Ambajipeta Marriage Band Movie Review : చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి, ఇప్పుడు తనకోసం పాత్రని రాసే స్థాయి ఎదిగాడు సుహాస్. చిన్న సినిమాలే అయినా, కథల ఎంపిక అద్భుతంగా ఉండడంతో, వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. ఇక రైటర్ పద్మభూషణ్ తరువాత, మల్లి మంచి కథాంశంతో అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రంతో మన ముందుకొచ్చాడు. ట్రైలర్ అందరిని ఆకట్టుకోవడం, ప్రమోషన్లతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మల్లి(సుహాస్) మరియు పద్మ (శరణ్య ప్రదీప్) బార్బర్ కుటుంబానికి చెందిన కవలలు. పద్మ అంబాజీపేటలో స్కూల్ టీచర్ పని చేస్తూ ఉంటుంది, మల్లి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో ఒకా సభ్యుడిగా పనిచేస్తుంటాడు. అయితే పద్మకి స్కూల్ టీచర్ గా ఉద్యోగం గ్రామ పెద్ద అయిన వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న) తో అక్రమ సంబంధం వల్లే వచ్చింది అని ఊరంతా పుకారు పుడుతుంది. ఇక మల్లికి వెంకట్ బాబు కి మధ్య గొడవ మొదలవుతుంది. ఇది చాలదు అన్నట్టు వెంకట్ బాబు చెల్లి లక్ష్మి (శివాని నాగారం), మల్లి ప్రేమలో పడుతుంది. ఈ విషయం వెంకట్ బాబుకి తెలియడంతో, ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. ఒక రోజు మల్లి అక్క పద్మని వెంకట్ బాబు అవమానించడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తరువాత ఎం జరిగింది అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ నటీనటులు
సుహాస్,శివాని నాగారం, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, జగదీష్, గోపరాజు రమణ తదితరులు.
దర్శకత్వం దుష్యంత్ కటికినేని. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ యొక్క “GA2 పిక్చర్స్” బ్యానర్‌తో కలిసి స్వేచ్చ క్రియేషన్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు మరియు వెంకటేష్ మహా యొక్క “మహాయాన మోషన్ పిక్చర్స్” సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం వాజిద్ బేగ్.
సినిమా పేరు | అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ |
దర్శకుడు | దుష్యంత్ కటికినేని |
నటీనటులు | సుహాస్,శివాని నాగారం, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, తదితరులు |
నిర్మాతలు | ధీరజ్ మొగిలినేని |
సంగీతం | శేఖర్ చంద్ర |
సినిమాటోగ్రఫీ | వాజిద్ బేగ్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా ఎలా ఉందంటే?
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇంతకముందు చాల సినిమాల్లో చేసిన పేద, ధనిక, కుల సమస్యలతో తీసేంది ఈ సినిమాకూడా. కానీ సినిమా కొత్తగా అనిపించడానికి కారణం, పాత్రలను, మరియు ఆత్మభినం చుట్టూ నడిచే కథ. మొదటి సగం అంత మంచి కామెడీతో ఎంగేజ్ చేస్తుంది. అయితే కామెడీ తో పాటు వచ్చే ప్రేమ సన్నివేశాలు, సద సీదా గా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ దగ్గర వచ్చే సన్నివేశంతో కథని మలుపు తిప్పిన విధానం చాల బాగా ఉంటుంది. రెండవ భాగం చూడాలనే ఉత్సుకత కలుగుతుంది.
ఇక రెండవ భాగం అంతక కూడా సీరియస్ కథనం తో వెళ్తూ ఉంటుంది. పేద ధనిక కులస్తుల మధ్య గొడవ చూపిస్తానే, ఎక్కువగా కులం, అంటరానితనం గురించి కాకుండా, ఆత్మభినం గురించి గొడవ పాడడం కొత్తగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా చాల బాగా కుదిరింది.
సుహాస్ మరో ఆసక్తికరమైన పాత్రను పోషించాడు, అతను పాత్రలో లీనమై, ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు. మల్లి పాత్రని స్ సుహాస్ తప్ప ఇంకెవరు చేయలేరు అన్నంత బాగా నటించాడు. ఇక ఈ సినిమాలో మరో హీరో శరణ్య ప్రదీప్, సుహాస్ సోదరి పాత్రలో ఆకట్టుకునే నటనని ప్రదర్శింది. ఈరోజుల్లో అంత బలమైన పాత్రని రాయడం అభినందించాల్సిన విషయం, అయితే శరణ్య కుడా అంతే అద్భుతంగా నటించింది. ఇక మొదటి సినిమానే అయినా ఎక్కడ బెరుకు లేకుండా శివాని నగరం తన పాత్రను అద్భుతంగా పోషించింది. ‘పుష్ప’ జగదీష్ మరియు నితిన్ ప్రసన్న వంటి సపోర్టింగ్ ఆర్టిస్టులు సినిమాకు తమ వంతు సహకారం అందించారు.
తొలి దర్శకుడు దుష్యంత్ కటికనేని అగ్రవర్ణాలచే అణచివేయబడుతున్న నిరుపేదలకు సంబంధించిన ఒక సాధారణ కథను రాసాడు, అయితే అతను ఎటువంటి వైవిధ్యం లేకుండా సినిమాను వివరించిన విధానం కేక్‌ను గెలుచుకుంది.
నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని రచయితగా మరియు దర్శకుడిగా మంచి మార్కులే పడ్డాయి. మాములు కథే అయినప్పటికీ, తెరపై అద్భుతంగా డిజైన్ చేసిన పాత్రలు, మనస్సుకు హత్తుకునే మాటలు, ఇవన్నీ మనల్ని ఆకట్టుకునేలా చేసాడు.
సాంకేతికంగా ఈ చిత్రం పర్వాలేదు, ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పాటలు పర్వాలేదు, నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ 2007 లో ఉండే వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు.
చివరగా, అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.
ప్లస్ పాయింట్లు:
- పాత్రలు
- నటన
- మాటలు
- క్లైమాక్స్
మైనస్ పాయింట్లు:
- సింపుల్ కథ
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Captain Miller Movie Telugu Review: కెప్టెన్ మిల్లర్ మూవీ తెలుగు రివ్యూ
- Hanuman Movie Review: హను మాన్ మూవీ రివ్యూ
- Guntur Kaaram Movie Review: గుంటూరు కారం మూవీ రివ్యూ