మక్కల్ సెల్వన్ యొక్క 50వ చిత్రం ‘మహారాజా’ ఎట్టకేలకు తెలుగు మరియు తమిళంలో థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే. తమిళంలో కంటే తెలుగులో విజయ్ సేతుపతి ఈ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేశాడు.
మహారాజు అనే కటింగ్ షాప్ ఓనర్ తన భార్య మరియు కుమార్తెతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ రోజు లక్ష్మి మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు.
అసలు లక్ష్మి ఎవరు? అనేది సినిమా చూసి తెల్సుకొవాలి.
సినిమా మంచి సన్నివేశంతో మొదలై ఆ మూడ్ ని చివరి వరకు కొనసాగిస్తుంది. కథ సాదాసీదాగా ఉంది కానీ నాన్ లీనియర్ కథనం సినిమాకు ప్రత్యేకత.
దర్శకుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో డ్రామాను చాల బాగా మిళితం చేశాడు. అయితే, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు కొంత గందరగోళాన్ని క్కలిగించే అవకాశం కూడా ఉంది.
సినిమాలో ఎమోషన్స్ బాగా పండాయి. విజయ్ సేతుపతి నటనలో మళ్ళి తన సత్తా చాటాడు. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ అనురాగ్ కశ్యప్ బాగా చేసాడు.
ఓవరాల్‌గా, మహారాజా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన మంచి ఎమోషనల్ థ్రిల్లర్..