకు రాత్రి జరుగుతుండడంతో లైటింగ్, కలర్ టోన్ బాగా మేనేజ్ చేసాడు.

చివరగా, మంగళవారం ట్విస్టులతో పిచ్చెక్కిస్తోంది.

ప్లస్ పాయింట్లు:

  • మూడ్
  •  ట్విస్టులు
  • పాత్రలు
  • నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • మొదటి భాగంలో స్లో నరేషన్

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు