Eagle Movie Review: ఈగల్‌ మూవీ రివ్యూ

Eagle Movie Review: కొన్నో సంవత్సరాల నుంచి రవితేజ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా, సంవత్సరంలో మినిమమ్ రెండు సినిమాలు రిలీస్ చేస్తుంటాడు. ఇక ఈ సంవత్సరం ఈగల్ తో స్టార్ట్ చేసాడు.పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని ఈగల్ పైన ఆసక్తి రేపెలా చేసాయి, ఇక ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా విదురాలైంది. మరి ఆలస్యం చేయకుండా,ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.

Eagle Movie Review

కథ

తలకోనకు చెందిన సహదేవ్ వర్మ (రవితేజ) అరుదైన కాటన్ ని ఉత్పత్తి చేస్తాడు. సహదేవ్ పండించిన అరుదైన పత్తికి యూరప్‌లో మంచి డిమాండ్ ఉందని జర్నలిస్ట్ అయిన నళిని అతని గురించి ఒక కథనాన్ని వ్రాసింది(అనుపమ పరమేశ్వరన్) తెలుసుకుంటుంది. అతని గురించి ఒక కథనాన్ని ప్రచురిస్తుంది. దాని వాళ్ళ నళిని ఇబ్బందుల్లో పడడమే కాకుండా, సహదేవ్ రా, నక్సల్స్ మరియు ఉగ్రవాదులకు మోస్ట్ వాంటెడ్ వ్యక్తి అని తెలుస్తుంది. అసలు ఈ సహదేవ్ ఎవరు? తలకోనలో ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈగల్‌ మూవీ నటీనటులు

రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం కార్తీక్ గట్టమనేని, సంగీతం దావ్‌జాంద్ అందించగా, కార్తీక్ గట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి ఛాయాగ్రహణం చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుఈగల్‌
దర్శకుడుకార్తీక్ గట్టమనేని
నటీనటులురవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, తదితరులు
నిర్మాతలుటీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
సంగీతందావ్‌జాంద్
సినిమాటోగ్రఫీకార్తీక్ గట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఈగల్‌ సినిమా ఎలా ఉందంటే?

సినిమా ఆసక్తికర అంశంతో మొదలవడంతో ఒక కొత్త రకమైన కమర్షియల్ సినిమాని చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈగిల్ ఫస్ట్ హాఫ్ అంతే ఎలివేషన్స్ తో, హీరో క్యారెక్టర్ తాలూకు మిస్టరీ ఎదో ఉందని చెప్తూ, రిపిటీటివ్ సన్నివేశాలతో బోరింగ్‌గా అనిపిస్తుంది. మొదటి సగం అంత నెమ్మదిగా సాగుతూ ఉంటుంది, అసలు కథ కోసం మనం ఇంటర్వల్ దాక ఎదురుచూడాల్సినే పరిస్థితి నెలకొంది.

ఇక రెండవ భాగం అసలు కథలోకి వెళ్ళాక, గ్లోబల్ ఇష్యూని హేండిల్ చేసిన విధానం చాల బాగుంది. ఇక అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఒక విద్వాంసమే కనిపిస్తుంది. యాక్షన్ ప్రియులందరికీ మాత్రం తెర మీద ఒక పండగ చూస్తున్నట్టు ఉంటుంది. అజయ్ ఘోష్ కామెడీ సినిమాలో కొంత ఉరటని కలిగిస్తుంది, ఇక ఎమోషనల్ గా మాత్రం ఈ సినిమా ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేకపోయింది.

ఇక నటన గురించి మాట్లాడుకుంటే, రవితేజ తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్త ప్రయత్నం చేసాడు. సహదేవ్‌గా అద్భుతంగా నటించాడు. అతని గెటప్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లన్నింటిలోనూ చాల స్టైలిష్గా నటించాడు. ఇక కావ్య తాపర్ ఉన్నంతలో బాగా చేసింది, అనుపమ పరమేశ్వర్ పర్వాలేదు. వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, నవదీప్, మధుబాల తదితరులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక గ్లోబల్ ఇష్యూ ని తీస్కుని, దాని చుట్టూ అల్లుకున్న కథ బాగానే ఉంది. అయితే దర్శకుడు కథ పక్కన పెట్టి కథానాయకుడి పాత్ర పైన ఎక్కువ దృశుతి పెట్టదనిపిస్తుంది. ఏది ఏమైనా కొంత మేరకు ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడని చెప్పాలి.

సాంకేతికంగా, తెలుగు సినిమా నుండి వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఈగల్ ఒకటిగా నిలుస్తుంది.ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి ప్రధాన ఆకర్షణ, డేవ్ జండ్ పాటలు పర్వాలేదు కానీ నేపధ్య సంగీతం చాల బాగా సమకూర్చాడు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఇంత స్టైలిష్ గా ప్రెజెంట్ చేసినందుకు మేకర్స్ మెచ్చుకోవాల్సిందే.

చివరగా, ఈగల్‌ మంచి స్టైలిష్ యాక్షన్ డ్రామా కానీ కథే?

ప్లస్ పాయింట్లు:

  • రవితేజ
  • విజువల్స్
  • యాక్షన్
  • నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • మొదటి భాగం స్లో కథనం
  • ఎమోషన్ పండకపోవడం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు