Salaar Movie Review Review:బాహుబలి తరువాత సరైన హిట్ లేక ప్రభాస్ ఫాన్స్ ఏ కాదు సగటు సినిమా ప్రేమికుడు ప్రభాస్ కి ఎప్పుడు హిట్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక మాస్ అవతార్లో చాల సంవత్సరాల తరువాత ప్రభాస్ కనిపించిన చిత్రం ‘సలార్’. ఎన్ని ఫ్లాపులు వచ్చిన ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు, ఇక ఈ సినిమాకి అసలు ప్రమోషన్ కూడా సరిగా చేయకపోయేసరికి అందరికి సినిమా పైన డౌట్ మొదలైంది. కానీ ట్రైలర్ 2 విడుదల అయ్యాక మల్లి సినిమాపైన అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇప్పటికి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.
కథ
దేవా (ప్రభాస్) టిన్సుకియాలో తన తల్లితో పాటు సాధారణ జీవితాన్ని గడుపుతు ఉంటాడు . ఊరికి కొత్తగా వచ్చిన ఆధ్య (శృతి హాసన్) కోసం గూండాలు వెతుకుతూ ఉంటారు. ఇక తనని చంపడానికి వచ్చింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో, ఖాన్సార్ నగరంలో తన బెస్ట్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) యొక్క పథకం అని దేవా తెలుసుకుంటాడు. అసలు ఆధ్య ఎవరు? ఆమెకు వరదరాజ్‌తో సంబంధం ఏమిటి? ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య శత్రుత్వానికి కారణమేమిటి? అనేడి తెలియాలంటే మీరు సినిమా చూడాలి.
సలార్ మూవీ నటీనటులు
ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, మధు గురుస్వామి, శ్రీయా రెడ్డి మరియు ఇతరులు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు, సంగీతం రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, మరియు హోంబలే ఫిలింస్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | సలార్ |
దర్శకుడు | ప్రశాంత్ నీల్ |
నటీనటులు | ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, మధు గురుస్వామి, శ్రీయా రెడ్డి మరియు ఇతరులు. |
నిర్మాతలు | విజయ్ కిరగందూర్ |
సంగీతం | రవి బస్రూర్ |
సినిమాటోగ్రఫీ | భువన్ గౌడ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | నెట్‌ఫ్లిక్స్ |
సలార్ సినిమా ఎలా ఉందంటే?
చాల గ్యాప్ తర్వాత, అభిమానులు చివరకు పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో ప్రభాస్‌ను చూసారు, అభిమానులు కోరుకునే విధంగా ప్రభాస్‌ను ఎలా చూపించాలో ఆలా చూపించి ప్రశాంత్ నీల్ సగం విజయం సాధించారు .
ప్రశాంత్ నీల్ యొక్క సిగ్నేచర్ రేసీ స్క్రీన్ప్లే మరియు ఎలివేషన్స్ తో కథని చెప్తూ మొదటి సగంలో చాల బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇవే కాకుండా అత్యుత్తమ యాక్షన్ సన్నివేశాలు మంచి నేపధ్య సంగీతంతో మొదటి సగం ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం అయితే ప్రేక్షకులకి పూనకాలు తెప్పిస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో కథ మంచి వేగాన్ని కొనసాగించినప్పటికీ, సెకండ్ హాఫ్ కథనం కాస్త నెమ్మదిస్తుంది. కాకపోతే కెజిఫ్ ల ఎలివేషన్స్ ప్రధానంగా చేసుకుని తీసిన సినిమా కాదు ఈ సలార్. డ్రామా ని చూపిస్తూనే ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే ఎలివేషన్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఓవరాల్ గా అయితే మంచి హయ్యి ఇచ్చే సినిమా ఈ సలార్.
ఇక నటన గురించి మాట్లాడుకుంటే, దేవా అకా సాలార్ పాత్రలో ప్రభాస్ సరిగ్గా సరిపోయాడు ఆ పాత్రలో మరొక నటుడిని ఊహించడం కష్టం. అతని పాత్రకి డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీ యాక్షన్ సన్నివేశాల్లో ఆ కట్ అవుట్ కి మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్సు ని అనుభూతి చెందుతాం. లుక్స్ పరంగా ఇంతకముందు కొన్ని కామెంట్స్ మన విన్నప్పటికి, ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ అద్దిరిపోయాడు. ఇక
పృథ్వీరాజ్ సుకుమారన్కి స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ మంచి నటనను ప్రదర్శించాడు. శృతి హాసన్ పాత్రతో సినిమా ప్రారంభం అవ్వడంతో మంచి పాత్ర అనే అనుకుంటాం కానీ కాసేపయ్యాక ఆ పాత్రకి అంత ప్రాధాన్యం లేదు అనిపిస్తుంది ఇక తను నటించడానికి కూడా పెద్ద స్కోప్ లేదు. ఈశ్వరి రావు, జగపతి బాబు, బాబీ సింహ తదితరులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.
ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు, సాధారణ సన్నివేశాలతోనే హీరోయిజాన్ని ఎలివేట్ తను నైపుణ్యుడు అని మల్లి నిరూపించుకున్నాడు. అయితే, సెకండాఫ్‌లో కథ మరియు స్క్రీన్‌ప్లేపై మరింత కేర్ తీసుకుని ఉంటె సినిమా ఇంకా బాగుండేది.
సాంకేతికంగా సలార్ర ఉన్నతంగా ఉంటుంది. రవి బస్రూర్ మల్లి మంచి నేపధ్య సంగీతాన్ని అందించాడు ఇక అతని స్కోర్తో చాలా సన్నివేశాలను ఎలివేట్ అవుతాయి. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ సినిమా సినిమాకే హైలట్, కలర్ టోన్ చాల బాగుంది. అన్బరివు స్టంట్స్ హైలైట్ గా నిలిచాయి.
చివరగా, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సలార్ మంచి ఎంగేజింగ్ యాక్షన్ డ్రామా. ప్రభాస్ అభిమానులకి అయితే పండగే అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్లు:
- ప్రభాస్
- ఎలివేషన్స్
- కలర్ టోన్
- నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్లు:
- రెండవ భాగంలో స్లో నరేషన్
సినిమా రేటింగ్: 3.75/5
ఇవి కూడా చుడండి:
- Mangalavaram Movie Review: మంగళవారం మూవీ రివ్యూ
- Japan Movie Review: జపాన్ మూవీ రివ్యూ
- Keedaa Cola Movie Review: కీడా కోలా మూవీ రివ్యూ