True Lover Movie Review: మణికందన్ ప్రధాన పాత్రలో నటించిన “గుడ్ నైట్”, సినిమాని నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ ఇప్పుడు ‘లవర్’ అనే మరో ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు లో ట్రూ లవర్ పేరుతో ఎస్ కె న్ విడుదల చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో చిన్న సినిమానే అయిన మంచి బజ్ ని క్రియేట్ చేసింది, ఎట్టకేలకు ఈరోజు ఈ చిత్రం విడుదల అయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూలో తెల్సుకుందాం.
కథ
దివ్య (శ్రీ గౌరీ ప్రియ) ఐటి ఉద్యోగిగా పని చేస్తుంది. తన ఆఫీస్ లో పని చేసే స్నేహితులకి తన ప్రేమ కథని చెప్తూ ఉంటుంది. అరుణ్ (మణికందన్) మరియు దివ్య (శ్రీ గౌరి ప్రియా) ఇద్దరు ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. ఈ ఆరు సంవత్సరాలలో గొడవలు పడటం, దూరం అవ్వడం, మళ్ళీ కలవడం జరుగుతూనే ఉన్నాయ్. ఒకరోజు అరుణ్, దివ్య ని పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు, కానీ దివ్య కొంచెం టైం కావాలని తన నిర్ణయం చెప్పకుండా అరుణ్ ని వెయిటింగ్లో ఉంచుతుంది. దీంతో ఇద్దరి మధ్య ఇంకాస్త దూరం పెరుగుతుంది, ఆ సమయంలో దివ్య తన స్నేహితులతో ట్రిప్ కి వెళ్లడం తెలుస్తుంది, అబద్దం చెప్పి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అరుణ్ గొడవ చేయడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి వీళ్లు మళ్ళీ కలిసారా, పెళ్లి చేసుకున్నారా అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.
ట్రూ లవర్ మూవీ నటీనటులు
మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి, శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రభురామ్ వ్యాస్. ఈ చిత్రానికి సంగీతం సీన్ రోల్డన్ మరియు సినిమాటోగ్రఫీ శ్రేయాస్ కృష్ణ. నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్ ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, మరియు MRP ఎంటర్టైన్మెంట్ పై నిర్మించారు. మారుతి టీమ్ ప్రొడక్ట్, ఎస్ కె న్ మాస్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెసెంట్ చేసారు.
సినిమా పేరు | ట్రూ లవర్ |
దర్శకుడు | ప్రభురామ్ వ్యాస్ |
నటీనటులు | మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి, తదితరులు |
నిర్మాతలు | నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్ |
సంగీతం | సీన్ రోల్డన్ |
సినిమాటోగ్రఫీ | శ్రేయాస్ కృష్ణ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
ట్రూ లవర్ సినిమా ఎలా ఉందంటే?
ట్రూ లవర్ ఈ తరం యువతీ యువకులకు బాగా కనెక్ట్ అయ్యే చిత్రం. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మన నిజ జీవితంలో చూసినవే అవ్వడం, అందులోను ప్రేమికులు నిజ జీవితంలో ఎదుర్కునే సమస్యలు, మనస్పర్థాలు అన్ని ఈ సినిమాలో క్లుప్తంగా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా చాల నీట్ గా రియలిస్టిక్‌గా తెర పై ప్రెసెంట్ చేసాడు.
మొదటి సగం అంత మంచి సన్నివేశాలతో ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తుంది. కానీ రెండవ సగంలో కథనం స్లో అవుతుంది. కాసేపు బోర్ కొట్టిన ఆ తరువాత మంచి ఎమోషనల్ సన్నివేశంతో కథనం ఊపందుకుంటుంది. ముఖ్యంగా అరుణ్ తల్లి దగ్గర దివ్య క్షమాపణలు అడిగే సన్నివేశం చాల బాగా పండింది.
ఇక నటన విషయానికి వస్తే, అరుణ్ గా మణికందన్ ఎప్పటిలాగా చాల నాచురల్ గా నటించాడు. ప్రేమ, అమాయకత్వం, కోపం ఇలా ప్రతి భావోద్వేగాన్ని అద్భుతంగా పండించాడు. అలాగే తెలుగు నటి శ్రీ గౌరీ ప్రియ మొదటి తమిళ్ సినిమానే అయిన ఎక్కడ అది తెలియకుండా పరిణితి చెంది నటి గా నటించింది. మొదటి సినిమాతోనే నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం అదృష్టం, అలాగే శ్రీ గౌరీ ప్రియ కూడా దివ్య పాత్రకి న్యాయం చేసింది. ఇక మిగిలిన నటి నటులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.
దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ మంచి రిలెటబల్ కథని చాల ఎంగేజింగ్ గా చెప్పారు. రెండవ భాగంలో కొంచెం బోర్ కొట్టిన మొత్తం మీద ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు. ముఖ్యంగా రైటింగ్ చాల బాగుంది.
సాంకేతికంగా, ట్రూ లవర్ పర్వాలేదన్పిస్తుంది. సీన్ రోల్డన్ పాటలు పెద్దగా ఆకట్టుకోవు కానీ గుడ్ నైట్ మూవీ తరువాత మళ్ళీ మంచి నేపధ్య సంగీతాన్ని ఈ సినిమాకి అందించారు. ఇక శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం కూడా పర్వాలేదనిపిస్తుంది.
చివరగా, ట్రూ లవర్ ఈతరం యువతీ యువకులకు నచ్చే చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- కథ
- పాత్రలు
- నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్లు:
- రెండవ భాగంలో అక్కడక్కడా స్లో కథనం
సినిమా రేటింగ్: 2.75/5
ఇవి కూడా చుడండి:
- Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ
- Yatra 2 Movie Review: యాత్ర 2 మూవీ రివ్యూ
- Ambajipeta Marriage Band Movie Review: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ రివ్యూ