Tollywood:సెలెబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలని సగటు మనిషికి ఉండే కుతూహలం. అయితే సెలెబ్రిటీలకేంటి, డబ్బు, విలాసవంతమైన జీవితం ఉంటుంది అని చాల మంది అనుకుంటారు, అది వాస్తవం కూడా.
అయితే నాణానికి ఒకవైపు విలాసవంతమైన జీవితం అయితే, మరో వైపు పర్సనల్ బాధలు కూడా ఉంటాయి కానీ ఈ విషయం చాల మందికి తెలీదు. అలా, స్టార్ సింగర్ అయినా కౌసల్య కూడా అద్భుతమైన పాటలు పాడి మంచి పాపులర్ అయింది. దాదాపుగా 300 పైగా పాటలు పాడినా కౌసల్య, చక్రి మ్యూజిక్ డైరెక్షన్లో మంచి పాటలు పాడింది.
అయితే మరోవైపు, పెళ్లి చేసుకుని, తను అనుభవించిన బాధలు అంత ఇంత కాదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కౌసల్య తన పర్సనల్ లైఫ్ గురించి ఇలా చెప్పుకొచ్చింది.
కౌసల్య మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది, అయితే కౌసల్యని తన భర్తతో పాటు, ఇంట్లో వాళ్ళందరూ చిత్ర హింసలు పెట్టేవారంట. ఇక కొడుకు పుట్టాక, తన భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసాక, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందట.
ఇక కొడుకు భాద్యత కూడా తనే తీసుకుని పెంచి పెద్ద చేసిందట. ఇక కొడుకు పెద్దయ్యాక తల్లి ఒంటరి తనాన్ని చూడలేక, తనని రెండవ పెళ్లి చేసుకోమని పదె పదె అడుగుతుంటాడంట.
ఈ మధ్య కాలంలో రెండవ పెళ్లి అనేది సహజమైన విషయం అయిపోయింది. ఇక ఇండస్ట్రీలోని ఎంతో మంది చేసుకున్న విషయం తెలిసిందే. మరి కౌసల్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.