Tillu Square Movie Review: DJ టిల్లు అంత పెద్ద హిట్ అవుతుంది అని, సిద్దు జొన్నలగడ్డ అంత ఫేమస్ అవుతాడు అని గాని ఎవరు ఊహించలేదు. ఇక ‘రాధిక’ డైలాగ్లు, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ భాష ప్రేక్షకులని ఏ విధంగా అలరించాయి తెలిసిన విషయమే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సినిమాకి రెండవ పార్ట్ తీయడం మామూలైపోయింది, ఇక ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా అని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సినిమా లవర్స్ కి టిల్లు స్క్వేర్ గా మన ముందుకొచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.
టిల్లు స్క్వేర్ కథ
టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఈవెంట్ ఆర్గనైజర్ గా ఎలాంటి గొడవల్లో తల దూర్చకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అంత బాగుంది అనుకున్న టైములో లిల్లీ (అనుపమ పరమేశ్వరన్)ని చూసి వెంటనే ప్రేమలో పడతాడు ఇక మెల్లిగా లిల్లి కూడా టిల్లుని ఇష్టపడుతుంది. అయితే లిల్లి వల్ల టిల్లు మల్లి ఒక పెద్ద ప్రాబ్లెమ్ లో ఇరుక్కుంటాడు. చివరికి టిల్లు ఎలా బైట పడ్డాడు అనేది మిగతా కథ.
టిల్లు స్క్వేర్ మూవీ నటీనటులు
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మరియు మిగిలిన నటీనటులు ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రహణం, రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, అచ్చు రాజమణి, భీమ్స్ సంగీతం, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య నిర్మించారు .
సినిమా పేరు | టిల్లు స్క్వేర్ |
దర్శకుడు | మల్లిక్ రామ్ |
నటీనటులు | సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మరియు తదితరులు |
నిర్మాతలు | సూర్యదేవర నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య |
సంగీతం | రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, అచ్చు రాజమణి, భీమ్స్ |
సినిమాటోగ్రఫీ | సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉందంటే?
ఈ డిజె టిల్లు గాని, టిల్లు స్క్వేర్ గాని కథ తో ఎలా ఉన్న పరవాలేదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు, అంటే ప్రధాన పాత్ర చుట్టూ తిరిగే కథ. ప్రేక్షకులని, తన నటనతో మెప్పిస్తే చాలు సినిమా హిట్ అయిపోతుంది. సరిగ్గా సిద్దు జొన్నలగడ్డ కూడా అలాగే చేసాడు, మంచి కామెడీ టైమింగ్, తెలంగాణ భాష తో ప్రేక్షకులని మెప్పించాడు.
ఇక ఈ టిల్లు స్క్వేర్ లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం భుజాల మీద మోశాడు. ఈ సినిమా డిజె టిల్లు ఎక్కడ ముగిసిందో అక్కడినుంచే మొదలవుతుంది, సినిమా స్టార్ట్ అయిన విధానం చూస్తే మంచి ఇంట్రెస్టింగ్ వెళ్తుంది అని అనిపిస్తుంది, కానీ లిల్లి మరియు టిల్లు లవ్ ట్రాక్ మొదలయ్యాక, మంచిగా వెళ్తున్న కథకి బ్రేకులు వేసినట్టు అనిపిస్తుంది. ఇక రెండవ భాగం కూడా అక్కడక్కడా స్లో గ అనిపించినా, సినిమాని కాపాడింది మాత్రం రెండవ భాగమే. కామెడీతో పాటు, యాక్షన్, కూడా ఉండడంతో ఎంగేజ్ చేస్తుంది.
సిద్ధు జొన్నలగడ్డ మల్లి అదే బాడీ లాంగ్వేజ్, తనదైన తెలంగాణ స్లాంగ్, కామెడీ అన్ని మంచిగా బాలన్స్ చేస్తూ నటించాడు. అనుపమ పరమేశ్వరన్ నటన పరంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ గ్లామర్ తో, రొమాంటిక్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఇక మురళీ శర్మ, మురళీధర్ గౌడ్, ప్రిన్స్ తదితరులు తమ తమ పాత్రల మేరకు బాగానే చేసారు.
దర్శకుడు మల్లిక్ రామ్, ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఫ్లేవర్ ని ఎక్కడ పోగొట్టకుండా, సినిమాని తెర పై బాగా ప్రెసెంట్ చేసాడు. కాకపోతే ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత కామెడీ ఈ సినిమాలో లేదనిపించింది. అయితే కథ ఎలాగూ మాములుగా ఉంది, కనీసం కామెడీ పైన ఇంకొంచెం కేర్ తీసుకుంటే, ఇంకా మంచి పంచ్ లు పేలేవి. ఏది ఏమైనా ప్రేక్షకుడిని మెప్పించడంలో విజయం సాధించాడని చెప్పాలి.
సాంకేతికంగా, టిల్లు స్క్వేర్ పర్వాలేదు, రామ్ మిరియాల పాటల్లో ఒక్క రాధికా పాట తప్ప మిగతా ఏవి అంత ఆకట్టుకోవు, కానీ నేపధ్య సంగీతం బాగుంది. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సినిమాకి తగ్గట్టు ఉంది.
చివరికి, టిల్లు స్క్వేర్ కామెడీ తో మెప్పిస్తుంది
ప్లస్ పాయింట్లు:
- కామెడీ
- అనుపమ గ్లామర్
మైనస్ పాయింట్లు:
- కథ
- ఎమోషన్ లేకపోవడం
సినిమా రేటింగ్: 3.5/5
ఇవి కూడా చుడండి: