Sundaram Master Movie Review: సుందరం మాస్టర్ మూవీ రివ్యూ

Sundaram Master Movie Review Review: షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ కెరీర్ మొదలుపెట్టిన హర్ష చెముడు, అనుకోకుండా తను నటించిన వైవా షార్ట్ ఫిలిం వైరల్ అవడంతో హర్ష చెముడు కాస్త వైవా హర్షగా మారిపోయాడు.ఆ తరువాత చాలా సినిమాల్లో తన కామెడీతో ఎంతలా అలరించాడో మనకి తెలిసిందే. ఇక ఇప్పుడు కమెడియన్ కాస్త సుందరం మాస్టర్ అనే సినిమాతో హీరోగా మారిపోయాడు. మాస్ మహారాజ రవితేజ నిర్మించిన ఈ చిత్రం టీజర్ నుంచే మంచి బజ్ ని క్రీయేట్ చేసింది. మరి ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందొ ఇక ఆలస్యం చేయకుండా ఈ రివ్యూలో చూద్దాం.

Sundaram Master Movie Review

కథ

సుందర్ రావు (హర్ష చెముడు) ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. జీవితంలో ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటాడు. దాంట్లో భాగంగానే, ఎక్కువ కట్నంతో పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఎమ్మెల్యే(హర్ష వర్ధన్) సుందర్ రావుని ఇంగ్లీష్ టీచర్ గా బయట ప్రపంచంతో సంబంధంలేని మిర్యాలమెట్ట అనే ఊరికి పంపించాలని డిసైడ్ అవుతాడు. అయితే ఆ ఊర్లో ఒక విలువైంది ఉంది దాన్ని ఆరు నెలల్లో తెలుసుకుంటే నీకు DEO పోస్ట్ ఇస్తానని ఎమ్మెల్యే సుందర్ రావు తో అంటాడు. DEO అయితే ఇంకా ఎక్కువ కట్నంతో పెళ్లి చేసుకోవొచ్చు అని వెంటనే మిర్యాలమెట్టకి వెళ్ళడానికి సరే అంటాడు. అక్కడికి వెళ్ళాక, సుందర్ రావు పడ్డ కష్టాలేంటి? ఇంతకీ ఆ ఊర్లో ఏముంది అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

సుందరం మాస్టర్ మూవీ నటీనటులు

హర్ష చెముడు, దివ్య శ్రీపాద, హర్ష వర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం మరియు తదితరులు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. గోల్డెన్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుధీర్ కుమార్ కుర్రతో కలిసి ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై రవితేజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం: దీపక్ యెరెగెరా.

సినిమా పేరుసుందరం మాస్టర్
దర్శకుడుకళ్యాణ్ సంతోష్
నటీనటులుహర్ష చెముడు, దివ్య శ్రీపాద, హర్ష వర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం మరియు తదితరులు
నిర్మాతలుసుధీర్ కుమార్ కుర్ర, రవితేజ
సంగీతంశ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీదీపక్ యెరగేరా
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

సుందరం మాస్టర్ సినిమా ఎలా ఉందంటే?

ఒక మారుమూల గ్రామంలో అందరు ఇంగ్లీష్ మాట్లాడ్డం అనే పాయింట్ టీజర్ చూసినప్పుడూ చాల కొత్తగా అనిపించింది. అయితే టీజర్లో ఉన్న కామెడీ సినిమాలో కూడా ఉంటుంది, కాకపోతే అది మొదటి సగంకే పరిమితం అవుతుంది. ఒక్కసారి సుందర్ రావు మిర్యాల మెట్టకు వెళ్ళాక, తను పడే ఇబ్బందులు, ఆ ఉరి వాళ్ళు తనతో ఇంగ్లీష్ మాట్లాడ్డం, ఇలా మంచి సన్నివేశాలతో మొదటి సగం హ్యాపీ గా నవ్వుకుంటాం.

ఇక ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశంతో రెండవ భాగంలో మరో కథ చూడబోతున్నం అని అర్థమవుతుంది. అనుకున్నట్టుగానే, కామెడీని పక్కన పెట్టి, విగ్రహం అని,ప్రకృతి అని ఎమోషనల్గా సాగుతుంది. అక్కడక్కడా కామెడీ ఉన్నప్పటికీ, స్లో కథనం, ఎమోషన్కి కనెక్ట్ కాకపోవడంతో బోర్ కొడుతుంది. ఏది ఏమైనా, కొంచెం స్లో కథనాన్ని భరిస్తే కొంచెం ఎంగేజ్ చేస్తుంది.

ఇక నటన విషయానికి వస్తే, హర్ష చెముడు, సుందర్ రావు పాత్రలో చాల బాగా ఒదిగిపోయాడు. ఈసారి కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా బాగా పండించాడు. దివ్య శ్రీపాద ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. ఇక హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం పర్వాలేదు.

దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఎంచుకున్న పాయింట్ చాల బాగుంది మరియు అది ప్రెసెంట్ చేసిన విధానం కూడా బాగుంది కానీ అది మొదటి భాగం వరకే. రెండవ భాగంలో కథని ఎంగేజింగ్ గా నడిపించలేక పోయాడు.

సాంకేతికంగా సుందరం మాస్టర్ పర్వాలేదు, శ్రీ చరణ్ పాకాల సంగీతం కథకు తగ్గట్టుగ ఉంది. ఇక దీపక్ యెరగేరా చాయాగ్రహణం బాగుంది. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మెచ్చుకుని తీరాల్సిందే. మిర్యాల మెట్ట ని చాలా బాగా చూపించారు.

చివరగా, సుందరం మాస్టర్, రెండవ భాగంలో స్లో కథనాన్ని కొంచెం సమయం ఓపిక పడితే, ఓవరాల్ గా ఈ సినిమా బాగా నవ్విస్తుంది.

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ
  • హర్ష నటన
  • మొదటి భాగం

మైనస్ పాయింట్లు:

  • స్లో కథనం
  • రెండవ భాగం

సినిమా రేటింగ్: 2.75 /5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు