కొన్ని రోజుల క్రితం, నటి నివేదా పేతురాజ్ పోలీసులతో వాదిస్తున్న వీడియో వైరల్ అయ్యింది మరియు ఆ వీడియో నిజమే అయినప్పటికీ అది పరువు అనే వెబ్ సిరీస్ ఐ సంబంచిన వీడియో అని తెలియడంతో అందరు ఆశ్చర్యపోయారు.
ఇటీవలే పరువు సిరీస్ నిర్మాతలు ఈ సిరీస్ తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో ప్రసారం చేయబడుతుందని చెప్తూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక, పరువు జూన్ 14, 2024న Zee5 OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలవుతుంది.
ఈ సిరీస్ లో నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు కొణిదెల, రమేష్, సునీల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మొయిన్, అమిత్ తివారీ, అనిల్ తేజ, బిందు చంద్రమౌళి, అఖిలేష్, రవితేజ మహాదాస్యం, బిందు మాధవి మరియు తదితరులు నటించారు.
ఈ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి మరియు సుస్మిత కొణిదెల నిర్మించారు. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: చింతా విద్యాసాగర్.