తమిళ హీరో జై కి జర్నీ అనే సినిమాతో మంచి ఫేమ్ వచ్చింది. కానీ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ హిట్స్ మాత్రం పడట్లేదు.
ఇక సినిమాల సంగతి ఆటుంచితే, జై పేరు అప్పట్లో మీడియాలో మారు మోగిన విషయం తెలిసిందే. నటి అంజలి తో ప్రేమాయణం నడిపిన జై పేరు అప్పట్లో తరుచు మీడియాలో వినిపిస్తుండే.
ఇక చాల రోజులు ఇద్దరు ప్రేమించుకుని, పెళ్ళి కూడా చేసుకుంటారు అని అంట అనుకుంటున్న సమయంలో, ఇద్దరు విడిపోయారు.
వెంటనే కారణాలు ఏంటని తెలియలేదు కానీ, ఆ తరువాత జై అంజలీ ని మోసం చేసాడని అందుకే తను వదిలేసిందని అంటుంటారు.
ఇక ఇప్పుడు మల్లి జై పేరు ఎందుకు వైరల్ అయ్యిందంటే, జై రీసెంట్ గా, కొత్త లోపే మొదలుపెడ్తున్నాడు అని, ఒక అమ్మాయి తో ఫోటో దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు.
ఇక ఆ ఫోటో చూసి అందరు జై పెళ్లి చేసుకున్నాడు అనుకున్నారు, కానీ అసలు విషయం ఏంటంటే, అది సినిమా ప్రమోషన్ అని.
నటి ప్రగ్య నగరతో బేబీ అండ్ బేబీ మూవీ చేసిన జై, ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చేసింది అని తెలియడంతో అందరు షాక్ కి గురయ్యారు.
ఏది ఏమైనా, ఆ పోస్ట్ మాత్రం నెట్టింట్లో చాల వైరల్ అయిపోయింది. ఇక జై అండ్ ప్రగ్య నగర చేస్తున్న బేబీ అండ్ బేబీ చిత్రం బాగా ఆడాలని ఆశిద్దాం.