Bhamakalapam 2 Movie Review Review: 2022 లో ప్రియమణి నటించిన క్రైమ్ కామెడీ భామాకలాపం ఊహించని విధంగా విజయం సాధించింది. అసలు ఆ సమాయలంలో అహ OTT ప్లాట్ఫామ్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక సినిమాకైనా, సిరీస్ అయినా, రెండవ పార్ట్ అనౌన్స్ చేయడం ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఆ ట్రెండ్ నే ఫాలో అవుతు భామాకలాపం 2 తో మన ముందుకొచ్చారు. ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఆసక్తి రేకెత్హించింది, మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.
కథ
అనుపమ (ప్రియమణి) తను ఉంటున్న అపార్ట్మెంట్ ఖాళీచేసి కొత్త అపార్ట్మెంట్కి కుటుంబంతో సహా వెళ్తుంది. ఇక తన భర్త మోహన్, ఇంతకముందు చేసినట్టు వేరే విషయాల్లో తలదూర్చిద్దని అనుపమ దగ్గర మాట తీసుకుంటాడు. దానికి అనుపమ కూడా సరే అని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బుతో, తన దగ్గర పని చేసిన పని మనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) ని భాగస్వామిగా చేసుకుని ఒక హోటల్ ప్రారంభిస్తుంది. అయితే అంత బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో అనుపమ తన హోటల్ లో ఒక వ్యక్తి చనిపోవడంతో మళ్ళి సమస్యలో ఇరుక్కుంటుంది. ఈ సమస్యనుంచి బయట పడాలంటే ఒక దొంగ తనం చేసి పెట్టాలి అని పోలీస్ ఆఫీసర్ సదానందం అడుగుతాడు. చేసేదేమి లేక అనుపమ సరే అంటుంది. ఆ దొంగతనం ఏంటి? అనుపమ ఈ సమస్య నుంచి ఎలా బయపడింది అనేది మిగతా కథ.
భామాకలాపం 2 మూవీ నటీనటులు
ప్రియమణి, సీరత్ కపూర్, బ్రహ్మాజీ, ప్రదీప్ రుద్ర, శరణ్య ప్రదీప్, సందీప్ వేద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. ఆహా స్టూడియోతో కలిసి డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, బి బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి మరియు ఛాయాగ్రహణం దీపక్ యరగెర.
సినిమా పేరు | భామాకలాపం 2 |
దర్శకుడు | అభిమన్యు తడిమేటి |
నటీనటులు | ప్రియమణి, సీరత్ కపూర్, బ్రహ్మాజీ, ప్రదీప్ రుద్ర, శరణ్య ప్రదీప్, తదితరులు |
నిర్మాతలు | సుధీర్ ఈదర, బి బాపినీడు |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
సినిమాటోగ్రఫీ | దీపక్ యరగెర |
ఓటీటీ రిలీజ్ డేట్ | 16 – ఫిబ్రవరి – 2024 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ఆహా |
భామాకలాపం 2 సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమా మొదలవడమే చాల స్లోగా మొదలవుతుంది. పాత్రల పరిచయంతోనే చాల సమయం గడిచిపోతుంది. ఇక నలభై నిమిషాల తరువాత గాని అసలు కథ మొదలవదు. అప్పటిదాకా సాగతీతగా అనిపించిన ఒక్కసారి అసలు కథ మొదలయ్యాక, అనుపమ మరియు టీం దొంగతనం కోసం వేసే ప్లాన్స్ ఎంగేజింగ్ గా అనిపిస్తాయి.
అయితే, అదంతా కాసేపు మాత్రమే ఉంటుంది, తరువాత ఇంతకముందు ఎన్నో సినిమాల్లో చుసిన సన్నివేశాల్లాగే ఉండడంతో బోరింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే కథని పక్కదారి పట్టించకుండా, దొంగతనం మీదనే కథని నడిపించడం బాగుంది. ఇక క్లైమాక్స్ కూడా చాల మాములుగా ఉండడంతో సాధ సీదాగా అనిపిస్తుంది ఈ భామకలాపం ౨.
ఇక నటన విషయానికి వస్తే, అనుపమగా ప్రియమణి మళ్ళి అలరించింది. శిల్పగా శరణ్య ప్రదీప్ చాల బాగా చేసింది. తను పండించిన కామెడీ సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు.సీరత్ కపూర్ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం లేదు మరియు తను ఉన్నంతలో కూడా తన నటనతో ఆకట్టుకోలేక పోయింది. ఇక బ్రహ్మాజీ, ప్రదీప్ రుద్ర పర్వాలేదు.
అభిమన్యు తడిమేటి, మొదటి పార్ట్లో బంగారు కోడిగుడ్డు చుట్టూ అల్లుకున్న కథ, అందరిని ఎంగేజ్ చేసింది. ఈసారి కూడా బంగారు కోడి చుట్టూ కథ రాసుకున్నాడు కానీ మొదటి పార్ట్ తీసినంత ఎంగేజింగ్గా తీయడంలో విఫలమయ్యాడు. కథలో ఎక్కువ పాత్రలు ఉండడం, ఆ పాత్రలకి సరైన ఎండింగ్ ఇవ్వకపోవడం, క్లైమాక్స్ కూడా గందరగోళంగా ముగించడం మైనస్ అనిపిస్తుంది.
సాంకేతికంగా, భామాకలాపం 2 మాములుగా ఉంటుంది. ప్రశాంత్ ఆర్ విహారి నేపధ్య సంగీతం అక్కడక్కడా బాగుంది, మరియు దీపక్ యరగెర ఛాయాగ్రహణం పేలవంగా ఉంది.
చివరగా, భామాకలాపం 2 రెండు గంటలపాటు థ్రిల్ చేస్తుంది.
ప్లస్ పాయింట్లు:
- ప్రియమణి మరియు శరణ్య ప్రదీప్
మైనస్ పాయింట్లు:
- కథ
- కథనం
- క్లైమాక్స్
సినిమా రేటింగ్: 2.75 /5
ఇవి కూడా చుడండి:
- Ooru Peru Bhairavakona Movie Review: ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ
- True Lover Movie Review: ట్రూ లవర్ మూవీ రివ్యూ
- Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ