Arjuna Phalguna Movie Review: రాజరాజ చోరార బంపర్ హిట్ తర్వాత యాక్టర్ శ్రీవిష్ణ మరో సారి తన స్టామినాని అర్జుణ ఫాల్గుణతో నిరూపించుకున్నాడు. ఈ రోజు, డిసెంబర్ 31న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. యాక్షన్, కామెడీని కలిపి తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. ఈ ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలను మనమిప్పుడు తెలుసుకుందాం.
కథ
కథ విషయానికి వస్తే.. భాగవతంలో పాండవుల్లో ఐదుగురి ఫ్రెండ్స్ అర్జున్, రాంబాబు, తడ్డోడు, ఆస్కార్, శ్రావణిల చూట్టూ కథ సాగుతూఉంటుంది. ఈ స్నేహితులు తమ పేర్లను గమ్మత్తుగా ఆది, రాఖీ, సింహాద్రి, యమదొంగ అని చెప్పుకుంటారు. వీరు పోలీసులకు చిక్కినప్పటినుంచి కథ మలుపు తిరిగి ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అసలేంటా కథ, వీరు పోలీసలకు ఎందుకు చిక్కుతారు లాంటి విషయాలను తెలుసుకోవాలంటే మీరు నేరుగా సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.
నటీనటులు, తారాగణం
ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం వహించింది తేజ మర్ని. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి ఈ మూవీని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, సీనియర్ నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య గరికపాటి ప్రధాన పాత్రలు పోశించారు.
సినిమా ఎలా ఉందంటే
కథ రొటీన్ కి భిన్నంగా ఉంది. కామెడీ, టైమింగ్ ప్రెజెంటేషన్ బాగున్నాయి. ప్రియదర్శన్ బాలసుబ్రమనియన్ సమకూర్చిన సంగీతం సినిమాకు కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సుధీర్ వర్మ రచించిన డైలాగ్స్ బాగుంటాయి. మొత్తంగా స్నేహితులతో పాటు కుటుంబంతో కూడా కలిసి చూడదగ్గ సినిమా “అర్జుణ ఫాల్గుణ”.
మూవీ రేటింగ్: 3.5/5
ఇవి కూడా చూడండి:
- Arjuna Phalguna: అర్జుణ ఫాల్గుణ మూవీ డౌన్ లోడ్ లీక్
- Arjuna Phalguna Box Office Collection: అర్జుణ ఫాల్గుణ బాక్సాఫీస్ కలెక్షన్