’30 వెడ్స్ 21′ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్యరావు రిసల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ‘శరతులు వర్తిస్తాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక చైతన్య రావు మరో కొత్త చిత్రం ‘డియర్ నాన్న’ తో మన ముందుకొస్తున్నాడు.. కానీ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకుండా, డైరెక్టుగా OTT లో రిలీజ్ అవుతుంది. ‘డియర్ నాన్నా’ జూన్ 14, 2024న ఆహా వీడియో లో విడుదల అవుతుంది.
ఇటీవల, ఆహా వీడియో OTT ప్లాట్‌ఫాం ట్రైలర్‌ను కూడా విడుదల చేసారు.ఇక ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఇది తండ్రీ కొడుకుల బంధం చుట్టూ తిరుగుతుంది అని అనిపిస్తుంది. మరియు ఈ చిత్రంలో మెడికల్ షాప్ కీలక పాత్ర పోస్తిస్తునట్టు అనిపిస్తుంది.
డియర్ నాన్న ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 14, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో చైతన్యరావు, సూర్య, శశాంక్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రాన్ని సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించగా, రీ సంగీతం అందించారు, బాల సరస్వతి కెమెరా పనులు నిర్వహించారు. ఈ చిత్రానికి మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మాతలు.