Bubblegum Movie Review: బబుల్ గమ్ మూవీ రివ్యూ

Bubblegum Movie Review Review:యాంకర్ సుమ గారి కొడుకు, డెబ్యూ మూవీ బబుల్ గమ్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక చిన్న సినిమా అందులోను డెబ్యూ సినిమానే అయిన సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈరోజు డెవిల్ కి పోటీగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.

Bubblegum Movie Review

కథ

ఆది (రోషన్ కనకాల) మరియు జాన్వి (మానస చౌదరి) రెండు విభిన్న నేపథ్యాల నుండి వచ్చారు. ఆది పెద్ద ముసిషన్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఒక పబ్ డిజె గా పని చేస్తూ ఉంటాడు. పెద్దింటి అమ్మాయి అయిన జాన్వీ ఆ పబ్ కి వస్తుంది, ఇక తొలిచూపులోనే ఇద్దరు ప్రేమలో పడిపోతారు, ఇంత డబ్బు ఉన్న అమ్మాయి తన లాంటి మాములు మనిషిని ప్రేమిస్తుంది అని ఆది జాన్వీ ని దేవతలా ఆరాధిస్తూ ఉంటాడు. అయితే తన కెరీర్ కోసం టర్కీ వెళ్లాలని ప్లాన్ లో ఉన్న జాన్వీ, ఆది తో జస్ట్ టైంపాస్ చేస్తుంది అనే విషయం ఇద్దరు గోవా ట్రిప్ లో ఉన్నప్పుడు తెలియడం తో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి ఇద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనేది మిగతా కథ.

బబుల్ గమ్ మూవీ నటీనటులు

రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై పి విమల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ సురేష్ రగుతు.

సినిమా పేరుబబుల్ గమ్
దర్శకుడురవికాంత్ పేరేపు
నటీనటులురోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, హర్షవర్ధన్, తదితరులు
నిర్మాతలుపి విమల
సంగీతంశ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీసురేష్ రగుతు
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

బబుల్ గమ్ సినిమా ఎలా ఉందంటే?

‘బబుల్ గమ్’ మనకి కొత్తగా ఎం కనిపించదు, మనం ఇంతకముందు ఎన్నో సినిమాల్లో చుసిన రొటీన్ లవ్ స్టోరీ, అదే రొమాన్స్, కిస్లు కానీ రవికాంత్ దర్శకత్వం వహించిన విధానం బాగుంది. మొదటి సగం పాత్రల పరిచయం, ఆ తర్వాత లవ్ లో పడటం, రొమాన్స్ తప్ప ఏమి ఉండదు. ఎటు పోతుంది సినిమా అనే టైములో ఇంటర్వెల్ బాంగ్ కొంచెం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. కానీ అప్పటికే ప్రేక్షకులకి బోర్ కొట్టేస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ అయితే పేలవంగా తయారైంది. గమ్యం లేని ప్రయాణంగా సాగుతూ ఉంటుంది. ఒక సినిమా వర్కౌట్ అవ్వాలంటే రొమాన్స్ని లిప్ లాక్లని నమ్ముకుంటే సరిపోదు, ఎమోషన్స్ కూడా పండాలి. ఈ సినిమా అక్కడక్కడా ఎంగేజ్ చేస్తుండే తప్ప, మిగతా అంత భారంగా అనిపిస్తుంది.

రోషన్ కనకాల, మొదటి సినిమానే అయిన బాగా నటించాడు, ఎక్కడ బెరుకు లేకుండా ప్రతి ఎమోషని తెర మీద బాగా పండించాడు. ఇక మానస చౌదరి కూడా పరవాలేదు. వీళ్ళద్దిరితో పాటు, హీరో తండ్రిగా చేసిన చైతు జొన్నలగడ్డదే. చికెన్ షాప్ యాదగిరిగా బాగా చేసాడు. కాకపోతే హీరో తండ్రి లాగా అయితే ఎక్కడ అనిపించదు అది కొంచెం చూస్కుంటే బాగుండేది. ఇక హర్ష చెముడు, హర్షవర్ధన్ తమ పాత్రల మేరకు బాగా చేసారు. మిగతా నటి నటులు బాగా చేసారు.

రవికాంత్ ఈ సినిమాని కేవలం యూత్ కోసమే తీసినట్టు అనిపంచింది . ఇప్పుడున్న జెనరేషన్ లవ్ ఎల్ ఉంటుంది అని చూపించే ప్రయాన్తం చేసాడు కానీ మొదటి నుంచి ఎండ్ వరకు ఎంగేజ్ చేయలేకపోయాడు. నవతరం కన్ఫ్యూజ్డ్ లవ్ స్టోరీని, ఓపెన్ ఎండింగ్ తో ముగించడం మాత్రం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.

సాంకేతికంగా ఈ సినిమా అక్కడక్కడా బాగుంటుంది కానీ చాల చోట్ల నిర్మాణ విలువలు పేలవంగ ఉంటాయి. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాని తన మ్యూజిక్ కొంత కాపాడాడు అని చెప్పొచ్చు. రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. సురేష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

చివరగా, బబుల్ గమ్, యావరేజే సినిమా, యూత్ ని కూడా అక్కడక్కడా ఎంగేజి చేస్తుంది అంతే.

ప్లస్ పాయింట్లు:

  • పాటలు
  • నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ స్టోరీ

సినిమా రేటింగ్: 2.5 /5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు