హీరోయిన్లు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో, ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని సినిమాలకి గుడ్ బాయ్ చెపుతూనే ఉన్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ, అలియా భట్, తాప్సి పన్ను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక అదితి రావు హైదరి కూడా సిద్దార్థ్ ని పెళ్లి చేసుకుంది అనే వార్తలైతే జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక రీసెంట్ గా వారలష్మి శరత్ కుమార్, అప్సర కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంతకీ నితిన్ హీరోయిన్ ఎవరా అనే కదా మీ సందేహం. నితిన్ తో లై, చల్ మోహన రంగ చేసిన మేఘ ఆకాష్.
మేఘ ఆకాష్ సినిమాలు చాలానే చేసిన ఎందుకనో అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. తను రీసెంట్ గా తమిళ్ మూవీ సబా నయాగన్ లో నటించి హిట్ కొట్టింది.
ఇక ఈ పెళ్లి వార్తలు ఎలా వచ్చాయంటే, మేఘ ఆకాష్ రీసెంట్ గా చేతులకి మెహేంది పెట్టుకుని, ఇంస్టాగ్రామ్లో వెడ్డింగ్ వైబ్స్ అని హాష్ టాగ్ కూడా పెట్టింది. దింతో ఒక్కసారిగా ఇంటెర్నేట్న్ లో హల్చల్ చేసింది.
అయితే కాసేపటికే తెల్సింది ఏంటంటే, అది కేవలం ఫోటోషూట్ కోసం చేసిందని. కానీ త్వరలో మేఘ ఆకాష్ కూడా పెళ్లి చేసుకునే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి.