జయం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయినా సదా, తెలుగు ప్రేక్షకులని కొన్ని సంవత్సరాలు అలరించింది. ఇక జయం తరువాత, తెలుగులో చాల సినిమాలే చేసింది.
ఇక చాల సంవత్సరాల క్రితమే, హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో, చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు నీతోనే డాన్స్, ఢీ షోలో జడ్జ్ గా చేసింది. ప్రెసెంట్ నీతోనే డాన్స్ షో తో బిజీ గా ఉంది.
ఇక ఈ షో సందర్బంగా సదాని తన పెళ్లి గురించి అడగ్గా, త్వరలోనే చేసుకుంటాను అని చెప్పడం జరిగింది.
ఇక 40 వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకపోవడంతో, తనకి ఎప్పుడు ఈ ప్రశ్న ఎదురుఅవుతూనే ఉన్నాయ్. అందులోను ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అవకాశాలు తగ్గేసరికి పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు.
మరి సదా ఎందుకు చేసుకోవట్లేదు అని చాల మందికి ఉన్న సందేహం. అయితే సదా పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఉంది.
అది ఏంటంటే, సదా అప్పట్లో ఒక తమిళ్ హీరోని ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. చివరికి ఆ హీరో నుండి విడిపోవాల్సి వచ్చింది. ఇక అప్పట్నుంచి ఇంకా పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుందట.
అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సదా త్వరలో చెన్నై కి చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతుంది అని పుకార్లు వినిపిస్తున్నాయి.