Rathnam Movie Review: తమిళ నటుడు విశాల్‌కి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా, అతను ఆకట్టుకునే సినిమాలని అందించలేదు. అతని చివరి చిత్రం, మార్క్ ఆంటోని, తమిళం మరియు తెలుగులో బాగా ఆడినప్పటికీ, అతని అభిమానులు ఆ చిత్రంతో సంతృప్తి చెందలేదు. విశాల్ భారీ యాక్షన్‌కు పేరుగాంచాడు అయితే ఇప్పుడు, కొంత గ్యాప్ తర్వాత, అతను రత్నం అనే సినిమాతో వచ్చాడు. రత్నం ని సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు ఇక రత్నం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆలస్యం చేయకుండా చిత్రం చూడదగినదో కాదో తెలుసుకుందాం.
రత్నం కథ
రత్నం (విశాల్) ఎప్పుడూ రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటాడు. ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముతిరకని)కి అత్యంత సన్నిహితుడు. రత్నం మల్లికని చుసిన వెంటనే (ప్రియా భవానీ శంకర్) ప్రేమలో పడతాడు, అయితే గూండాలు మల్లికను చంపడానికి ప్రయత్నించినప్పుడు కథ అడ్డం తిరుగుతుంది. చివరగా, రత్నం ఆమెను ఎలా రక్షించాడు మరియు మల్లికను గూండాలు ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనేది సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది.
రత్నం మూవీ నటీనటులు
విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీ శర్మ, యోగి బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. ఇన్వెనియో ఆరిజిన్ మరియు జీ స్టూడియోస్‌తో కలిసి స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తెకేన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
సినిమా పేరు | రత్నం |
దర్శకుడు | హరి |
నటీనటులు | విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీ శర్మ, యోగి బాబు తదితరులు |
నిర్మాతలు | కార్తెకేన్ సంతానం |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
సినిమాటోగ్రఫీ | ఎం సుకుమార్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
రత్నం సినిమా ఎలా ఉందంటే?
అవుట్ డేటెడ్ కథ అని మనకి ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. ఇక ఈ చిత్రం కూడా పాత సన్నివేశాలు మరియు ఆకర్షణీయంగా లేని కథనంతో నడుస్తుంది. ఈ యాక్షన్ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు, అతను అన్ని సినిమాల్లో వేగవంతమైన కథనాన్ని అనుసరిస్తాడు, కానీ ఈ చిత్రంలో, మనం అతని మార్క్‌ను మిస్ అవుతాము.
ఎక్కడ కూడా ఫాస్ట్ నరేషన్ లేకుండా స్లో గా ఉండి బోర్ కొడ్తుంది. ఇక చూస్తున్నంత సేపు ఇది హరి సినిమానేనా అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు మరియు అతని పాటలు డిజాస్టర్లుగా నిలిచాయి, అయితే అతను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాక్షికంగా ఆకట్టుకున్నాడు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు సరిపోయింది కానీ అంత గొప్పగా ఏమీ లేదు.
రత్నం సినిమానే బాగానే మొదలవుతుంది కానీ వెంటనే , కాలం చెల్లిన టెంప్లేట్ బేస్డ్ కమర్షియల్ ఫార్మటులో కథ నడుస్తూ ఉంటుంది. మల్లికను గూండాలు ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనే పాయింట్ కొంత మేరకు ఎంగేజ్ చేస్తుంది, మరియు యాక్షన్ లవర్స్‌ని ఎంగేజ్ చేసే అనేక యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి. అయితే సెకండాఫ్ ప్రేక్షకులకు పీడకలగా మారుతుంది. సెకండాఫ్ మొత్తం యాక్షన్‌తో నిండిపోయి, ఎమోషనల్ కనెక్షన్ లేకుండా పేలవంగా తయారవుతుంది. మరియు మల్లికని చంపడం వెనుక కారణం అస్సలు కన్విన్సింగ్ లేదు .
విశాల్ అద్భుతమైన నటనను కనబరిచాడు మరియు అతను యాక్షన్ సన్నివేశాలలో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇక ప్రియా భవాని శంకర్ ఉన్నంతలో పర్వాలేదు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. మిగిలిన నటి నటులు పర్వాలేదు.
రత్నం రొటీన్ కమర్షియల్ చిత్రం, అయితే ఈ చిత్రం యాక్షన్ లవర్స్ కి నచ్చొచ్చు.
ప్లస్ పాయింట్లు:
- విశాల్ పెర్ఫార్మెన్స్
- యాక్షన్ బ్లాక్‌లు
మైనస్ పాయింట్లు:
- కాలం చెల్లిన కథ
- ఊహించదగిన కథనం
- ఎమోషన్ లేకపోవడం
- సెకండ్ హాఫ్
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Geethanjali Malli Vachindi Movie Review: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ రివ్యూ
- Tillu Square Movie Review: టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ
- Love Guru Movie Review: లవ్ గురు మూవీ రివ్యూ