ఫలితాలు ఎలా ఉన్నా లెక్క చేయకుండా హీరో సుధీర్ బాబు మాత్రం డిఫరెంట్ సినిమాలు చేస్తునే ఉన్నాడు . అయితే మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి.
ఇక మళ్లీ ”హరోం హర” అనే యాక్షన్ చిత్రంతో మన ముందుకొచ్చాడు. టీజర్ మరియు ట్రైలర్లో మంచి డార్క్ విజువల్స్ మరియు అద్భుతమైన సౌండ్ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాయి. మరి సినిమా చూడదగ్గదేనా లేదా అనేది ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
సుబ్రమణ్యం లైబ్రేరియన్‌గా పని చేయడానికి కుప్పంకి వస్తాడు. కొన్ని పరిస్థితులలో, అతను తన తండ్రి అప్పులను తీర్చడానికి తుపాకీలను తయారు చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఎం జరిగింది అనేది మిగతా కథ.
హరోం హర ట్రైలర్ మరియు విజువల్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడని విదంగా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా నిరాశ పరిచింది అనే చెప్పాలి.
కథనం నుండి, ఈ చిత్రం పుష్ప, KGF మరియు అనేక చిత్రాల సమ్మేళనంలా కనిపిస్తుంది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించదు.
మంచి విజువల్స్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప సినిమాలో ఏమీ లేదు. సుధీర్ బాబు సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ఇక సునీల్ మరియు మాళవిక వంటి మిగిలిన నటీనటులు పర్వాలేదు.
మొత్తంమీద, హరోమ్ హర అనేది రొటీన్ మరియు బోరింగ్ యాక్షన్ డ్రామా. మీకు మంచి యాక్షన్, అద్భుతమైన విజువల్స్ మరియు అద్భుతమైన మ్యూజిక్ కావాలంటే ఈ సినిమాని చుడండి.