రీసెంట్ గానే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది పోకిరి మూవీ. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గ నిలిచిన ఈ మూవీని ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు.
ఒక్క మహేష్ బాబుకే కాదు,హీరోయిన్ గా నటించిన ఇలియానాకి కూడా మంచి పేరొచ్చింది. పోకిరిలో నటించిన ప్రతి నటి నటులకు మంచి పేరు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇంతకీ పోకిరిలో లేడీ విలన్ ఎవరు అనుకుంటున్నారా? అదేనండి ప్రకాష్ రాజ్ కి లవర్ గా నటించిన జోతి రానా. తన బాడీ లాంగ్వేజ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
జోతి రానా, పోకిరి తరువాత, రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలో నటించింది. ఇక ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు, కానీ హిందీ లో కొన్ని బోల్డ్ పాత్రలు చేసింది.
ఇక చాల గ్యాప్ తరువాత, ఇప్పుడు తన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, జోతి రానా తన పేరుని శివ రానా అని మార్చుకుని, ఇంతకన్నా బోల్డ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కి గురి చేసింది.