ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గగానే, పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు, అలాగే, చేతి నిండా సినిమాలు ఉన్న కూడా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు.
ఇక కొందరేమో పెళ్ళైన కొన్ని నెలలకి ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్తే, మరి కొందరేమో కొన్ని సంవతసరాలైన ప్రెగ్నెసీ గుడ్ చెప్పలేదు.
అలియా భట్ పెళ్ళైన కొన్ని నెలలకే గుడ్ న్యూస్ చెప్పగా, దీపికా పదుకోన్ పెళ్ళైన చాల సంవత్సరాల తరువాత తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది.
ఇక అదే బాటలో మరో హీరోయిన్ చేరింది, ఆవిడ ఎవరు అని అనుకుంటున్నారా, అదేనండి కత్రినా కైఫ్.
తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరి, బాలకృష్ణ సరసన అల్లరి పిడుగులో నటించి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన హీరోయిన్ అయింది.
ఇక కత్రినా కైఫ్, స్టార్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇక చాల సంవత్సరాల తరువాత, కత్రినా కైఫ్ తల్లి కాబోతుంది అనే వార్త అందర్నీ సంతోషానికి గురిచేసింది.
అయితే కత్రినా కైఫ్ గాని, విక్కీ కౌశల్ గాని అధికారికంగా ప్రకటించలేదు, కానీ రీసెంట్ గా కత్రినా ఒక ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ కత్రినా కైఫ్ బేబీ బంప్ చూసి అందరు తల్లి కాబోతుంది అనుకున్నారంట.