Prasanna Vadanam Movie Review:టాలెంటెడ్ నటుడు సుహాస్, రైటర్ పద్మభూషణ్ మరియు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు, అతను ప్రసన్న వదనంతో తన హిట్ పరంపరను కొనసాగించడానికి తిరిగి వచ్చాడు. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కథాంశంతో సినిమా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ఈ సినిమా ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్‌ని సంపాదించుకుంది. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
ప్రసన్న వదనం కథ
సూర్య (సుహాస్) అనే యువకుడు రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఒక రోజు, తను మరియు అతని కుటుంబం ఆక్సిడెంట్కి గురవుతారు, పాపం ఆ ప్రమాదంలో సూర్య తన తల్లిదండ్రులను కోల్పోతాడు మరియు అతను తన దృష్టిని కోల్పోతాడు. అంటే అతను ‘ప్రోసోపాగ్నోసియా’ డిజార్డర్‌తో బాధపడుతుంటాడు, వ్యక్తుల ముఖాలను గుర్తించలేని ఒక రేర్ కండిషన్. అతని పరిస్థితి గురించి తెలిసిన ఏకైక వ్యక్తి అతని స్నేహితుడు విఘ్నేష్ (వివా హర్ష). అయితే సూర్య ఒక హత్యను చూసినప్పుడు కథలో మలుపు తిరుగుతుంది. చివరకు అతను హత్య గురించి పోలీసులకి ఎలా చెప్పాడు మరియు అతను హంతకుడిని ఎలా కనుగొన్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్రసన్న వదనం మూవీ నటీనటులు
సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, హర్ష చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది అర్జున్ YK. ఈ చిత్రానికి సంగీతం విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ: ఎస్ చంద్రశేఖరన్. అర్హ మీడియాతో కలిసి లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | ప్రసన్న వదనం |
దర్శకుడు | అర్జున్ YK |
నటీనటులు | సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, హర్ష చెముడు, తదితరులు |
నిర్మాతలు | మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టిఆర్ |
సంగీతం | విజయ్ బుల్గానిన్ |
సినిమాటోగ్రఫీ | ఎస్ చంద్రశేఖరన్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
ప్రసన్న వదనం సినిమా ఎలా ఉందంటే?
ప్రసన్న వదనం ఆకర్షణీయమైన కథాంశాన్ని కలిగి ఉంది మరియు దర్శకుడు సినిమాని స్క్రీన్‌పై అద్భుతంగా ప్రదర్శించాడు. సినిమా పాత్రల పరిచయం మరియు కథాంశం ఎస్టాబ్లిష్ చేస్తూ ఆసక్తి కరంగా మొదలవుతుంది.
ఫస్ట్ హాఫ్‌లో పర్ఫెక్ట్ ప్లాట్ ఎస్టాబ్లిషమెంట్ తో మరియు పాత్రల పరిచయంతో మొదలైన ఈ కథ, సూర్య మరియు ఆధ్యల ప్రేమ కోణం మనల్ని కాసేపు నవ్విస్తుంది ఇక వైవా హర్ష మరియు సుహాస్లు కూడా తమ కామెడీతో ఎంగేజ్ చేసారు
ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ చూడాలనే ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది కానీ కొంత సమయం తర్వాత, నెమ్మదిగా సాగే కథనంతో ఫ్లాట్ అవుతుంది. అయితే, సూర్య ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించి, ఒక్కొక్కటిగా ట్విస్ట్‌లు రివీల్ అవ్వడం మొదలుపెట్టి క్లైమాక్స్ వరకు సినిమా చూసేలా చేస్తుంది.
సుహాస్ మళ్లీ అద్భుతంగా నటించాడు మరియు ఈ చిత్రం అతని కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది అందంలో ఎలాంటి సందేహం లేదు. ఆధ్య గా పాయల్ బాగానే చేసింది, వైవా హర్ష తన సత్తా చాటాడు ఇక పోలీస్ పాత్రలో రాశి సింగ్ అంతగా సూట్ అవ్వలేదు. మిగిలిన నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.
దర్శకుడు అర్జున్ YK సినిమాను చాలా చక్కగా హ్యాండిల్ చేసాడు కానీ సెకండాఫ్‌లో డ్రామాపై మరింత బాగా తీసుంటే ఇంకా బాగుండేది. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంలో రెండు అద్భుతమైన పాటలను కంపోజ్ చేసాడు మరియు ఆ పాటలు సినిమాలో బాగా నిలిచాయి. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద అసెట్. ఎస్ చంద్రశేఖరన్ మంచి విజువల్స్‌ని అందించారు.
ప్రసన్న వదనం తప్పక చూడవలసిన చిత్రం, ఏ వర్గం ప్రేక్షకులు అయినా ఈ చిత్రాన్ని హ్యాపీ గా చూసేయొచ్చు.
ప్లస్ పాయింట్లు:
- కథ
- సుహాస్ నటన
- వైవా హర్ష కామెడీ
మైనస్ పాయింట్లు:
- అక్కడక్క స్లో కథనం
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
- Rathnam Movie Review: రత్నం మూవీ రివ్యూ
- Love Guru Movie Review: లవ్ గురు మూవీ రివ్యూ
- Tillu Square Movie Review: టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ