Hanuman Movie Review: హను మాన్ మూవీ రివ్యూ

Hanuman Movie Review Review: ప్రశాంత్ వర్మ మరియు తేజ సజ్జల హను-మాన్ సినిమా గత కొన్ని నెలలుగా అందరి దృష్టిని ఆకర్షించింది. మేకర్స్ ఈ సినిమాను మేకర్స్ దూకుడుగా ప్రమోట్ చేశారు. ఇక గుంటూరు కారంకి పోటీగా విడుదల చేస్తుండడంతో అందరు షాక్ కి గురయ్యారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Hanuman Movie Review

కథ

హనుమంతు (తేజ సజ్జ) అంజనాద్రికి అనే అటవీ ప్రాంతంలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు. హనుమంతు అదే ప్రాంతానికి చెందిన మీనాక్షి (అమృత అయ్యర్)ని ప్రేమిస్తాడు. ఒకరోజు బందిపోట్ల నుండి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు లోయలో పడిపోతాడు. చావు బ్రతుకుతో కొట్టి మిట్టాడుముతున్న హనుమంతుకి, ఒక విలువైన రాయి దొరుకుంది. దాని ద్వారా అతను శక్తివంతుడిగా మారిపోతాడు. ఇక ఆ శక్తి గురించి తెల్సుకున్న మైఖేల్ (వినయ్ రాయ్) అంజనాద్రికి వచ్చి, అక్కడి ప్రజలని, హనుమంతుడిని నమ్మించి ఆ రాయిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఇక అంజనాద్రిని ఈ హనుమంతు ఎలా కాపాడాడు అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

హను మాన్ మూవీ నటీనటులు

తేజ సజ్జ , అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి, సాత్విక్ శ్రీరామ్, తదితరులు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శివేంద్ర, ఎడిటింగ్‌ ఎస్‌బి రాజు తలారి. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.

సినిమా పేరుహను మాన్
దర్శకుడుప్రశాంత్ వర్మ
నటీనటులుతేజ సజ్జ , అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, తదితరులు
నిర్మాతలుకె నిరంజన్ రెడ్డి
సంగీతంగౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీశివేంద్ర
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

హను మాన్ సినిమా ఎలా ఉందంటే?

హనుమాన్‌లో స్టార్టింగ్ నుంచి ఎదో పెద్ద సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి సన్నివేశం, హనుమంతుడిని రిలేట్ చేస్తూ బాగుంటాయి. మొదటి భాగంలో చాల అంశాలు మనకి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి సన్నివేశాలు. ఇక ఇంటర్వెల్ కూడా సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది.

ఇక సెకండ్ ఆఫ్ కూడా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తుది. సెకండ్ హాఫ్ లో ఇంకా చాల మూమెంట్స్ ఉంటాయి, రాముడి సన్నివేశం, మరియు చివరి 15 నిమిచ్చాలు అయితే సినిమాకే హైలట్. ఈ సన్నివేశాలన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు.

తేజ సజ్జ బాగా చేసాడు, ముఖ్యంగా సూపర్ పవర్స్ అందుకున్న క్షణం నుండి. గెట్ అప్ సీను కామెడీ వల్ల సినిమా మరింత వినోదాత్మకంగా మారుతుంది. స్టార్ హీరోల రిఫరెన్స్‌లు మనకి నవ్వులు తెప్పిస్తాయి. వరలక్ష్మి శరత్‌కుమార్‌ బాగా చేసింది. ఇక అమృత అయ్యర్ ఉన్నంతలో పర్వాలేదు. వినయ్ రాయి కూడా బాగా చేసాడు, ఇక మిగిలిన నటి నటులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

ప్రశాంత్ వర్మ, ప్రేక్షకులకి ఏ సన్నివేశాలతో హై తెప్పించాలో బాగా తెలుసుకున్నాడు. హనుమంతుడి కి మంచి ఎలివేషన్స్ ఇస్తూ, హీరో ని ఎలివేట్ చేసిన విధానానికి మెచ్చుకోవలసిందే. కాకపోతే కథ ఇంకా బలంగా ఉంటె బాగుండేది.

సాంకేతికంగా, హను మాన్ బాగుంది, అక్కడక్కడా VFX పేలవంగా ఉన్నప్పటికీ, అంతే బాగా కొన్ని VFX షాట్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమాకి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ నేపధ్య సంగీతం వెన్నెముకగా నిలిచింది.

చివరగా, హను మాన్ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే సూపర్ హీరో చిత్రం

ప్లస్ పాయింట్లు:

  • ఎలివేషన్స్
  • కొన్ని కామెడి సన్నివేశాలు
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్లు:

  • స్లో నరేషన్
  • సింపుల్ కథ
  • VFX

సినిమా రేటింగ్: 3.5 /5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు