Guntur Kaaram Movie Review Review: మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ అంటే గుర్తొచ్చేది అతడు” మరియు “ఖలేజా” చిత్రాలు. ఈ రెండు సినిమాలు మహేష్ బాబు అభిమానులని ఎంతగానో అలరించాయి. అయితే చాల గ్యాప్ తరువాత త్రివిక్రమ్ మరియు మహేష్ బాబుల కలయికలో సినిమా వస్తుండడంతో అంచనాలు తార స్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.
కథ
ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, వైరా వసుంధర (రమ్యకృష్ణ) తన కొడుకు అయినా రమణ (మహేష్ బాబు ) ని మరియు భర్త (జయరామ్)ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, మరియు తిరిగి వివాహం చేసుకుని ఒక కొడుకుని కానీ తన తండ్రి వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) తో రాజకీయాల్లో ఉంటుంది. మంత్రి పదవిలో ఉన్న వైరా వసుంధర, తన రాజకీయ వారసత్వానికి అడ్డు రాకూడదని, తన తల్లి ఆస్తిపైన ఎలాంటి హక్కు లేదు అని గాని, తన తల్లి తో ఏలేటి సంబంధం లేదు అని సంతకం చేయించాలని వెంకట స్వామి పూనుకుంటాడు. కానీ రమణ దానికి ఒప్పుకోదు, అసలు, వైరా వసుంధర తన కొడుకు రమణని ఎందుకు వదిలేసింది?, రమణ సంతకం చేశాడా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
గుంటూరు కారం మూవీ నటీనటులు
మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం, ఎస్ తమన్ సంకేతం అందించిన ఈ చిత్రానికి, ఎడిటర్ నవీన్ నూలి. ఈ చిత్రాన్ని ఎస్ రాధా కృష్ణ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.
సినిమా పేరు | గుంటూరు కారం |
దర్శకుడు | త్రివిక్రమ్ |
నటీనటులు | మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, తదితరులు |
నిర్మాతలు | ఎస్ రాధా కృష్ణ |
సంగీతం | ఎస్ తమన్ |
సినిమాటోగ్రఫీ | మనోజ్ పరమహంస |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | నెట్‌ఫ్లిక్స్ |
గుంటూరు కారం సినిమా ఎలా ఉందంటే?
‘అల వైకుంఠపురం లని ఇండస్ట్రీ తరువాత త్రివిక్రమ్ సినిమా వస్తుండడంతో ఈసారి మళ్ళి మంచి కథతో వస్తాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ కథని అంత డల్‌గా రాసుకున్నాడు.
ఫస్ట్ హాఫ్ మొత్తం రెండు పాటలు, హీరో డైలాగ్స్, ఫైట్ సీక్వెన్సులు, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ , ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం హీరోయిన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో నిండిపోయింది. సినిమా ప్రారంభంలో, ప్రకాష్ రాజ్ కొన్ని పత్రాలపై సంతకం చేయమని మహేష్ బాబుని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఇంటర్వెల్ అంతా, అదే వవిషయాన్నీ సాగదీసినట్టు అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో, కథ ఒక ట్రాక్ లో నడుస్తుండడంతో హమ్మయ్య అనుకునేలోపే గాడి తిప్పేస్తుంది. మల్లి కొన్ని కామెడీ సన్నివేశాలు, పాటలు, ఫైట్లుతో నడుస్తుంది. ఇవన్నీఉండడం తప్పేం కాదు కానీ, ఇక్కడ సమస్యల్లా అర్థవంతమైన కథ.ఇక తల్లీ కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు అస్సలు ఆకట్టుకోవు.
మహేష్ బాబు ఈ సినిమాని తన భూజాలపైనా మోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటన, కామెడీ టైమింగ్, ఫైట్స్ ముఖ్యంగా డాన్స్, మహేష్ బాబు ఫాన్స్ నే కాదు, సగటు సినిమా ప్రేక్షకుణ్ణి ఉర్రుతలూగిస్తుంది.
శ్రీలీల తన నృత్య ప్రదర్శనలతో అలరించింది, ఇక పాత్రకి గాని తన నటనగాని ఎక్కడ స్కోప్ లేదు. మహేష్ బాబుతో కలిసి వెన్నెల కిషోర్ పండించిన కామెడీ కాస్త ఉరటని ఇస్తుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు మరియు రావు రమేష్ తమ తమ పాత్రల మేరకు బాగానే చేసారు. మీనాక్షి చౌదరి జస్ట్ ఓకే.
ఇక త్రివిక్రమ్ అదే పాత చింతకాయ పచ్చడి కథని రాసుకుని, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.
సాంకేతికంగా, గుంటూరు కారం పర్వాలేదు, కెమెరా పనితనం బాగుతుంది, ఇక తమన్ పాటలు మామూలుగానే ఉన్న విషయం కూడా మనకి తెలిసిందే మరియు నేపధ్య సంగీతం కూడా మామూలుగానే ఉంటుంది.
చివరగా, గుంటూరు కారం, యావరేజే సినిమా, మహేష్ బాబు ఫాన్స్ కి మాత్రమే
ప్లస్ పాయింట్లు:
- మహేష్ బాబు
- అక్కడక్కడా కామెడి
మైనస్ పాయింట్లు:
- రొటీన్ స్టోరీ
సినిమా రేటింగ్: 2.5 /5
ఇవి కూడా చుడండి: