Yatra 2 Movie Review: యాత్ర 2 మూవీ రివ్యూ

Yatra 2 Movie Review : మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర 2, మొత్తానికి ఈరోజు విడుదలైంది. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ అని మనందరికీ తెలిసిందే. ఇక యాత్ర ఊహించండి విధంగా హిట్ అవ్వడంతో మళ్ళి ఎన్నికల సమయానికి ఈ యాత్ర 2 ని మన ముందుకు తీసుకువచ్చారు దర్శకులు మహి వి రాఘవ్. జగన్ మోహన్ రెడ్డి పాత్రని తమిళ నటుడు జీవ పోషించడంతో కొంత సందేహాలు అయితే ఏర్పడ్డాయి కానీ ట్రైలర్ చూసాక, జగన్ మోహన్ రెడ్డి పాత్రకి సరిగ్గా సెట్ అయ్యాడు అనిపించింది. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.

Yatra 2 Movie Review

కథ

యాత్ర 2 అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర (మమ్ముట్టి) మరణం తర్వాత 2009 AP ఎన్నికల ప్రచారంతో కథ మొదలవుతుంది. జగన్ మోహన్ రెడ్డి (జీవా), ఎన్నికల సమయంలో పాదయత్రని చేపడతాడు. ఈ సమయంలో అతనికి ఎదురైనా సంగతలేంటి, అతని రాజకీయ జీవితం మరియు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మిగతా కథ.

యాత్ర 2 మూవీ నటీనటులు

జీవా, మమ్ముట్టి, మహేష్ మంజ్రేకర్, సుజానే బెర్నెర్ట్, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్ మరియు ఇతరులు నటించిన ఈ చిత్రాన్ని మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంగీతం సంతోష్ నారాయణన్ సమకూర్చగా మదీ కెమెరాను నిర్వహించాడు. శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్‌తో కలిసి త్రీ ఆటం లీవ్స్ బ్యానర్‌పై శివ మేక నిర్మించారు.

సినిమా పేరుయాత్ర 2
దర్శకుడుమహి వి. రాఘవ్
నటీనటులుజీవా, మమ్ముట్టి, మహేష్ మంజ్రేకర్, సుజానే బెర్నెర్ట్, శుభలేఖ సుధాకర్, ఇతరులు
నిర్మాతలుశివ మేక
సంగీతంసంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీమదీ
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

యాత్ర 2 సినిమా ఎలా ఉందంటే?

సినిమా చాల నెమ్మదిగా మొదలవుతుంది, కానీ ఒక్కసారి పాదయాత్ర మొదలైన తరువాత వేగం అందుకుంటుంది. ఇక మొదటి భాగం పాత్రల పరిచయం, జగన్ పాత్ర తళుకు భావోద్వేగం లాంటి అంశాలతో ఆకట్టుకుంటుంది. రెండవ భాగంలో మళ్ళి ఎటూ పోతుంది అని అనిపించినా సమయంలో ఒక సన్నివేశంతో ప్రేక్షకులలో ఉత్సాహం తీసుకొస్తుంది.

జీవా తన పాత్రలో డీసెంట్‌గా ఉన్నాడు మరియు జగన్ నిజంగా ఎలా ఉంటాడో, ఎలా నడుస్తాడో, ఎలా మాట్లాడుతాడో అన్ని చాల క్లుప్తంగా అతని మ్యానరిజమ్స్ పట్టుకుని తెర పైన అద్భుతంగా పండించాడు. చంద్ర బాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్ చాల బాగా చేసాడు కానీ అతని డబ్బింగ్ ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మమ్ముట్టి ఉన్నది కాసేపే అయిన తన అత్యుత్తమ నటనను ప్రదర్శించాడు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.

దర్శకుడు మహి వి రాఘవ్ తను ఎం చెప్పాలనుకున్నాడో అది చాలా చక్కగా చెప్పారు. అతను కథను, స్క్రీన్‌ప్లేను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

ఇక సాంకేతికంగా యాత్ర 2 ఉన్నంతంగా ఉంటుంది. సంతోష్ నారాయణన్ తన అద్భుతమైన నేపధ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. ఎలాంటి డల్‌ మూమెంట్‌తో సినిమాను నిరాశపరచకుండా చేసినందుకు ఆయనను తప్పకుండా అభినందించాలి.. మది సినిమాటోగ్రఫీ కూడా చాల బాగుంది. ఇక మిగిలిన సాంకేతిక నిపుణులు వారి పరిధి మేరకు బాగా చేసారు.

చివరగా, యాత్ర 2 జగన్ అభిమానులు నచ్చి మెచ్చే సినిమా.

ప్లస్ పాయింట్లు:

  • పాత్రలు
  • నటన
  • కొన్ని సన్నివేశాలు
  • నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • స్లో కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు