Razakar Movie Review: చారిత్రాత్మక కథలు తెలుగులో చాల అరుదుగా వస్తుంటాయి అయితే హైదరాబాద్ చరిత్ర ఏంటి, ఒకప్పుడు అది ఎలా ఉండేది, ముఖ్యంగా 1947 లో ఎలా ఉండేది అని ఎవరు తెర పై చూపించలేక పోయారు. ఇక ఇప్పుడు రజాకార్ అనే చిత్రం దానికి నాంది పలికింది. టీజర్ విడుదల అయినప్పటినుంచి ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఈ రివ్యూలో తెల్సుకుందాం.
కథ
భారతదేశానికీ 1947 లో స్వతంత్రం వచ్చినప్పటికీ, నైజాం ని మాత్రం భారత దేశంలో కలపడానికి ఇష్టంలేని నిజాం ఏడవరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్(మకరంద్ పాండే) తుర్కిస్తాన్‌గా మార్చి, కొత్త దేశంగా చేయాలనీ కుట్ర పన్నుతాడు. ఇక ఈ విషయం తెల్సుకున్న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్(తేజ్ సప్రు) వెంటనే నైజాంని భారతదేశంలో మిలీనం చేయాలనీ అనుకుంటాడు. కానీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై చర్యలు తీసుకోడానికి ప్రధానమంత్రి నెహ్రు ఒప్పుకోడు. చివరికి ఎం జరిగింది అనేది తెల్సుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
రజాకార్ మూవీ నటీనటులు
బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనసూయ, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, జాన్ విజయ్, మహేష్ ఆచంట తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది యాట సత్యనారణ. సమరవీర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో మరియు సినిమాటోగ్రఫీ: రమేష్ కుశేందర్.
సినిమా పేరు | రజాకార్ |
దర్శకుడు | యాట సత్యనారణ |
నటీనటులు | బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనసూయ, మకరంద్ దేశ్‌పాండే, తదితరులు |
నిర్మాతలు | గూడూరు నారాయణరెడ్డి |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
సినిమాటోగ్రఫీ | రమేష్ కుశేందర్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
రజాకార్ సినిమా ఎలా ఉందంటే?
1948 లో నిజాం ని భారతదేశం లో కలవనీయకుండా అప్పటి ఏడవరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన అరాచకాలు, కళ్ళకి కట్టిన చూపించారు. మనం ఇప్పుడూ చూస్తున్న హైదేరాబద్ ఒకప్పుడు ఇంత దారుణంగా ఉండేదా అనిపించక మానదు. అయితే కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ, ఈ చిత్రం బాగానే ఎంగేజ్ చేస్తుంది.
సినిమా మొదలైన అయిదు నిమిషాలకే అసలు కథలోకి వెళ్తుంది, అయితే మొదటి సగంలో కథని పక్కకి పెట్టి, వచ్చే ప్రతి పాత్రకి హీరో లెవెల్లో ఎలివేషన్లు ఇస్తుంటే చిరకన్పిస్తుంది. ఇక మంచి డైలాగ్స్, యాక్షన్ తో మొదటి సగం ఎంగేజ్ చేస్తుంది. ఇక రెండవ సగంలో, కథ ఇంకా రసవత్తరంగా మారుతుంది. ప్రతి పాత్ర నిజాంని భారతదేశంలో కలపడానికి ఎంత కష్టపడ్డారో చాల ఇంట్రెస్టింగ్ చూపించారు.
ఇక నటన విషయానికి వస్తే, ముఖ్యమైన పాత్రలన్నీ పేరున్న నటి నటులు పోషించడంతో
ఆ పాత్రలు గుర్తుండిపోతుంది. ఇక రాజా రెడ్డి బాబీ సింహ అధిభూతంగా చేసాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ గా ఆ పాత్రకి న్యాయం చేసాడు మకరంద్ పాండే. ఐలమ్మగా ఇంద్రజ అంతగా సెట్ అవ్వలేదన్పించింది. ఇక అనసూయ, ప్రేమ, వేదిక వారి పాత్రల మేరకు బాగానే చేసారు.
దర్శకుడు యత సత్యనారాయణ, నిజమైన కథని అక్కడక్కడా సినిమాటిక్ తీసినప్పటికి, అసలైన కథని ఎక్కడ వక్రీకరించకుండా బాగా తీసాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలు తప్ప రెండున్నర గంటలపాటు ఎంగేజ్ చేయలేకపోయాడు.
సాంకేతికంగా రజాకార్ బాగుంది, అక్కడక్కడా VFX మినహా, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక భీమ్స్ సిసిరోలియో పాటలు అస్సలు ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం బాగానే అందించాడు.
చివరికి, రజాకార్ కమర్షియల్ హంగులతో నిండిన చారిత్రాత్మక చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- ఛాయాగ్రహణం
- నేపధ్య సంగీతం
- కొన్ని సన్నివేశాలు
- డైలాగ్స్
మైనస్ పాయింట్లు:
- కథనం