సినిమాల్లో ఒక్క హిట్ పడింది అంటే చాలు, క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక వరుసగా రెండు మూడు హిట్స్ పడితే కెరీర్ జెట్ స్పీడ్ లో పరిగెడుతుంది. ఆలా గీత గోవిందంతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక మందన్న, ఆ తరువాత సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, వరుస హిట్లని అందుకుంది.
ఇక ఆ తరువాత వచ్చిన పుష్ప – ది రైజ్ ఊహించని రేంజ్ లో హిట్ అవ్వడంతో, ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. క్రేజ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచింది. ఇక పుష్ప తరువాత, రష్మిక మందన్న దాదాపు గా కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకునేది, కానీ హిందీ లో అడుగు పెట్టి యానిమల్ అనే సినిమా హిట్ అయ్యాక, రెమ్యూనరేషన్ డబల్ చేసేసింది అని నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు రష్మిక మందన, పుష్ప – ది రూల్ కి గాను దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సమాచారం. ఒకవేళ పుష్ప 2 గాని భారీ హిట్ అయితే ఈ 4 కోట్లని డబల్ చేసిన ఆశ్చర్యమేమీ లేదు.
ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలు మొదలైనప్పట్నుంచి రష్మిక మందన్ ఎప్పుడు మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని వారు వెల్లడించిన, కొన్ని వెకేషన్ ఫొటోస్ చూసి విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 తో పాటు,తెలుగులో రెయిన్బో మరియు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలు చేస్తుంది. వీటితో పాటు చావా అనే హిందీ సినిమా మరియు యానిమల్ పార్క్ కూడా చేస్తుంది.