Aadujeevitham – The Goat Life Movie Review: ఆడుజీవితం – ది గోట్ లైఫ్ మూవీ రివ్యూ

Aadujeevitham Movie Review: గత కొన్ని సంవత్సరాల నుంచి మళయాళం నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో తెలిసిన విషయమే. ఇక ఈ సంవత్సరం కూడా ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్, భ్రమయుగం లాంటి చిత్రాలతో విజయాపదంగా దూసుకెళ్లిపోతూన్నారు. ఈ మూడు సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక మల్లి కొత్తరకమైన సినిమాతో మన ముందుకొచ్చారు. అదే ప్రిథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఆడుజీవితం – ది గోట్ లైఫ్. దాదాపు 16 సంవత్సరాలు తీసిన ఈ చిత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి అన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం.

Aadujeevitham The Goat Life Movie Review

ఆడుజీవితం – ది గోట్ లైఫ్ కథ

నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్), మరియు తన స్నేహితుడు హకీమ్ (కెఆర్ గోకుల్) ఇద్దరు ఏదైనా పని కోసం సౌదీ అరేబియాలో వెళ్తారు. ఇంగ్లీష్ గాని, హిందీ గాని వారికి రాకపోయేసరికి చాల కష్టాలు ఎదుర్కుంటారు. ఇక చాల సమయం తరువాత తమ స్పాన్సర్ ఖఫీల్ (తాలిబ్ అల్ బలూషి) వస్తాడు. కానీ ఖఫీల్ ఇద్దరినీ మోసం చేసి, వారిని విడగొట్టి, నజీబ్అ కి మేకల కాపారి పని చూపిస్తాడు. ఇక ఎం చేయాలో తెలియని నజీబ్ జీవితం ఎలా గడించింది, ఎడారిలో తను ఎలాంటి కష్టాలు అనుభవించాడు. చివరికి తన సొంత ఉరికి చేరుకున్నాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

ఆడుజీవితం – ది గోట్ లైఫ్ మూవీ నటీనటులు

పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, రిక్ అబీ, తాలిబ్ అల్ బలూషి మరియు ఇతరులు. ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించగా, సునీల్ కె.ఎస్ కెమెరాను నిర్వహించారు. A. R. రెహమాన్ సంగీతం అందించగా, ఏ .శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేసారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్ బ్యానర్‌పై బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్ మరియు స్టీవెన్ ఆడమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుఆడుజీవితం – ది గోట్ లైఫ్
దర్శకుడుబ్లెస్సీ
నటీనటులుపృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, ఇతరులు
నిర్మాతలుబ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్ మరియు స్టీవెన్ ఆడమ్స్
సంగీతంA. R. రెహమాన్
సినిమాటోగ్రఫీసునీల్ కె.ఎస్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఆడుజీవితం – ది గోట్ లైఫ్ సినిమా ఎలా ఉందంటే?

మలయాళంలో స్టార్ హీరో అయ్యుండి, ఇలాంటి చిత్రాన్ని చేసినందుకు, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ గారిని అభినందించాల్సిందే. అసలు ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా, రియలిస్టిక్ గా తీయడానికి చాల ధైర్యం కావాలి.

మలయాళం సినిమాలంటేనే స్లో స్క్రీన్ప్లే తో వెళ్తుంటాయి. ఇక ఈ సినిమా కూడా చాల స్లో గా వెళ్తూ ఉంటుంది. మొదటి సగం స్లో గా, ఒక్క నజీబ్ పాత్రనే కాకుండా, ప్రతి పాత్రని చాల క్లుప్తంగా చూపించారు. ఇక రెండవ భాగం, ఎడారిలో సన్నివేశాలు, హృదయాన్ని హత్తుకునే నేపధ్య సంగీతం, ప్రిథ్వీరాజ్ నటన, ఇవన్నీ కలిసి రెండవ భాగాన్ని ఎక్కడ బోర్ కొట్టకుండా మలిచారు. ఈ సినిమాకి మైనస్ ఏదైనా ఉంది అంటే అది స్లో కథనం.

ఇక నటన విషయానికి వస్తే, నజీబ్ పాత్రలో ఒదిగిపోయాడు ప్రిథ్వీరాజ్ సుకుమారం. ప్రతి సన్నివేశంలో నజీబ్ మాత్రమే కనిపిస్తాడు. ముఖ్యంగా ఎడారిలో జరిగే ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించాడు. ఇక అమల పాల్ ఉన్నంతలో పర్వాలేదు. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

దర్శకుడు బ్లేస్సి మలయాళం అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. అసలు ఇంత పెద్ద బడ్జెట్ తో మలయాళం సినిమా తీయాలి అనుకోవడం అదికూడా 2008 లో అంటే మాములు విషయం కాదు. ఇక ఎక్కడ కమర్షియల్ అంశాలు పెట్టకుండా, చాలా చాల రియలిస్టిక్ గా తీసాడు. ప్రతి సన్నివేశాన్ని చాల అందంగా, భావోద్వేగంగా మలచడంలో విజయం సాధించాడు.

ఆడుజీవితం – ది గోట్ లైఫ్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది, ఏ. ఆర్. రెహమాన్ పాటలు పర్వాలేదు కానీ నేపధ్య సంగీతంతో సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక సునీల్ కె.ఎస్ ఛాయాగ్రహణం కూడా అద్భుతంగా ఉంది. మిగిలి సాంకేతిక నిపుణులు కూడా అధిభూతంగా చేసారు.

చివరికి, ఆడుజీవితం – ది గోట్ లైఫ్ కమర్షియల్ అంశాలు పట్టించుకోని వాళ్ళకి అద్భుతమైన అనుభూతిని థియేటర్లో ఇస్తుంది.

ప్లస్ పాయింట్లు:

  • కథ
  • నటన
  • నేపధ్య సంగీతం
  • దర్శకత్వం
  • ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్లు:

  • స్లో కథనం

సినిమా రేటింగ్: 3.75/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు