సినిమా జీవితం అంటే గ్లామర్ తో పాటు, విలాసవంతమైన జీవితం, మంచి సంపాదన ఉంటాయి. అయితే హీరోలు రెమ్యూనరేషన్ల కంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్లు చాల తక్కువగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
ఇక హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనె సామెతని గట్టిగ నమ్ముతారు. చాల మంది హీరోయిన్లు, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో బిజినెస్లు మొదలుపెట్టి కోట్లు సంపాదించారు.
ఇక ఇండియా లో అత్యంత ధనిక హీరోయిన్ అంటే గూగుల్ లో మొదటి కనిపించేది ఐశ్వర్య రాయి బచ్చన్. ఐశ్వర్య రాయి బచ్చన్ కి దాదాపుగా 900 కోట్ల ఆస్తి ఉన్నట్టు సమాచారం. ఇంకా ఐశ్వర్య రాయి బచ్చన్ తరువాత ప్రియాంక చోప్రా 700 కోట్లు, అలియా భట్ 600 కోట్లు, దీపికా పదుకోన్ 500 కోట్లు విలువ గల ఆస్తులున్నాయి.
అయితే ఎవరికీ ఊహకి అందని ఆస్తి ఉన్న హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా? అలనాటి హీరోయిన్ జయలలిత. జయలలిత గారికి దాదాపుగా 1000 కోట్ల ఆస్తే కాకుండా, 1300 కిలోల వెండి, 30 కిలోల బంగారం ఉన్నట్టు సమాచారం. ఇంకా ఎన్నో కార్లు, స్తిరాసులు కూడా చాలానే ఉన్నాయ్.