అనుపమ పరమేశ్వరన్ అంటే గుర్తొచ్చేది పద్ధతైన క్యారెక్టర్స్. కానీ టిల్లు స్క్వేర్ అనే సినిమాతో మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ డోస్ పెంచి అందరికి షాక్ ఇచ్చింది. రౌడీ బాయ్స్ అనే చిత్రంతోనే రొమాంటిక్ పాత్రలో రెచ్చిపోయిన అనుపమ, ఈ టిల్లు స్క్వేర్ చిత్రంతో ఇంకా రెచ్చిపోయింది.
థియేటర్లో చుసిన అభిమానులు గాని, సినీ ప్రేక్షకులుగాని అనుపమేనా ఈ పాత్ర చేసింది అని అనుకోక మానలేదు. అయితే ఇదే విషయంపై అనుపమ పరమేహస్వరం ని ఇంటర్వ్యూలో గాని మీడియా తో ముచ్చటిస్తున్నప్పుడు గాని అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటంటే, ఎప్పుడు ఒకే రకమైన పాత్రలు చేసి బోర్ కొట్టింది, ప్రేక్షకులకి కూడా కొత్త అనుపని చూపించాలి అనే ఈ పాత్ర చేసానని చెప్పింది.
ఇక టిల్లు స్క్వేర్ భారీ విజయం సాధించడంతో, రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది అనే కథనాలు కూడా ఇంటర్నెట్లో చెక్కర్లు కొడ్తున్నాయి. ఇక చాల సినిమాలు కూడా చేస్తుండంతో మీడియా లో ఎప్పుడు అనుపమ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
అలా, అనుపమ ఒక యంగ్ హీరోతో డేటింగ్ చేస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సెలబ్రిటీ అయినా లైమ్ లైట్ లో ఉంటె రూమర్స్ వస్తూనే ఉంటాయి అందులో హీరోయిన్స్ కి ఇంకా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. మరి అనుపమ పరమేశ్వరన్ నిజంగానే రిలేషన్ ఉందా లేదా అనేది తనే చెప్పాలి.