Actor Abbas: యాక్టర్ అబ్బాస్ అంటే మనకి గుర్తుకు వచ్చేది తన హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ తో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన ఏకైక హీరో మన అబ్బాస్. ప్రతి సెలూన్ షాప్ లో అబ్బాస్ హెయిర్ స్టైల్ తో ఉన్న ఉండేది, మరియు అప్పుడు ప్రతి యువకుడు అబ్బాస్ కటింగ్ మాత్రమే చేయించుకునేవారు.
మోడలింగ్తో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అబ్బాస్, ఆ తరువాత 1996 లో ప్రేమ దేశం సినిమాతో యాక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఇక ఆ సినిమా తరువాత, అమ్మాయిల గుండెల్లో కళల రాకుమారుడిగా మారిపోయాడు.
ఆ తరువాత, హీరోగానే కాకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగమ్ చేసుకుని చాల సినిమాల్లో నటించాడు. ఇక వరుస ప్లాపుల తరువాత, అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయే సరికి, అమెరికా వెళ్ళిపోయాడు.
అబ్బాస్ 2000 వ సంవత్సరంలో ఫ్యాషన్ డిజైనర్ ఎరామ్ అలీని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఒక కొడుకు మరియు కూతూరు ఉన్నారు. రీసెంట్ అబ్బాస్ తన ఫామిలీ ఫోటోని షేర్ చేసాడు.
ఇక ఆ ఫొటోలో అబ్బాస్ కొడుకుని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. అదేదో అందవిహీనంగా ఉన్నందుకు కాదండి. అచ్చం అబ్బాస్ లాగే అందంగా ఉన్నందుకు. అబ్బాస్ యుక్త వయసులో ఎలా ఉండేవాడో అలానే ఉన్నాడు.
హీరో అయ్యే లక్షణాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి, మరి అబ్బాస్ తన కొడుకుని హీరోని చేస్తాడా లేదా చూడాలి.
ప్రస్తుతం అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తూన్నాడు. తను సినిమాలైతే చేయడంలేదు కానీ, కొడుకుని హీరో చేస్తే బాగుంటుంది అని చాల మంది ఆశిస్తున్నారు.